Tag Archives: kcr

ఆస్పత్రిలో చేరిన కెసిఆర్‌

తెలంగాణ సిఎం కెసిఆర్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన కెసిఆర్‌కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఊపిరితిత్తుల్లో మంట ఉండటంతో ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయనకు ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌ పరీక్షలు చేయనున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

Read More »

భార‌త్ బంద్‌కు టీఆర్ఎస్ సంపూర్ణ మ‌ద్ద‌తు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా  ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్య‌క్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటారని ఆయన తెలిపారు.  వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తోన్న న్యాయ‌మైన పోరాటాన్ని కేసీఆర్ స‌మ‌ర్థించారు.  రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ వ్యతిరేకించిందని,  ఈ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ ...

Read More »

ప్రాంతీయ భాషల్లోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీకి వేర్వేరుగా శుక్రవారం ఉదయం లేఖలు రాశారు. హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించడం వల్ల ఇతర ప్రాంతీయ భాషల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల అభ్యర్థులకు సమాన అవకాశాలు ఇచ్చే విధంగా ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను ఆయన తెలిపారు. అలాగే రాష్ట్రపతికి రాసిన లేఖలో ...

Read More »

తక్షణ సాయంగా రూ.1350 కోట్లు ఇవ్వండి.. కేంద్రానికి కేసీఆర్ లేఖ

వర్షం వల్ల అతలాకుతలమైన తెలంగాణకు సాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. తక్షణ సాయం కింద రూ.1350 కోట్లు సాయం అందించాలని సీఎం కోరారు. భారీ వర్షం, వరదల కారణంగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని కేసీఆర్ తన లేఖలో వివరించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా రూ.5000 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రధానికి వివరించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణ సహాయం, పునరావాస చర్యల ...

Read More »

ఎపి, తెలంగాణ కొట్టుకుంటే.. కేంద్రం పెత్తనం చేస్తోంది..!

రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు, అధికారాలు లేకుండా బలమైన కేంద్రం ఉండాలనే ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాకు అనుగుణంగానే మంగళవారం జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఉంది. బోర్డుల పరిధి, నీటి కేటాయింపులు, ప్రాజెక్టులకు అనుమతులు వంటి విషయాల్లో తుది నిర్ణయం తమదేనని చెప్పడం రాష్ట్రాల హక్కులను హరించడమే. ట్రిబ్యునల్‌ కేటాయిపుల ఆధారంగా రాష్ట్రాలు ప్రాజెక్టులను చేపట్టడం సర్వసాధారణం.. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలి అనేది రాష్ట్రాల పరిధిలో ఉండే వ్యవహారం. ప్రాజెక్టుల నిర్వహణ ...

Read More »

కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్న ఏపీ టీడీపీ నేతలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని టీడీపీ నేతలు స్వాగతించారు. మంచి నిర్ణయమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఎన్టీఆర్‌పై అభిమానాన్ని కేసీఆర్ ఇలా చాటుకున్నారనే చర్చ జరుగుతోంది. అసలు విషయానికి వస్తే.. తెలంగాణలో పదో తరగతి పాఠ్యాంశంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రను చేర్చారు. ఈ ఏడాది కొత్తగా రూపొందించిన సిలబస్‌లో పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 268 పేజీలో ఎన్టీఆర్ జీవిత విశేషాలను పొందుపరిచారు. సాంఘిక శాస్త్రంలో బుక్‌లో ఢిల్లీ పెద్దలు చేస్తున్న పనులకు ఎన్టీఆర్ పార్టీ పెట్టారని.. అప్పటికే సినిమా రంగంలో టాప్ హీరోగా ఉన్నారని.. 1982లో తెలుగుదేశం పార్టీ ...

Read More »

పోలీస్ ‌శాఖకు సీఎం కేసీఆర్‌ అభినందన

తెలంగాణ పోలీస్‌ శాఖ మహిళా భద్రతా విభాగాన్ని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు‌ అభినందించారు. మహిళలు, పిల్లలు భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ‘సైబ్‌ హర్‌’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం మరో అద్భుతం సాధించిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.‘‘ఇంటర్ నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాల వినియోగం గణనీయంగా పెరగడంతో సైబర్ నేరాలు చోటు చేసుకుంటున్నాయి. సులువుగా మోసాలకు గురయ్యే అవకాశం ఉన్న పిల్లలు, మహిళలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ‘సైబ్‌ హర్’ పేరుతో ...

Read More »

స్వీయ నిర్బంధంలో మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత

స్వీయ నిర్బంధంలో మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత

నిజామాబాద్‌ మాజీ ఎంపి, ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆమె వద్ద పని చేసే డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో వైద్యుల సూచనల మేరుకు ఆమె హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగానే ఆమె క్వారెంటైన్‌ పాటిస్తున్నట్లు కవిత సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 50 వేలు దాటింది.

Read More »

తెలంగాణ నూతన సచివాలయం.. డిజైన్ ఖరారు చేయనున్న కేసీఆర్!

తెలంగాణ నూతన సచివాలయం.

పాత సచివాలయం భవనాల కూల్చివేతకు హైకోర్టు, సుప్రీం కోర్టు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో తెలంగాణ సచివాలయానికి అడ్డంకులు తొలిగిపోయాయి. దీంతో మరి కొద్ది రోజుల్లో సచివాలయ భవనాలన్నీ నేలమట్టం కానున్నాయి. ఈ క్రమంలో భారీ సంఖ్య ఏర్పడిన వ్యర్థాలను హైదరాబాద్ నుంచి బయటకు తరలించనున్నారు. కుదిరితే ఈ శ్రావణ మాసంలోనే కొత్త సచివాలయం నిర్మాణ పనులను ప్రారంభించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. నూతన సచివాలయ భవనానికి సంబంధించిన డిజైన్‌ను కేసీఆర్ నేడు (జులై 21న) ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం అధికారులు, చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్‌లతో ...

Read More »

జులైలో తొలిసారిగా కరోనాపై కేసీఆర్ సమీక్ష

జులైలో తొలిసారిగా కరోనాపై కేసీఆర్ సమీక్ష

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. కరోనాను పకడ్బందీగా కట్టడి చేయడం ఎలా అనే అంశాలపై చర్చ జరిపారు. హోం ఐసోలేషన్లో ఉన్న బాధితులకు అందుతున్న చికిత్స.. కోవిడ్ రోగులకు మెరుగైన చికత్స అందించడం లాంటి అంశాలకు చర్చకు వచ్చాయి. ఈ భేటీలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. జూన్ 28న పీవీ శత జయంతి వేడుకలకు హాజరైన కేసీఆర్ అదే రోజు సాయంత్రం ...

Read More »