Tag Archives: minister perni nani

వారం రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ -పేర్ని నాని

కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆగస్టు 3 నుంచి 9 వరకు మచిలీపట్నంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘మచిలీపట్నంలో కరోనాను కట్టడి చేయడంలో భాగంగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ అభిప్రాయం సేకరించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఉదయం 6 నుంచి 9 వరకు నిత్యావసరాలకు అనుమతిస్తున్నాం. మిగిలిన వ్యాపారాలన్నీ కూడా పూర్తిగా మూసివేయబడతాయి. బస్సులు, ఆటోలు, మోపెడ్‌లు రోడ్లపై తిరగ రాదు. అందరూ కూడా ...

Read More »

ప్రజా రవాణాపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పేర్ని నాని

ప్రజా రవాణాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాగానే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను పునఃప్రారంభించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల బస్సులు నడిపేందుకు అన్ని జాగ్రత్తలతో ఏర్పాట్లు చేశామని మంత్రి పేర్ని నాని తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర నిబంధనలు, రాష్ట్రంలో పరిస్థితుల అనుగుణంగా బస్సులు నడుపుతామని తెలిపారు.విజయవాడలో సోమవారం వైఎస్సార్‌ వాహనమిత్ర కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ...

Read More »

మానవత్వాన్ని చాటిన మంత్రి పేర్ని నాని

మానవత్వాన్ని చాటిన మంత్రి పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ మంత్రి పేర్నినాని మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన కారులో ఆసుపత్రిలో చేర్పించారు. వివరాల్లోకి వెళితే..కృష్ణా జిల్లా నిమ్మకూరులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి కారులో ప్రయాణిస్తుండగా గాయపడిన వ్యక్తిని గమనించి.. తన కారులో మచిలీపట్టణం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను పేర్నినాని ఆదేశించారు.

Read More »

మార్చి 15 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు

మార్చి 15 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశానంతరం రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 15 రోజుల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా చట్టంలో మార్పులు తీసుకువస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డబ్బు, ...

Read More »