Tag Archives: janta curfew

మరో మూడు రోజులు రైళ్లు బంద్.. దేశంలో 324కు చేరిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 300 దాటంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జనతా కర్ఫ్యూ కారణంగా ఆదివారం ఒక్క రోజు రైళ్లను రద్దు చేయగా.. దాన్ని మరో మూడు రోజులు పొడిగించినట్లు తెలుస్తోంది. మార్చి 25 వరకు రైళ్లను రద్దు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించిందని సమాచారం. కోవిడ్ అనుమానితులు ఎక్కువగా రైళ్లలో ప్రయాణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా సోకిన 10 మంది ఇండోనేసియన్లు రైలు ద్వారానే ఢిల్లీ నుంచి కరీంనగర్ చేరుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ...

Read More »

జనతా కర్ఫ్యూ: లైవ్‌లో సందడి చేస్తోన్న 28 మంది టాలీవుడ్ స్టార్స్

కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ ప్రజలంతా ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ను పాటిస్తున్నారు. దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే, ఇళ్లలో ఖాళీగా కూర్చున్న తెలుగు సినిమా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా టాలీవుడ్ స్టార్స్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా పలకరిస్తున్నారు. వాళ్లతో ముచ్చటిస్తున్నారు. ‘మనందరి కోసం’ అనే స్లోగన్‌తో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచే ఈ లైవ్‌లు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు మంచు లక్ష్మితో ...

Read More »