Tag Archives: lock down

తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా

తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా

కరోనా కారణంగా తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధిస్తే.. పరీక్షలు ఎలా నిర్వహిస్తారనే దానిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లాక్‌డౌన్‌ స్పష్టత ఇచ్చాకే పిటిషన్‌పై విచారణ జరపాల్సి ఉంటుందని తెలిపింది. అయితే లాక్‌డౌన్‌ నిర్ణయంపై ఆధారపడి ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం ప్రవేశ పరీక్షలను ...

Read More »

దేశవ్యాప్తంగా జూన్‌ 30 వరకు లాక్‌డౌన్

దేశ వ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్-30 వరకు లాక్ డౌన్‌ పొడిగించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. జూన్‌ 8 నుంచి ప్రార్థనామందిరాలు, హోటళ్లు, మాల్స్‌ ప్రారంభం కానున్నాయి. రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే స్కూళ్లు, కాలేజీలకు అనుమతిస్తామని కేంద్రం తెలిపింది. కట్టడి ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ మరింత కఠినతరం చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇకపై రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. కాగా.. అంతర్జాతీయ ప్రయాణాలు, సినిమా ...

Read More »

మే 31 వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు

కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగించింది. దీనికి సంబంధించి మరికాసేపట్లో మార్గదర్శకాలు జారీ చేయనుంది. కాగా నాలుగో విడత లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పలు రాష్ట్రాలు భారీ సడలింపులను ప్రకటించనున్నాయి.ఇక లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలపై కేంద్రం ఎలాంటి నిబంధనలతో ముందుకొస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇక లాక్‌డౌన్‌ మార్గదర్శకాలపై రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, హోం శాఖ కార్యదర్శులతో కేంద్ర కేబినెట్‌ కార‍్యదర్శి అత్యవసర సమావేశం ...

Read More »

లాక్‌డౌన్‌ నాలుగోదశలో ప్రజా రవాణాకు గ్రీన్‌ సిగల్‌

లాక్‌డౌన్‌ నాలుగోదశలో ప్రజా రవాణాకు గ్రీన్‌ సిగ్నల్

లాక్‌డౌన్‌ నాలుగో దశ కూడా కొనసాగుతుందని, అయితే సరికొత్త నిబంధనలతో ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు. కరోనాపై పోరాటం కొనసాగుతూనే ఆర్ధిక కార్యకలాపాలను కూడా విస్తరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందులో భాగంగా నాలుగోదశ లాక్‌డౌన్‌లో ప్రజారవాణాకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చే అవకాశముంది. బౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్లను వాడుతూ పరిమిత సంఖ్యలో ప్రజా రవాణాకు అనుమతినివ్వనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కంటైన్మెంట్‌ జోన్ల ఆధారంగా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను విభజించారు. లాక్‌డౌన్‌ రెండు, మూడు దశల్లో కొంత మేరకు ఆంక్షలను ...

Read More »

లాక్‌డౌన్ టైమ్‌లో డెలివరీ అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

కరోనా వైరస్ కారణం గా మన జీవితాల్లో చాలా మార్పులు జరిగాయి. అనుకున్నవేవీ అనుకున్నట్టు జరిగే పరిస్థితి లేదు. దీనిలో కాబోయే తల్లిదండ్రులు బిడ్డ జననంకోసం వేసుకున్న ప్రణాళికలు కూడా ఉంటాయి. మీ డ్యూ-డేట్ ఈ సమయంలోనే ఉంటే ఎలా? లేదా మీ ఆరోగ్యం, లేదా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి మీకేమైన సందేహాలొస్తే ఎలా? ఇలాంటి సందేహాలు చాలామంది కాబోయే తల్లిదండ్రులకి ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. కాబట్టి ‘లాక్ డౌన్ లో డెలివరీ’ ప్లాన్ తయారుగా ఉంచుకోండి. మీ సందేహాలలో కొన్నింటికి సమాధానాలు.. ...

Read More »

భారీ నష్టాల్లో సెన్సెక్స్‌

భారీ నష్టాల్లో సెన్సెక్స్‌

దేశీయ మార్కెట్లు సోమవారం భారీ నస్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం1683 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ 32008 వద్ద, నిఫ్టీ 492 పాయింట్లను నష్టపోయి 9369 వద్ద కొనసాగుతోంది. కరోనా వ్యాప్తి నివారణ కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మరో 2వారాల పొడగింపు, ఏప్రిల్‌లో అమ్మకాలు లేకపోవడం వంటి కారణాలు ఈ నష్టాలకు దారితీశాయని మార్కెట్‌ వర్గాల సమాచారం. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.33 వద్ద కొనసాగుతోంది.

Read More »

మే 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

మే 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుండటంతో దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మే 4 నుంచి మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. ఈ మేరకు కేంద్రహోంశాఖ ఉత్తర్వులు జారీ జారీచేసింది. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతించారు. .కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు నానాటికీ దేశవ్యాప్తంగా పెరుగుతుండడంతో లాక్‌డౌన్‌ పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్‌ మొదటి దశ మార్చి 22న ప్రారంభమై మార్చి 31న ముగిసింది. లాక్‌డౌన్‌ రెండో దశ ఏప్రిల్‌ 1న ...

Read More »

సీఎంలతో ముగిసిన ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

సీఎంలతో ముగిసిన ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసింది.  కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు,కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటంతోపాటు లాక్‌డౌన్‌ సడలింపులపై ఎలా ముందుకు వెళ్లాలి? లాక్‌డౌన్‌ను పొడిగించాలా? లేక దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలా? తదితర విషయాలపై ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చించారు.  మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ ఉండాల్సిందేనని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానిని కోరారు. రెడ్‌జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగించాలని,  గ్రీన్‌జోన్లలో పూర్తి సడలింపు ఇవ్వాలని కొంతమంది సీఎంలు కోరారు.  వలసకూలీలకు అందుతున్నసాయంపైనా మోదీ ఆరా తీశారు.  

Read More »

వెంకన్న ఆదాయానికి లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌

వెంకన్న ఆదాయానికి లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌

కరోనా లాక్‌డౌన్‌ తిరుమల తిరుపతి దేవస్థానంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నెల రోజులుగా శ్రీవారి దర్శనం నిలిపివేయడంతో దాదాపు రూ.300 కోట్లకు పైగా ఆదాయం కోల్పోయింది. దీంతో 2020–21వ సంవత్సర బడ్జెట్‌ అంచనాలు తల్లకిందులవుతాయని టీటీడీ ఆర్థిక విభాగం అధికారులు ఆందోళన చెందుతున్నారు. గత నెల 19వ తేదీ నుంచి టీటీడీ ఘాట్‌ రోడ్లను మూసివేయడంతో పాటు 20వ తేదీ మధ్యాహ్నం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను నిలిపివేయడం విదితమే. ప్రధానంగా వివిధ ఆర్జితసేవా టిక్కెట్లు, ప్రసాదాలు, వసతి గదుల కేటాయింపు ద్వారా వచ్చే ...

Read More »

లాక్‌డౌన్‌ పొడిగింపునకే కేంద్రం మొగ్గు..?

లాక్‌డౌన్‌ పొడిగింపునకే కేంద్రం మొగ్గు..?

లాక్‌డౌన్ పొడిగింపునకే కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ప్రధాని మంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ పొడిగించాలని ప్రధానికి విన్నవించారు. దీంతో.. ముఖ్యమంత్రుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రధాని లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించాలని నిర్ణయించినట్లు భారత ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇప్పటికే ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి కూడా తెలిసిందే.

Read More »