Tag Archives: latest news

భారత్‌కు వ్యతిరేకంగా జీవాయుధాలపై పాాక్-చైనా ప్రయోగం

భారత్‌కు వ్యతిరేకంగా జీవాయుధాలపై పాాక్-చైనా ప్రయోగం

ప్రమాదకరమైన జీవ ఆయుధాల తయారీకి పాకిస్థాన్‌, చైనాలు ఒక రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ఆస్ట్రేలియా పత్రిక ఓ సంచనల కథనం వెలువరించింది. ఆంత్రాక్స్‌ సహా పలు ప్రమాదకర జీవాయుధాలకు సంబంధించిన పరిశోధనలు ఆ రెండు దేశాలు చేపట్టాయని పరిశోధనాత్మక దినపత్రిక ద క్లాక్సన్ తెలిపింది. పాకిస్థాన్‌కు చెందిన సైనిక రక్షణ శాస్త్ర, సాంకేతిక సంస్థ (డెస్టో)తో చైనాకు చెందిన వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ మూడేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుందని పేర్కొంది. ‘కొత్తగా ఉత్పన్నమవుతున్న అంటువ్యాధులు.. వ్యాప్తి, నియంత్రణ’పై సంయుక్తంగా పరిశోధన చేయడం దీని ప్రధాన ...

Read More »

బిజెపిలో చేరిన 24 గంటల్లోనే రాజకీయాలకు గుడ్‌బై..!

బిజెపిలో చేరిన 24 గంటల్లోనే రాజకీయాలకు గుడ్‌బై.

భారత్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ మాజీ ఆటగాడు మెహతాబ్‌ హుస్సేన ఎంతో ఉత్సాహంగా బిజెపిలో చేరాడు. మంగళవారం నాడు ఆయనకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ పార్టీ జెండాను అందించి చేర్చుకున్నారు. కానీ 24 గంటల్లోనే సీన్‌ రివర్స్‌ అయ్యింది. మెహతాబ్‌ రాజకీయాలనుండి తప్పుకుంటున్నట్లు బుధవారం ప్రకటించారు. తన వ్యక్తిగత కారణాల రీత్యానే రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని, ఎవరి ఒత్తిడి లేదని చెప్పారు. బిజెపిలో చేరాలన్న తన నిర్ణయం కారణంగా బాధపడ్డ తన బంధువులకు, స్నేహితులందరికీ క్షమాపణలు చెప్పాడు. ఈరోజు నుండి తనకు ఏ ...

Read More »

మాజీ మంత్రి పితాని కుమారుడి కోసం ఏసీబీ గాలింపు

మాజీ మంత్రి పితాని కుమారుడి కోసం ఏసీబీ గాలింపు

ఏపీ ఈఎస్‌ఐ స్కాంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. అతడు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి.. అక్కడికి స్పెషల్ టీమ్‌ను పంపించారు. అతడి కోసం భాగ్యనగరంలో గాలింపు చేపట్టారు. పితాని మంత్రిగా ఉన్న సమయంలో సురేష్ కొన్ని కంపెనీలకు మందుల కొనుగోలు చేసేందుకు సిఫార్స్ చేసినట్లు ఏసీబీ విచారణలో తేలిందట. ఏపీలో ఈఎస్‌ఐ స్కామ్‌ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏపీ డైరెక్టర్ ఆఫ్ ...

Read More »

అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో చుక్కెదురు

అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో చుక్కెదురు

అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో చుక్కెదురైంది. చైనాతో సరిహద్దు వివాదం మొదలైన తర్వాత ఆ దేశ ఉత్పత్తులపై నిషేధం విధించాలని భారత్‌ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో చైనా నుండి దిగుమతి అవుతున్న వస్తువులను ప్రధాన భారతీయ ఓడరేవుల్లోని కస్టమ్స్‌ అధికారులు తిరిగి వెనక్కు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, వీటిలో చైనాలో తయారవుతున్న ఆపిల్‌, డెల్‌, సిస్కో, ఫార్వర్డ్‌ మోటారు కంపెనీలకు చెందిన అమెరికా ఉత్పత్తులు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని అమెరికా-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం, అమెరికా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ లాబీయింగ్‌ ...

Read More »

నేడు ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల సామూహిక నిరాహారదీక్ష!

నేడు ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల సామూహిక నిరాహారదీక్ష!

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెబుతూ మరోవైపు, ఉన్న సౌకర్యాలను తొలగిస్తున్నారని ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. ఆర్టీసీ ఎండీ తీసుకున్న పలు నిర్ణయాలను వ్యతిరేకించిన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్.. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఈయూ ఆధ్వర్యంలో 128 డిపోలు, వర్క్‌షాపుల వద్ద కార్మికులు నేడు సామూహిక నిరాహార దీక్షలకు దిగనున్నారు.

Read More »

వనదేవతలను దర్శించుకున్న గవర్నర్లు

వనదేవతలను దర్శించుకున్న గవర్నర్లు

తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో గద్దెల వద్ద రద్దీ భారీగా పెరిగింది. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ వనదేవతలను దర్శించుకున్నారు. వారికి అధికారులు ఘనస్వాగతం పలికారు. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు.

Read More »