Tag Archives: ktr

మాజీ సివిల్ స‌ర్వెంట్ల‌కు బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇవ్వ‌డంపై కేటీఆర్ హ‌ర్షం..

పార్ల‌మెంట్‌ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టివ‌ర‌కు 13 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. దీనిలో భాగంగా కేసీఆర్ శుక్ర‌వారం ఇద్ద‌రు కొత్త‌ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. మెదక్ స్థానం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రాంరెడ్డి, అలాగే నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇటీవలే బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు అవకాశం ఇచ్చారు. ఇలా ఇద్ద‌రు మాజీ సివిల్ స‌ర్వెంట్ల‌కు బీఆర్ఎస్ లోక్‌స‌భ ఎంపీ టికెట్లు కేటాయించ‌డం ప‌ట్ల ఆ పార్టీ మాజీ మంత్రి, వ‌ర్కింగ్ ...

Read More »

ఈడీ కస్టడీలో కవిత ఉపవాసం..మరోసారి చెల్లిని కలిసి మాట్లాడిన కేటీఆర్

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. వారం రోజుల కస్టడీలో భాగంగా కవితను అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. విచారణ సమయం పూర్తయిన తర్వాత కవిత ఎలా గడుపుతున్నారు.. ఏం చేస్తున్నారనే వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. బ్రేక్ సమయంలో, ఉదయం సాయంకాలం వేళల్లో కవిత పుస్తక పఠనం చేస్తున్నారని తెలిసింది. బుధవారం ఏకాదశి కావడంతో ఉపవాసం చేశారట. ఆమె కోరిక మేరకు అధికారులు ...

Read More »

బిడ్డా! నువ్వు వస్తావా? నీ అయ్య వస్తాడా? చూసుకుందాం: కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

‘రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించు బిడ్డా… నువ్వు వస్తావా? నీ అయ్య వస్తాడా? చూసుకుంటాం బిడ్డా’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిడ్డా, సన్నాసి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేవెళ్లలో జన జాతర పేరుతో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై ఘాటైన విమర్శలు చేశారు. నేను ఆ సన్నాసులకు ఓ విషయం చెప్పదలుచుకున్నాను…. మూడు నెలల తర్వాత ...

Read More »

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూతపై కేసీఆర్, కేటీఆర్ దిగ్భ్రాంతి

యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత మృతి చెందడం తనను కలచివేస్తోందని కేసీఆర్ విచారంం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని, వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ‘‘చిన్న వయసులోనే ప్రజామన్ననలు పొందిన లాస్య అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ ...

Read More »

కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన తమిళిసై, కేటీఆర్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై, మాజీ మంత్రి కేటీఆర్ గ్రీటింగ్స్ తెలియజేశారు. ‘గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ‘లెజెండ్ అయిన నా హీరోకు… 70వ జన్మదిన శుభాకాంక్షలు డాడ్’ అని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా గ్రీటింగ్స్ తెలియజేశారు.

Read More »

రోడ్‌సైడ్ కేఫ్‌లో చాయ్ తాగి స్థానికులతో ముచ్చటించిన కేటీఆర్..!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల తర్వాత తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు. నిన్న నల్గొండలో నిర్వహించిన ‘చలో నల్లగొండ’సభలో అధికార కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. నీళ్ల కోసం మరోమారు ఉద్యమానికి సై అన్నారు. అశేషంగా తరలివచ్చిన జనాన్ని చూసి బీఆర్ఎస్ నేతలు ఆనందంలో మునిగిపోయారు. కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి సహా పలువురు అగ్రనేతలు హాజరయ్యారు. సభ అనంతరం తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరిన పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మార్గమధ్యంలో చౌటుప్పల్ వద్ద రోడ్‌సైడ్ ...

Read More »

కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఫైర్…

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి సీతక్క మండిపడ్డారు. కేటీఆర్ విధ్వంస రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సీతక్క తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పనిచేసుకోవాలని, లేకపోతే ప్రజలు వారిని ఎప్పటికీ తిరస్కరిస్తూనే ఉంటారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి అహంకారమే కారణమన్నారు.

Read More »

రేవంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ సవాల్‌

హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఖచ్చితంగా గెలుస్తుందని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి దమ్ముంటే హుజురాబాద్‌ ఉప ఎన్నికలో డిపాజిట్‌ తెచ్చుకోవాలని సవాల్ చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. ఈటల రాజేందర్ కోసమే కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. త్వరలో ఈటలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారన్నారు. రేవంత్‌రెడ్డి చిలకజోస్యం చెప్పుకుంటే మంచిదన్నారు. కాంగ్రెస్‌లో భట్టిది నడవట్లేదని.. అక్రమార్కులదే నడుస్తోందన్నారు. వివేక్‌ కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తారని తెలుస్తోందని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయం వ్యక్తం ...

Read More »

మంత్రి కెటిఆర్‌ కు కరోనా పాజిటివ్‌

తెలంగాణ మంత్రి కెటిఆర్‌ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిందని, టెస్టుల్లో కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందని మంత్రి కెటిఆర్‌ స్వయంగా ట్వీట్‌ చేశారు. ఆరోగ్యపరంగా ఆయనకు ఎలాంటి సమస్యలు లేవని, తగిన విశ్రాంతి తీసుకున్న అనంతరం త్వరలోనే రోజువారీ కార్యక్రమాలకు హాజరవుతారని తెలిపారు. బుధవారమే కెటిఆర్‌ కు వివిధ వైద్యపరీక్షలు, రక్త పరీక్షలను నిర్వహించారు. గురువారం వాటన్నింటినీ పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నట్టుగా తేలిందని డాక్టర్లు తెలిపారు.

Read More »

ప్రాంతీయ భాషల్లోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీకి వేర్వేరుగా శుక్రవారం ఉదయం లేఖలు రాశారు. హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించడం వల్ల ఇతర ప్రాంతీయ భాషల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల అభ్యర్థులకు సమాన అవకాశాలు ఇచ్చే విధంగా ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను ఆయన తెలిపారు. అలాగే రాష్ట్రపతికి రాసిన లేఖలో ...

Read More »