Tag Archives: latest news

ప్రతి విద్యార్థీ దిశా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి: హోమంత్రి

‘దిశ’ పోలీస్‌ స్టేషన్‌ను హోం మంత్రి తానేటి వనిత శనివారం సందర్శించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. మహిళల రక్షణ కోసమే ‘దిశ ‘యాప్‌, దిశ చట్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చారని హోంమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 24 లక్షల మందికి పైగా దిశ యాప్‌ ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్నారు. చదువుకొనే ప్రతి విద్యార్థిని దిశా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.మహిళలపై దాడులను సీఎం జగన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరన్నారు. ఇటీవల మహిళలపై దాడులు చేయడం టిడిపి నేతలకు అలవాటుగా మారిందన్నారు. ...

Read More »

బి.టెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష

గుంటూరులో బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో ఫాస్ట్రక్‌ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు శిశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ… జడ్జిమెంట్‌ ఇచ్చింది. గతేడాది గుంటూరు పరమాయికుంటకు చెందిన రమ్యను… శిశికృష్ణ కత్తితో పొడిచి హత్య చేశాడు. తనను ప్రేమించడం లేదని… ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందన్న కోపంతో గతేడాది ఆగస్టు 15న నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఈ కేసుపై దాదాపు 5 నెలలు విచారించిన ప్రత్యేక న్యాయం స్థానం… నిందితుడికి ఉరిశిక్ష వేస్తూ తీర్పునిచ్చింది.

Read More »

నేడు ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు

ఉత్తర ప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరగనుంది. ఎన్నికలు జరిగిన యుపి, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌లో బిజెపి పాలిత రాష్ట్రాలు నాలుగు ఉండగా, కాంగ్రెస్‌ ఒక రాష్ట్రంలో అధికారంలో ఉంది. యుపిలో సమాజ్‌వాది పార్టీ నుంచి బిజెపికి గట్టి సవాల్‌ ఎదురుకాగా, పంజాబ్‌లో ఆప్‌ నుంచి కాంగ్రెస్‌కు ఇదే పరిస్థితి. మిగతా వాటిలో బిజెపి, కాంగ్రెస్‌ మధ్యే ప్రధానంగా పోటీ కేంద్రీకృతమైంది. మార్చి7న వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ యుపి, మణిపూర్‌లో బిజెపి, పంజాబ్‌లో ఆమాద్మీ పార్టీ, ...

Read More »

శ్రీశైలానికి భారీగా తరలివచ్చిన భక్తజనం

మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శేవక్షేత్రాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే కిటకిటలాడాయి. కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయానికి సందర్శకులు పోటెత్తారు. క్యూలైన్లన్ని జనంతో నిండిపోయాయి. స్వామి వారి ఉచిత దర్శనానికి ఆరు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. పర్యాటక శాఖమంత్రి అవంతి శ్రీనివాస్‌ శ్రీశైల మల్లికార్జున బ్రమరాంభలను దర్శించుకున్నారు. స్వామివారికి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక అభిషేకం ప్రారంభంకాగానే పాగాలంకరణ ప్రారంభమవుతుంది. మన వివాహాలలో పెళ్లి కుమారునికి తలపాగా చుట్టడం సంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైలం ఆలయంలో పాగాలంకరణ ఆనవాయితీగా కొనసాగుతోంది. ...

Read More »

విశాఖ చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ (పిఎఫ్‌ఆర్‌) సోమవారం జరగనుండడంతో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం నేవీ విమానాశ్రయం ఐఎన్‌ఎస్‌ డేగకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి తొలుత విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్‌, ఎంపి ఎ.విజయసాయిరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. విమానాశ్రయ లాంజ్‌లో ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కొంతసమయం ...

Read More »

నేడు మూడు రాష్ట్రాల్లో పోలింగ్‌

 ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అలాగే గోవాలో ఈరోజు రెండవ దశలో 55 స్థానాలు ఉన్నాయి. అన్ని అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ నిర్వహించబడుతుంది. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈరోజు జరిగిన ఓటింగ్‌లో మూడు రాష్ట్రాల్లోని మొత్తం 165 అసెంబ్లీ స్థానాల్లో 1519 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈరోజు యూపీలో దాదాపు 2.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముస్లింలు, దళితులు, రైతులు ఈ దఫా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. 

Read More »

విదేశీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..మేకపాటి

విదేశీ పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా దుబారు ఎక్స్‌ పోలో ఏపీ పెవిలియన్‌ రూపకల్పన చేయాలని మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి పేర్కొన్నారు. ఫిబ్రవరి 11 నుంచి 17 మధ్య జరగనున్న ఎక్స్‌ పోకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హాజరవుతోన్నది. ఈ సందర్భంగా దుబరు ఎక్స్‌ పో -2022 సన్నద్ధత ఏర్పాట్లపై పరిశ్రమల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ఎక్స్‌ పో సన్నద్ధత ఏర్పాట్ల పట్ల పరిశ్రమల శాఖ కఅషిని మంత్రి అభినందించారు. ఇతర రాష్ట్రాల కన్నా ఏపీ ప్రత్యేకమని ...

Read More »

బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ముంబై పర్యటన సందర్భంగా జాతీయగీతాన్ని అగౌరవపరిచారని, ఈకేసులో మార్చి 2న జరిగే కోర్టు విచారణకు హాజరు కావాలని ముంబై కోర్టు ఆదేశించింది. ఈమేరకు బుధవారం పశ్చిమబెంగాల్‌ సీఎం మమతకు కోర్టు సమన్లు పంపించింది. గతేడాది డిసెంబర్‌లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మమతా బెనర్జీ ఆ కార్యక్రమం సందర్భగా జాతీయగీతాన్ని అగౌరవపరిచినట్లు, ఆ కేసులో ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరుతూ నగరానికి చెందిన బీజేపీ విభాగం నేత వివేకానంద్‌ గుప్తా మాజ్‌గావ్‌లోని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ను ...

Read More »

విశాఖలో పొగమంచు.. పలు విమానాలు రద్దు

విశాఖను దట్టమైన పొగమంచు ఆవరించింది. పొగమంచులో ప్రయాణీకులు తీవ్ర అవస్థలుపడుతున్నారు. ఈ నేపథ్యంలో… పలు విమానాలను దారి మళ్లించినట్లు, మరికొన్ని విమానాలను అధికారులు రద్దు చేసినట్లు విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఉదయం 9 గంటల తర్వాత విమాన రాకపోకలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.

Read More »

అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో మోడీకి తొలిస్థానం

మోడీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన దేశాధినేతల్లో తొలి స్థానంలో నిలిచారు. 13 మంది దేశాధినేతలపై అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, భారత్‌, ఇటలీ, జపాన్‌, మెక్సికో, దక్షిణకొరియా, స్పెయిన్‌, బ్రిటన్‌, అమెరికా దేశాధినేతలపై ఈ సర్వే చేపట్టింది. అందులో మోడీని 71 శాతం మంది ప్రజలు ఆమోదించారు. ఇక ఈ జాబితాలో 43 శాతం రేటింగ్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరో స్థానంలో నిలిచారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ...

Read More »