Tag Archives: latest news

నిపుణుల కమిటీపై విమర్శలను ఖండించిన సుప్రీంకోర్టు

వ్యవసాయ చట్టాలపై నియమించిన నిపుణుల కమిటీపై వచ్చిన విమర్శలను సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతులకు, కేంద్రానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు గత వారం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చట్టాలపై నిర్ణయం తీసుకునే అధికారం కూడా కమిటీకి లేదని తేల్చి చెప్పింది.  బుధవారం విచారణ సందర్భంగా కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. ఇరువైపులా వాదనలు విని, నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించామని, అలాంటప్పుడు పక్షపాతంగా వ్యవహరించేందుకు అవకాశం ఎక్కడ ఉందని కోర్టు ప్రశ్నించింది. ...

Read More »

కరోనా భయంతో ఈ వ్యక్తి మూడు నెలలుగా ఎయిర్‌పోర్టులోనే..!

మూడు నెలలుగా విమానాశ్రయంలోనే ఉంటున్న ఒక వ్యక్తిని శనివారం అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించాక అసలు విషయం తెలుసుకుని అవాక్కవడం అధికారుల వంతయింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. భారతీయ సంతతికి చెందిన 36 ఏళ్ల ఆదిత్య సింగ్‌ కరోనా సోకుతుందేమోనన్న భయంతో విమానాశ్రయంలోనే ఉండిపోయినట్లు వివరించాడు. కాగా, ఆదిత్య సింగ్‌ కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజిల్స్‌ శివారులో నివసిస్తున్నాడు. హాస్పటాలిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసినట్లు తెలిపారు. అక్టోబర్‌ 19న  లాస్‌ ఏంజిల్స్‌ నుండి విమానంలో చికాగోలోని ఓహెర్‌ విమానాశ్రయానికి వచ్చాడని, అప్పటి నుండి అక్కడే ...

Read More »

ఎపి లో ఈనెల 18 నుంచి ఇంటర్‌ క్లాసులు

ఎపి లో ఈ నెల 18 నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ తరగతులు ప్రారంభంకానున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఏడాదికి ఆఫ్‌లైన్‌లోనే మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నామని.. కానీ, వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని తెలిపారు. త్వరలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తామన్నారు.2020-2021 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్‌ పరీక్షలు వచ్చే ఏప్రిల్‌, మే లో జరిగే అవకాశముందని.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ త్వరలో విడుదల చేస్తామని మంత్రి సురేష్‌ వెల్లడించారు. ...

Read More »

శాశ్వతంగా ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతా నిలిపివేత..!

ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ పై ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ వేటు వేసింది. ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అధ్యక్షునిగా ఆయన పదవీ కాలం ముగిసే వరకు తమ సంస్థకు చెందిన ఆయన సోషల్‌ మీడియా ఖాతాలను నిలిపివేస్తున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించిన…కొన్ని గంటలకు ట్విట్టర్‌ ఈ అనూహ్య ప్రకటన చేసింది. ట్రంప్‌ ఇటీవల చేసిన ట్వీట్లు..వాటి చుట్టూ ఉన్న సందర్భాలను నిశితంగా సమీక్షించిన తర్వాత..హింసను ప్రేరేపించే ప్రమాదం ఉన్నందున ఈ ఖాతాను శాశ్వతంగా నిలిపివేస్తున్నామని ట్వీట్‌ చేసింది. క్యాపిటల్‌ ...

Read More »

సుప్రీంలో 931 బెయిల్‌ పిటిషన్ల పెండింగ్‌

రిపబ్లిక్‌ టివి చీఫ్‌ ఎడిటర్‌ అర్ణబ్‌ గోస్వామి, కొంత మంది ఇతరుల బెయిల్‌ పిటిషన్లపై అత్యవసరంగా విచారణ చేయడంపై వివాదం కొనసాగుతున్న సమయంలోనే ఒక సంచలన విషయం బయటకు వచ్చింది. సుప్రీంకోర్టులో 931 బెయిల్‌ పిటిషన్లు, 141 శిక్ష రద్దు అప్పీళ్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తాజాగా ఆర్‌టిఐ దరఖాస్తుకు వచ్చిన సమాధానంలో తేలింది. సమాచార హక్కు చట్టం కింద సామాజిక కార్యకర్త సాకేత్‌ గోఖలే చేసుకున్న దరఖాస్తుకు సుప్రీంకోర్టు పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ అజరు అగర్వాల్‌ గత నెల 18న సమాధానం ఇచ్చారు. ...

Read More »

కేంద్ర మాజీ హోంమంత్రి కన్నుమూత

కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బూటాసింగ్‌ (86) శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,కాంగ్రెస్‌పార్టీ నేత రాహుల్‌గాంధీ ట్విట్టర్‌ ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్‌ జిల్లా ముస్తఫాపూర్‌లో 1934, మార్చి 21న బూటాసింగ్‌ జన్మించారు. జర్నలిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. అకాలీదశ్‌ పార్టీలో చేరి రాజకీయ జీవితం ఆరంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌పార్టీలో చేరారు. దళిత నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. గాంధీ కుటుంబానికి సన్నిహితులయ్యారు. ఎనిమిది పర్యాయాలు ...

Read More »

అజారుద్దీన్‌కు తప్పిన ప్రమాదం

 భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సిఎ) అధ్యక్షుడు, కాంగ్రెస్‌ నేత మహ్మద్‌ అజారుద్దీన్‌ తృటిలో పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి రణ్‌తంబోర్‌ తిరిగి వస్తుండగా రాజస్తాన్‌లోని సూర్వల్‌ వద్ద లాల్సాట్‌-కోట హైవేపై కారు బోల్తా కొట్టిందని అజారుద్దీన్‌ వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఆయన స్వల్పగాయాలతో బయటపడ్డారని చెప్పారు. ప్రమాదం నుండి తేరుకున్న ఆజారుద్దీన్‌..కుటుంబ సభ్యులతో కలిసి మరో ...

Read More »

మేయర్‌గా 21 ఏళ్ల అమ్మాయి ప్రమాణ స్వీకారం

కేరళలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన 21 ఏళ్ల ఆర్యా రాజేంద్రన్‌ తిరునవనంతపురం నగర కార్పొరేషన్‌ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 100 మంది ఉన్న సభ్యుల మండలిలో 54 ఓట్లు ఆమె సాధించడంతో మేయర్‌గా ఎన్నికయ్యారు. దీంతో ఇప్పటి వరకు మేయర్‌ పదవి అధిరోహించిన అతి చిన్న వయస్కురాలు ఆమె కావడం విశేషం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్‌)నుండి ముడవా ముంగళ్‌ వార్డుకు కౌన్సిలర్‌గా పోటీ చేసి ఆర్యా గెలుపొందిన సంగతి విదితమే. ...

Read More »

నేడే వెబ్‌ ఆప్షన్లకు చివరి అవకాశం

ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవడంతో పాటు సవరణలకు శుక్రవారం అర్ధరాత్రి వరకు అవకాశం కల్పిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. సచివాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు లేక మారుమూల పాఠశాలలు మూతపడకుండా ఉండాలనే ఉద్దేశంతో 16 వేల ఖాళీలను బ్లాక్‌ చేశామన్నారు. పోస్టుల బ్లాకింగ్‌ ఎత్తేస్తే రాష్ట్రవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న 145 మండలాల్లోని 5,725 పాఠశాలల్లో 10,198 పోస్టులు భర్తీ కావని చెప్పారు. గురువారం సాయంత్రం వరకు 76,119 మంది బదిలీలకు దరఖాస్తు ...

Read More »

కేంద్రంతో కష్టం…రైతు సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు : సుప్రీం

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరుగని యోధుల్లా రైతుల సాగిస్తున్న ఆందోళన జనజీవనానికి ఇబ్బందిగా మారిందని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సమస్యను పరిష్కరించడంలో విఫలమైన కేందం తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేపడుతున్న చర్చలు ఫలించేలా కన్పించట్లేదన్న న్యాయస్థానం… సమస్యను పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. రైతుల ఆందోళనల విరమింప చేయాలని కోరుతూ రిషభ్‌ శర్మ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేయగా…మద్దతుగా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ...

Read More »