Tag Archives: modi

రేపు బీజేపీ మేనిఫెస్టో విడుదల!

లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను BJP రేపు విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘సంకల్ప్ పాత్ర’ పేరిట ‘మోదీ గ్యారంటీ అభివృద్ధి చెందిన భారత్ 2047’ అనే థీమ్తో మేనిఫెస్టోను రూపొందించారట. ఇందులో దేశాభివృద్ధి, పేదలు, యువత, రైతులకు సాధికారత కల్పించడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చినట్లు సమాచారం. మేనిఫెస్టోకు ప్రజల నుంచి సజెషన్స్ స్వీకరించగా, 1.5M సూచనలు వచ్చినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Read More »

సుభాష్ చంద్రబోస్ ప్రధాని అంటున్నారు:KTR

లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న BJP అభ్యర్థులపై మాజీ మంత్రి KTR ట్విటర్ వేదికగా విమర్శలకు దిగారు. ‘సుభాష్ చంద్రబోస్ మన మొదటి ప్రధాని అని ఉత్తరాదికి చెందిన ఒక BJP అభ్యర్థి చెప్పారు. దక్షిణాదికి చెందిన మరో BJP నాయకుడు మహాత్మా గాంధీ మన ప్రధాని అని చెప్పారు. వీళ్లంతా ఎక్కడి నుంచి పట్టభద్రులయ్యారు?’ అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ‘వీరిదంతా వాట్సాప్ యూనివర్సిటీ’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read More »

మోడీని ‘పెద్దన్న’ అని పిలవడంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

ఇటీవల ఆదిలాబాద్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి ‘బడేభాయ్’ అని సంబోధించడం తీవ్ర చర్చనీయాంశం అయింది. దీనిపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ.. బడేభాయ్, చోటే భాయ్ ఒక్కటే అని విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ అంశంపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ప్రధానిని పెద్దన్న అని ఎందుకు పిలిచారో క్లారిటీ ఇచ్చారు. ఫెడరల్ వ్యవస్థలో ప్రధాని అన్ని రాష్ట్రాలకు బాధ్యత వహిస్తారని తెలిపారు. అందుకే ఇటీవల స్టేట్ కు వచ్చినప్పుడు మోడీని కలిశానన్నారు. పెద్దన్న అని పిలిచా అని తెలిపారు. పార్టీ, ...

Read More »

ఏపీ ప్రభుత్వంపై ప్రధాని విమర్శలు

ఏపీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ చిలకలూరిపేట సభలో విమర్శలు చేశారు. ‘రాష్ట్ర మంత్రులు అవినీతి, అక్రమాల్లో పోటీ పడుతున్నారు. ఒకరికి మించి ఒకరు అవినీతి చేస్తున్నారు. కాంగ్రెస్, వైసీపీ వేర్వేరు కాదు. ఈ రెండూ కుటుంబ పార్టీలే. YCPని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. YCP అవినీతితో APలో గత ఐదేళ్లు అభివృద్ధి జరగలేదు. రాబోయే 5 ఏళ్లు APకి కీలకం. ఎన్నికల్లో ఓటు చీలకుండా NDAను గెలిపించాలి’ అని కోరారు.

Read More »

కాసేపట్లో గన్నవరంకు మోదీ.. సిద్దంగా ఉన్న నాలుగు హెలికాప్టర్లు

ఇప్పుడు అందరి దృష్టి చిలకలూరిపేటలో జరగబోతున్న ‘ప్రజాగళం’ సభ పైనే ఉంది. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. ప్రధాని మోదీ 4.10 గంటలకు విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రజాగళం సభకు హెలికాప్టర్ లో మోదీ వెళ్తారు. ఎయిర్ పోర్టులో మోదీ కోసం నాలుగు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఇండియన్ నేవీకి ...

Read More »

నేడు ఏపీకి మోదీ.. పల్నాడులో భారీ బహిరంగ సభ

దేశంలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ విజయవాడ కార్యాలయం ప్రకటించింది. జిల్లాలోని చిలకలూరిపేటలో సభ ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది.ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారు. దాదాపు పదేళ్ల తరువాత కూటమి భాగస్వాములు అందరూ ఒకే వేదికపైకి రానుండటంతో ఈ సభకు ప్రాధాన్యం పెరిగింది. 2024 ఎన్నికలకు సంబంధించి ఏపీలో ఇది తొలి ...

Read More »

చంద్రబాబు,నరేంద్ర మోడీపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లోనే వెలువడనుంది. ఇప్పటికే పలు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను విడతల వారీగా ప్రకటించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేత మధ్య డైలాగ్ వార్ ఊపందుకుంది. తాజాగా మంత్రి అంబటి రాంబాబు కూటమిపై సెటైర్ల పేల్చారు. చంద్రబాబు సైకిల్ తొక్కలేరు.. మోదీ నెట్టలేరంటూ కామెంట్ చేశారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించే మోసగాడని అన్నారు. అదేవిధంగా పవన్ కల్యాణ్ సినిమాలు చేసుకుంటేనే మంచిదని.. రాజకీయాలకు పనికిరాడని తెలిపారు. సీఎం ...

Read More »

లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కోసం మోదీ అధ్యక్షతన సమావేశం

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటూ ఇతర కీలక నేతలైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దియో సాయ్ తదితరులు పాల్గొన్నారు.

Read More »

పీవీ నరసింహారావుకు భారతరత్న

తెలుగుజాతి ఆణిముత్యం, బహుబాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావును భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది. పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ , హరితవిప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ లకు కూడా భారతరత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇప్పటికే ఎల్ కే అద్వానీ, కర్పూరీ ఠాకూర్ లకు భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది మొత్తం ఐదుగురికి భారతరత్న ...

Read More »

దేశంలో డర్టీ పొలిటీషియన్ చంద్రబాబు: రోజా

బీజేపీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. అధికారం కోసం ఎవరి కాళ్లు పట్టుకోవడానికైనా చంద్రబాబు సిద్ధపడతారని ఆమె విమర్శించారు. దేశంలోనే ఆయన డర్టీ పొలిటీషియన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ ముఖ్యమంత్రిగా పనికిరారని, ప్రధానిగా పనికిరారని చంద్రబాబు ఎన్నో రకాలుగా మాట్లాడారని… ఏపీకి వచ్చినప్పుడు టీడీపీ శ్రేణులు నల్ల జెండాలను ఎగరేయడాన్ని మోడీ మర్చిపోయి ఉండరనే తాను అనుకుంటున్నానని చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుమలకు వచ్చినప్పుడు ఆయన ...

Read More »