Tag Archives: kcr

దమ్ముంటే వాళ్ల పేర్లు బయటపెట్టండి.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

తెలంగాణలో కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపణలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే వాళ్ల పేర్లు బయటపెట్టాలని కేసీఆర్‌కు సవాల్ చేశారు. బలవన్మరణానికి పాల్పడ్డ రైతుల పేర్లను 48 గంటల లోపల బయటపెడితే తాను బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తానని స్పష్టం చేశారు. ఏప్రిల్ 6న జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు సీఎం రేవంత్ తుక్కుగూడకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. మాజీ సీఎం ...

Read More »

కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు : సీఎం రేవంత్

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ పరిస్థితి చూస్తే.. జాలేస్తోంది. ఆయన అధికారం పోయిన బాధలో ఉన్నారు. పదేళ్ల తరువాత కేసీఆర్ కి రైతులు గుర్తుకొచ్చారు. మా వల్లనే కరువు వచ్చిందని అంటున్నారు. వర్షాలు కురవకపోవడంతో కరువు వచ్చింది. మేము అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అవుతోంది. మా వల్ల కరువు ఎలా వస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ అధికారం కోల్పోయిన దు:ఖంలో ఉన్నాడు. రైతుల మీద కేసీఆర్ రాజకీయం చేస్తున్నాడు. మేడిగడ్డ ...

Read More »

KCR, బండి సంజయ్‌లపై పొన్నం ప్రభాకర్ ఫైర్

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మాజీ సీఎం కేసీఆర్‌లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ..ఎంపీగా ఐదు సంవత్సరాలు ఉండి ప్రజా సమస్యలు పట్టించుకోని బండి సంజయ్‌కి, నాలుగు నెలల పాటు ఉలుకు పలుకు లేకుండా ఇప్పుడు పొలాల బాట పట్టిన కేసిఆర్ ఈరోజు రైతుల దగ్గర ముసలి కన్నీరు కారుస్తూ డ్రామాలకు తెరలేపారని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసిఆర్, బండి సంజయ్ ఇద్దరూ కూడా ఇక్కడ దీక్ష ...

Read More »

రేపు 3 జిల్లాల్లో కేసీఆర్ పర్యటన, రైతులతో సమావేశం

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. నీరు లేక ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం, బాధిత రైతులతో సమావేశమవుతారు. జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అంతకుమునుపు, మాజీ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పొలాల పరిస్థితిని పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రంలో ...

Read More »

కేసీఆర్ చేసిన పాపం ఆయనకే తగిలింది : మంత్రి కోమటిరెడ్డి

కేసీఆర్ చేసిన పాపం ఆయనకే తగిలింది అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్ మాత్రమే మిగులుతాడు. లోక్ సభ ఎన్నికల తరువాత హరీశ్ రావు బీజేపీలో చేరుతాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం మూడు నెలలే అయింది. మాపై దాడి చేయడం కేకే లాంటి సీనియర్ నేతలకు నచ్చకనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరికీ టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పని చేస్తాం. నల్గొండ, భువనగిరి ఎంపీ ...

Read More »

ఎన్నికలకు దూరంగా ఉన్న కేసీఆర్ కుటుంబం!

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. లోక్‌‌సభ ఎన్నికల బరి నుంచి బీఆర్‌‌‌‌ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఫ్యామిలీ తప్పుకున్నది. 23 ఏండ్ల ఆ పార్టీ చరిత్రలో ఇట్ల ఒక కీలక ఎలక్షన్​ నుంచి కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా తప్పుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం 17 లోక్​సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. అందులో ఎక్కువ మంది కొత్తవాళ్లే. పార్టీని కేసీఆర్ స్థాపించిన అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం పోటీ చేస్తూనే ఉంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితల్లో ఎవరో ఒకరు ఎన్నికల బరిలో ...

Read More »

హైదాబాద్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్.. అభ్యర్థుల ఎంపిక పూర్తి

లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల ఎంపికను బీఆర్ఎస్ పూర్తిచేసింది. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీని దాటేసింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా మిగిలిన ఆ ఒక్క స్థానానికి అభ్యర్థిని ఫైనల్ చేశారు. హైదరాబాద్ స్థానం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ పేరును ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉండి కొన్ని కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తుండగా కేసీఆర్ మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడే బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే ఆదిలాబాద్‌ఆత్రం ...

Read More »

అక్కడి నుంచే కేసీఆర్ పోటీ!

మెదక్‌ లోక్‌సభ అభ్యర్థిత్వం విషయంలో గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని జహీరాబాద్‌ టికెట్‌ను ప్రకటించినప్పటికీ, మెదక్‌ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ టికెట్‌ను వంటేరు ప్రతాప్‌రెడ్డికి ఇవ్వాలని అధినేత కేసీఆర్‌ పక్షం రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించడం లేదు. కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం తేలిన తర్వాత ఇక్కడి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ టికెట్‌పై ఉత్కంఠ అలాగే కొనసాగుతోంది. కాగా ఈ టికెట్‌ కోసం మరో ఇద్దరు ముఖ్యనాయకులు ...

Read More »

నేడు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు కరీంనగర్ లో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అచ్చొచ్చిన కరీంనగర్ లో ఈ రోజు సాయంత్రం భారీ బహిరంగ సభలో గులాబీ బాస్ పాల్గొననున్నారు. అయితే బీఆర్ఎస్ కరీంనగర్ స్థానం బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దాదాపు లక్ష మంది సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల, బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ వినోద్ కుమార్ లు జన సమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇక్కడి ...

Read More »

తెలంగాణలో కీలక పరిణామం… కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను నందినగర్‌లోని ఆయన నివాసంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న సమయంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీ చేస్తాయని… నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీరి కలయిక ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు హరీశ్ ...

Read More »