Tag Archives: nani

చంద్రబాబుకి కేశినేని నాని సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఎంపీ కేశినేని నాని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తనపై ఎంపీగా చంద్రబాబు పోటీ చేయాలన్నారు. 3 లక్షల మెజార్టీతో తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కనీసం కొడుకునే గెలిపించుకోలేని వ్యక్తి.. అధికారంలోకి వస్తానని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.మైలవరం టికెట్ ఎవరికిస్తారో చెప్పలేకపోతున్నారని.. అక్కడ YCP అభ్యర్థి 25వేల మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు.

Read More »

నాని, కీర్తి కాంబినేష‌న్‌లో `దసరా` చిత్రం షురూ!

శ్యామ్ సింఘ రాయ్ విజయంతో వున్న నాని ఇప్పుడు మొద‌టిసారి శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్‌లో ద‌స‌రా చిత్రం చేస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఆధ్వర్యంలో దసరాకు ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. క‌థానాయిక‌గా జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ న‌టించ‌నుంది. దసరా చిత్రం ఈరోజు (బుధ‌వారం నాడు) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అతిధులుగా సుకుమార్, తిరుమల కిషోర్, వేణు ఉడుగుల, శరత్ మండవ హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు దర్శకుడు శ్రీకాంత్ తండ్రి చంద్రయ్య కెమెరా ...

Read More »

నాని ‘శ్యామ్‌ సింగరాయ‌’ ఫస్ట్‌లుక్‌

నాని ‘టక్‌ జగదీష్‌’, ‘శ్యామ్‌ సింగరారు’ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. వీటిలో టక్‌ జగదీష్‌ ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. బుధవారం నాని పుట్టినరోజు సందర్భంగా ‘శ్యామ్‌ సింగరారు’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. పేరు శ్యామ్‌.. పూర్తి పేరు శ్యామ్‌ సింగరారు… అంటూ నాని తన ట్విటర్‌ ద్వారా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశాడు. ఈ చిత్రం కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో నాగవంశీ నిర్మిస్తున్నారు.

Read More »

థియేటర్లలో నాని ‘వి’

నాని 25వ చిత్రం ‘వి’ ఇప్పుడు థియేటర్లలో రాబోతుందని సమాచారం. నానితో పాటు మరో కథానాయకుడిగా సుధీర్‌బాబు నటించిన ఈ చిత్రం కోవిడ్‌ కారణంగా అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ఓటీటిలో విడుదలైందన్నది తెలిసిందే. అయితే థియేటర్లు తెరవగానే సినిమాను అక్కడే విడుదల చేసుకుంటామనే షరతుతోనే అప్పట్లో అమెజాన్‌కు డిజిటల్‌ హక్కులను దిల్‌రాజు ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే దిల్‌రాజు ‘వి’ సినిమా విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం.

Read More »

అల్లరి నరేశ్‌కు స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపిన నాని

అల్లరి నరేశ్‌కు స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపిన నాని

తెరంగేట్రం చేసిన తొలి చిత్రం పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న కామెడీ హీరో అల్లరి నరేశ్‌. ఓ వైపు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు నటుడిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ పలు విభిన్న చిత్రాల చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో పూర్తిగా తన పంథా మార్చుకొని పలు సీరియర్‌ క్యారెక్టర్స్‌ ట్రై చేస్తున్నాడు. ఇలా ప్రయోగాత్మకంగా చేసింది ‘నాంది’. ఈరోజు నరేశ్‌ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు వరుస సర్‌ప్రైజ్‌లు వస్తున్నాయి. అతడి తాజా చిత్రాలు నాంది, బంగారు బుల్లోడు చిత్రాల టీజర్లు ...

Read More »

చంద్రబాబు పై ఫైర్ అయిన పేర్ని నాని

చంద్రబాబు పై ఫైర్ అయిన పేర్ని నాని

కరోనా పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. కరోనా వైరస్‌ రాష్ట్రంలో ఎక్కడ ప్రబలిందో బాబు చెప్పాలని ఆయన అడిగారు. చంద్రబాబు పొరుగు రాష్ట్రంలో విమర్శలు చేయడం సరికాదని అన్నారు. కరోనా వైరస్‌ నివారణకు తాము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వైరస్‌ నివారణకు కర్ఫ్యూ, లాక్‌డౌన్‌తో పటిష్ట చర్యలు చేపడుతున్నామని అన్నారు.

Read More »