Tag Archives: kcr

తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్‌ -సీఎం కేసీఆర్

తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్‌ ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. తెలంగాణలో కంటైన్‌మెంట్‌ జోన్లు మినహాయించి మిగిలినవన్నీ గ్రీన్‌ జోన్లుగా పరిగణించనున్నామని తెలిపారు.‘కరోనాకు వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. బతుకును బంద్ పెట్టుకుని జీవించలేము.హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు. హైదరాబాద్ లో సరి ,బేసి విధానంలో దుకాణాలు తెరవాలి. హైదరాబాద్ సిటీ బస్సులు నడవవు. తెలంగాణ జిల్లాల్లో బస్సులు నడుస్తాయి. ఆటోలు, కార్లు నడుస్తాయి. సెలూన్లు తెరుచుకోవచ్చు. కంటైన్మెంట్ ఏరియాల్లో మాత్రం ...

Read More »

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ మంత్రి వర్గం సోమవారం సాయంత్రం సమావేశం కానుంది. కేంద్రం ఇచ్చిన లాక్ డౌన్ సడలింపులపై చర్చించనుంది. ప్రజా రవాణా విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్రం అనుమతించిన సడలింపులన్నీ రాష్ట్రంలో అమలు చేయాలా? వద్దా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా ప్రజా రవాణా పునరుద్ధరణ నిర్ణయాధికారాలను కేంద్రం రాష్ట్రాలకే అప్పగించింది. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజా రవాణాను పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించే అవకాశముంది.కేంద్రం సడలింపులు ...

Read More »

తెలంగాణలో మే 29 వరకు లాక్‌డౌన్‌ : సీఎం కేసీఆర్‌

తెలంగాణలో మే 29 వరకు లాక్‌డౌన్‌ : సీఎం కేసీఆర్‌

తెలంగాణలో లాక్‌డౌన్‌ను మే 29 వరకు పొడిగించినట్లు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. గ్రీన్ లేదు.. రెడ్ లేదు.. అన్ని జిల్లాల్లో మే 29 వరకూ రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొద్దిరోజులు ఓపికపడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. తెలంగాణలో టెస్టింగ్‌ కిట్ల కొరత లేదని చెప్పారు. అయితే.. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్‌లో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు. మండల కేంద్రం, రూరల్‌ ప్రాంతాల్లో అన్ని షాపులకు అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. మున్సిపాలిటీల్లో ...

Read More »

నేను కూడా ఖైదీనే..కేటీఆర్ ఆసక్తికర వాఖ్యలు…?

ఇటీవల బుధవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో భయంకరంగా విస్తరిస్తున్నటువంటు మహమ్మారి కరోనా వైరస్ కారణంగా తెరాస పార్టీ ఆవిర్భావ వేడుకలు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండానే జరిగాయి. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రమంత్రి కేటీఆర్ ఆనాటి ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలను మరొకసారి గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ వరంగల్ జైలులో తాను గడిపిన రోజులకు సంబంధించిన ‘ఖైదీ గుర్తింపు కార్డు’ చిత్రాన్ని తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా పోస్టుచేశారు.

Read More »

కేసీఆర్ పై సంచలన వాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి పలు సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా ఒక వైపు రాష్ట్రం అంతా కూడా మహమ్మారి కరోనా కారణంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్న తరుణంలో, సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం కనకవర్షం లో మునిగి తేలుతుందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా కేసీఆర్ తమ కుటుంబ సభ్యులకే అధికారాలు, వ్యాపారాలు అప్పగిస్తున్నారని, పాకాల రాజేంద్రప్రసాద్ డైరెక్టర్‌గా చేరిన రాక్సెస్ లైఫ్ సైన్స్‌కి ...

Read More »

టీఆర్ఎస్ 20 ఏళ్ల ప్రస్థానం..

టీఆర్ఎస్ 20 ఏళ్ల ప్రస్థానం..

చాలా మంది చరిత్ర నుంచి ప్రభావితమవుతారు. కొందరే చరిత్రను ప్రభావితం చేస్తారు. అలాంటి వారిలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒకరు. తెలంగాణ సమాజాన్ని ఊగించి, ఉరికించి, శాసించి విజయతీరాలకు చేర్చారు. ఆయన ఉక్కు సంకల్పం, వ్యూహ చతురత ముందు ఆ విధి సైతం తలవంచింది. తెలంగాణ ఆవిర్భవించింది. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా అవతరించింది. సబ్బండ వర్గాలందరికీ గులాబీ జెండా నీడైంది. నేడు (ఏప్రిల్ 27) తెలంగాణ రాష్ట్ర సమితి ( టీఆర్‌ఎస్) 20వ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా ఆ పార్టీ రాజకీయ ...

Read More »

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ పొడిగింపునకే కేసీఆర్ మొగ్గు

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ పొడిగింపునకే కేసీఆర్ మొగ్గు

తెలంగాణలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో మే 7 తరువాత, మరికొన్ని రోజులు లాక్ డౌన్ ను పొడిగించాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజలంతా ఇళ్లలో ఉంటేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని, ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో వ్యాఖ్యానించిన ఆయన, సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే వీడియో కాన్ఫెరెన్స్ లో దేశంలో పరిస్థితి తెలుస్తుందని అన్నారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు ...

Read More »

సీఎం సహాయ నిధికి రూ.2 కోట్లు

సీఎం సహాయ నిధికి రూ.2 కోట్లు

కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు తెలపాలని, సీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇచ్చిన పిలుపునకు భారీగా విరాళాలు వచ్చాయి. ఖమ్మం నుంచి వివిధ రంగాల వ్యాపారులు, విద్య, వైద్య సంస్థలు, వర్తక వ్యాపారులు, కాంట్రాక్టర్లు ముందుకొచ్చి రూ.1.75 కోట్లను మంత్రికి అందించారు. మమత వైద్య విద్యాసంస్థ చైర్మన్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ భారీ మొత్తంలో రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. ఆ మొత్తం రూ.2 ...

Read More »

కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ

కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ

తెలంగాణలో కరోనా వరస్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. కరోనా విపత్తును ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టీకరించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు కరోనాపై ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త కరోనా వ్యతిరేక సేవకుడిగా సేవలందించాలని ఆయన పిలుపు ఇచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా దళారులపై చర్యలు చేపట్టాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

Read More »

కేసీఆర్‌ కరీనంగర్‌ పర్యటన వాయిదా

కేసీఆర్‌ కరీనంగర్‌ పర్యటన వాయిదా

రాష్ట్ర ప్రజల్లో భరోసా నింపేందుకు సీఎం కేసీఆర్‌ శనివారం కరీంనగర్‌ వెళ్లాలనుకున్న పర్యటన వాయిదా పడింది. దేశవ్యాప్తంగా ప్రబలుతున్న కోవిడ్‌పై ప్రజల్లో ధైర్యం నింపేందుకు కరీంనగర్‌ పర్యటనకు సీఎం సంకల్పించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం పర్యటన వల్ల భారీగా జరుగుతున్న స్క్రీనింగ్, వైద్య ఏర్పాట్లకు అసౌకర్యం కలగకుండా ఉండాలని కరీంనగర్‌ జిల్లా యంత్రాంగం, వైద్య శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. దీంతో కేసీఆర్‌ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

Read More »