Tag Archives: latest news

రేపటి నుంచి అమూల్‌, మదర్‌ డెయిరీ పాలు లీటర్‌కు రూ.2 పెంపు

గోల్డ్‌, తాజా, శక్తి మిల్క్‌పై లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు అమూల్‌ బ్రాండ్‌పై పాలు విక్రయించే గుజరాత్‌ కోపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జిమెమ్‌ఎమ్‌ఎఫ్‌) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా మదర్‌ డెయిరీ సైతం పాల ధరను పెంచింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు పేర్కొంది. పాలసేకరణ, ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అముల్‌, మదర్‌ డెయిరీలు ప్రకటించాయి. పెరిగిన ధరలు బుధవారం నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. మార్చిలోనూ మదర్‌ డెయిరీ లీటర్‌కు రూ.2 చొప్పున ...

Read More »

ఎడిటర్ క్రీడలు రెజ్లింగ్‌లో అత్యధిక పతకాలు

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు రెజ్లింగ్‌ విభాగంలో అత్యధికంగా 12 పతకాలు వచ్చాయి. ఆ తర్వాత వెయిట్‌ లిఫ్టింగ్‌లో 10 పతకాలు వచ్చాయి. 210మంది అథ్లెట్లతో భారీ బృందం ఇంగ్లండ్‌కు వెళ్తే 22 పతకాలు ఈ రెండు ఈవెంట్‌ల నుంచే వచ్చాయి. ఈ క్రీడల్లో భారత్‌ 22స్వర్ణ, 16రజత, 23కాంస్యాలతో సహా మొత్తం 61పతకాలతో నాల్గో స్థానంలో నిలిచింది. షూటింగ్‌కు ఈసారి చోటు దక్కకపోవడంతో టాప్‌-5లో నిలవడం కష్టమేనని భావించినా.. ఆ మార్క్‌కు చేరుకోగలిగాం. ఈసారి కూడా స్వర్ణ పతకాల వేటను ...

Read More »

15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం

భారతదేశానికి ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్‌ హాలులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారాన్ని సుప్రీంకోర్టు సీజే ఎన్వీ రమణ చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ,  రాంనాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, గవర్నర్‌, ముఖ్యమంత్రి, పార్లమెంట్‌ సభ్యులు, ప్రభుత్వంలోని ప్రముఖ సివిల్‌, మిలటరీ అధికారులు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు అయ్యారు. ద్రౌపది ముర్ము 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ప్రమాణ స్వీకారం తర్వాత ఆమె ...

Read More »

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలిచిన ఎపి

15వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకంగా నిలిచింది. మొత్తం 173 ఎమ్మెల్యేల ఓట్లు ఉండగా అన్నీ ఒకే అభ్యర్థికి వేసిన రాష్ట్రంగా ఎపి నిలిచింది. రాష్ట్రం నుండి వందకు వంద శాతం ఓట్లు ద్రౌపది ముర్ముకే పడ్డాయి. మరే రాష్ట్రంలోనూ వంద శాతం ఓట్లు ఒకే అభ్యర్థికి పడలేదు. ఎపిలో అధికార వైసిిపితో పాటు టిడిపి కూడా ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం ఓట్లు గంపుగుత్తగా ముర్ముకే పడ్డాయి. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న ప్రథమ గిరిజన నేతగా, రెండవ ...

Read More »

ధరలపై దద్దరిల్లిన పార్లమెంటు – ఉభయ సభల్లో నినాదాల హోరు

కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ, ద్రవ్యోల్బణం, వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలను విపరీతంగా పెంచుతున్న మోడీ ప్రభుత్వ విధానాలపై పార్లమెంట్‌ ఉభయసభలు దద్దరిల్లాయి. ఈ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టగా, ప్రభుత్వం ససేమిరా అనుది. దీంతో సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేయడంతో ఉభయ సభల్లోను తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఉభయ సభలు వాయిదాపడ్డాయి. జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేకి పార్లమెంట్‌ ఉభయ సభలు నివాళులర్పించాయి. ఎగువ సభ సమావేశం కాగానే సిపిఐ(ఎం) సభ్యులు లేచి ధరల పెరుగుదలపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. ...

Read More »

సిబిఐ దాడులు చట్టవిరుద్ధమంటూ స్పీకర్‌కు కార్తి చిదంబరం లేఖ

వీసా కుంభకోణం కేసులో సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ ఎంపి కార్తి చిదంబరం శుక్రవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంటరీ ప్రత్యేక హక్కుని సిబిఐ అధికారులు స్పష్టంగా ఉల్లంఘించారని పేర్కొన్నారు. తన కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలు ఒకదాని తర్వాత మరొకటి తప్పుడు కేసులు బనాయిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ సమస్య పార్లమెంట్‌ సభ్యునిగా తన హక్కులు, అధికారాలకు సంబంధించినదని, ఈ అత్యవసరమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి బాధపడుతున్నానని లేఖలో పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ...

Read More »

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ రాజీనామా

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ  రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపారు. మాజీ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ అనంతరం 2016 డిసెంబర్‌ 31న లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బైజల్‌ బాధ్యతలు స్వీకరించారు. సుమారు ఐదున్నరేళ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో వివాదంతో బైజల్  పలుసార్లు వార్తల్లో నిలిచారు.

Read More »

తిరుపతిలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పర్యటన

 రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శనివారం ప్రత్యేక విమానంలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్‌కు జిల్లా కలెక్టర్‌ కె.వెంకట రమణా రెడ్డి సాదర స్వాగతం పలికారు. అక్కడి నుండి 11 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి అనంతపురం జెఎన్‌టియులో జరగనున్న కాన్వొకేషన్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లారు. జిల్లా కలెక్టర్‌ కె .వెంకటరమణా రెడ్డి, ఎస్‌ పి.పరమమేశ్వర రెడ్డి, ఆర్డీఓ హరిత, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసులు, సిఐఎస్‌ఎఫ్‌ డిప్యూటీ కమాండెంట్‌ శుక్లా, తహసీల్దార్‌ శివప్రసాద్‌, ఎంపిడిఓ, తదితరులు గవర్నర్‌కు స్వాగతం ...

Read More »

ఎపి, ఒడిస్సాలపై అసాని ప్రభావం

ఎపి, ఒడిస్సాలపై అసాని తుఫాను తీవ్ర ప్రభావం చూపనుంది. తుఫాను ఎపిలోని తూర్పుతీరంలో కేంద్రీకృతమైందని, గంటకు 105 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండి) తెలిపింది. తుఫాను క్రమంగా బలహీన పడుతోందని, మంగళవారం రాత్రి నుండి ఎపిలోని ఉత్తర కోస్తాతో పాటు ఒడిస్సాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. ఇప్పటికే ఎపిలోని విశాఖ పట్నం పోర్ట్‌ను మూసివేశారు. వాతావరణ అననుకూల పరిస్థితుల కారణంగా 23 విమానాలను రద్దు చేసినట్లు విశాఖ పట్నం అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్‌ ...

Read More »

సామాన్యులకి షాక్‌.. మళ్లీ పెరిగిన గ్యాస్‌ ధర

గ్యాస్‌ వినియోగదారులకు చమురు సంస్థలు మరో షాక్‌నిచ్చాయి. గ్యాస్‌ ధర మరోసారి పెరిగింది. ఈ నెల 1 న కమర్షియల్‌ సిలిండర్‌ ధరలు పెంచిన ప్రభుత్వం.. తాజాగా గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌పై ధరను పెంచింది. 14 కేజీల సిలిండర్‌ పై రూ.50 వడ్డించింది. ఈ మేరకు దేశీయ ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1052 కు చేరింది. దీనికి డెలివరీ బార్సు తీసుకునే రూ.30 కలిపితే రూ.1082 అవుతుంది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ...

Read More »