Tag Archives: latest news

నవంబర్‌ 29 నుండి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

నవంబర్ చివరి వారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సారి సమావేశాల్లో పలు బిల్లులను ఆమోదించనున్నారు. ఆర్థిక రంగానికి చెందిన రెండు కీలకమైన బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (PFRDA) చ‌ట్టం-2013 స‌వ‌ర‌ణ బిల్లు, దీంతో పాటు బ్యాంకింగ్ రెగ్యులేష‌న్ చ‌ట్టం-1949 స‌వ‌ర‌ణ బిల్లు ను ఈ సమావేశాల్లో ఆమోదింపజేసుకోనున్నారు. అటు ...

Read More »

నిరసనలపై ఉక్కుపాదం.. సిపిఎం నేతల అరెస్టులు

చెరకు బకాయి బిల్లులను చెల్లించాలని, ఎన్‌సిఎస్‌ కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ… రైతు సంఘాలు నేడు బంద్‌, నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో… విజయనగరంలోని సిపిఎం, రైతు, చెరకు రైతు సంఘం నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. మరికొందరిని గృహనిర్బంధం చేశారు.లచ్చయ్యపేట షుగర్‌ ఫ్యాక్టరీ రైతులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ… విజయనగరం ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద శుక్రవారం రాస్తారోకో చేశారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ… అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ నినదించారు. ప్రభుత్వం బాధ్యత వహించి ...

Read More »

”ప్రపంచ నేతల్లారా పనికిరాని వాగ్దానాలు ఆపండి..” గర్జించిన 14 ఏళ్ల బాలిక వినీషా

” కేవలం పనికిరాని వాగ్దానాలతో సరిపుచ్చే ప్రపంచ నేతలను చూస్తుంటే మా యువతరానికి కోపం, ఆవేశం వస్తోంది”. గ్లాస్గోలో జరుగుతున్న కాప్‌ 26 సదస్సులో భారత్‌కి చెందిన 14 ఏళ్ల  వినీషా ఉమాశంకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మాటలతో కాలాన్ని వెళ్లబుచ్చడం మాని పర్యావరణాన్ని రక్షించేందుకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ”ఎకో ఆస్కార్స్‌”గా పిలువబడే ఎర్త్‌షాట్ ప్రైజ్‌ ఫైనలిస్ట్‌లలో ఒకరైన వినీషా ఉమా శంకర్‌ని  ప్రిన్స్‌ విలియం సదస్సులో ’క్లీన్‌ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్‌‘ గురించి చర్చించే సమావేశంలో మాట్లాడేందుకు ఆహ్వానించారు. ” మర్యాదపూర్వకంగా ఒక ప్రశ్న ...

Read More »

కడప బద్వేల్‌ ఉప ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లు

కడప జిల్లా బద్వేల్‌ ఉప ఎన్నికను స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె విజయానంద్‌ ఆదేశించారు. ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలపై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు. ఓటర్లు మినహా బయట నుంచి వచ్చిన మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, మండలి సభ్యులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు నియోజకవర్గ పరిధిలో ఉండకుండా చూడాలని ఆదేశించారు. స్థానికంగా ఉన్న హోటల్స్‌, అతిథి గృహాలు, కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్‌, రెసిడెన్షియల్‌ ...

Read More »

ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం

ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాతో గవర్నర్‌ బిశ్వభూషన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. అలాగే మంత్రులు బొత్స సత్యనారాయణ,  వెల్లంపల్లి శ్రీనివాస్,  పలువురు ఎమ్మెల్యేలు , హైకోర్టు న్యాయవాదులు హాజరయ్యారు.

Read More »

ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

రేపు ఇంద్రకీలాద్రికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రానున్న సందర్భంగా.. ఆలయం వద్ద చేస్తున్న ఏర్పాట్లను, భక్తులకు కల్పించిన సౌకర్యాలను అధికారులు సోమవారం పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌ (రెవిన్యూ) డాక్టర్‌ కె.మాధవిలత, జాయింట్‌ కలెక్టర్‌ (సంక్షేమం)కె.మోహన్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌ చంద్‌ లు పరిశీలించారు. క్యూలైన్ల ద్వారా దర్శనాన్ని మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవిలత ఆదేశించారు. మెట్ల మార్గం నుంచి అంతరాలయం వరకు వున్న ఐదు క్యూలైన్లను నిశితంగా పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేని రీతిలో చర్యలు తీసుకోవాలని ...

Read More »

భారత​ కుబేరుల్లో అగ్రస్థానంలో అంబానీ

 రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ఫోర్బ్స్‌ ఇండియా జాబితాలో అత్యంత ధనవంతుల్లో వరుసగా 14వ ఏడాది అగ్రస్థానంలో నిలిచారు. గతేడాది కాలంలో ముకేష్‌ సంపాదన 4 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.29వేల కోట్లు) పెరిగింది. మొత్తంగా 92.7 బిలియన్‌ డాలర్ల (రూ.6.95 లక్షల కోట్లు) నికర విలువ కలిగి ఉన్నారు. భారత్‌లో టాప్‌ 100 కుబేరుల జాబితాను గురువారం ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఈ 100 మంది ధనవంతులైన భారతీయుల మొత్తం సంపద ఏడాది కాలంలో 775 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ...

Read More »

బద్వేలు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్ధిగా పాణతాల సురేష్

కడప జిల్లాలోని బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిగా పనతల సురేశ్‌ పేరును పార్టీ ఈరోజు అధికారికంగా ప్రకటించింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పనతల సురేశ్‌ ఇదే జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అకాల మరణంతో బద్వేల్‌ ఉప ఎన్నిక అనివార్యం కాగా, చనిపోయిన ఎమ్మెల్యే భార్యనే వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టింది. దీంతో ఇప్పటికే జనసేన, టీడీపీలు ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నాయి. కానీ, బీజేపీ పోటీ ...

Read More »

అమిత్‌షాను కలిసిన యుపి మంత్రి అజయ్ మిశ్రా

యుపి హోంశాఖ సహాయక మంత్రి  అజయ్  మిశ్రా బుధవారం హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. లఖింపూర్‌ ఖేర్‌ జిల్లాలో రైతులను కారుతో తొక్కించిన ఘటనలో రైతులు సహా ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది.  అజయ్  మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాపై హత్య కేసు నమోదైనప్పటికీ ఇప్పటివరకు యుపి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోలేదు. రైతులను తొక్కించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే తన కుమారుడు ఆ ప్రాంతంలో లేడంటూ  అజయ్ మిశ్రా బుకాయిస్తున్నారు.

Read More »

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ

మాజీమంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో.. సిబిఐ వేసిన నార్కో పిటిషన్‌ను పులివెందుల కోర్టు డిస్మిస్‌ చేసింది. నిందితుడు ఉమాశంకర్‌ రెడ్డికి నార్కో పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో సిబిఐ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై మంగళవారం పులివెందుల మెజిస్ట్రేట్‌ విచారణ చేపట్టింది. రిమాండు ఖైదీగా కడప కారాగారంలో ఉన్న ఉమాశంకర్‌ రెడ్డిని దూరదఅశ్య మాధ్యమం ద్వారా మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. ఈ విచారణలో భాగంగా… నార్కో పరీక్షలు చేయించుకోవడం సమ్మతమేనా అని పులివెందుల మెజిస్ట్రేట్‌ అడగగా… అందుకు తాను ...

Read More »