అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓటర్లను ప్రేరేపిస్తుందని మండిపడ్డారు. యుపిలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ అభివృద్ధి విధానాలకు చాలా దూరంగా ఉందని ఎస్‌పి చెబుతోందని అన్నారు. ఫేక్ సమాజ్‌వాద్.. పేదల ప్రభుత్వం మధ్య ఎన్నికలుగా ఆయన అభివర్ణించారు. పేదలకు ఇళ్లు, వెనుకబడిన వర్గాలకు పథకాలు, మెడికల్ కాలేజీలు, ఎక్స్‌ప్రెస్‌వేల ద్వారా కనెక్టివిటీ, ముస్లిం మహిళలకు కార్యక్రమాలు, మహిళలకు సంబంధించి వివిధ పథకాలు గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘ఈ రోజుల్లో.. ప్రజలు చాలా కలలుగంటున్నారు. ...
Read More »Tag Archives: PM Modi
అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో మోడీకి తొలిస్థానం
మోడీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన దేశాధినేతల్లో తొలి స్థానంలో నిలిచారు. 13 మంది దేశాధినేతలపై అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణకొరియా, స్పెయిన్, బ్రిటన్, అమెరికా దేశాధినేతలపై ఈ సర్వే చేపట్టింది. అందులో మోడీని 71 శాతం మంది ప్రజలు ఆమోదించారు. ఇక ఈ జాబితాలో 43 శాతం రేటింగ్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానంలో నిలిచారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ...
Read More »వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో భేటీ కానున్నమోడీ
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు విస్తృతంగా వ్యాక్సినేషన్ నిర్వహిస్తోంది భారత్.. ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 100 కోట్ల మార్క్‌ను కూడా దాటేసిన సంగతి తెలిసిందే కాగా… వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ప్రధాని నరేంద్ర మోడీ.. స్వదేశీ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో సమావేశం కానున్నారు.. దేశీయంగా వ్యాక్సిన్లు తయారు చేస్తున్న ఏడు వ్యాక్సిన్ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో భేటీ అవుతారు.. ఈ సమావేశానికి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, జైడస్ క్యాడిల్లా, ...
Read More »ఆ చీకటి రోజులను ఎప్పటికీ మర్చిపోలేం : మోడీ
దేశంలో ఎమర్జెన్సీ విధించి 46 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలు సంధిస్తూ ప్రధాని మోడీ శుక్రవారం వరస ట్వీట్లు చేశారు. ఆ చీకటి రోజులను ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. ‘ఆ అత్యయిక స్థితినాటి చీకటి రోజులను ఎప్పటికీ మరచిపోలేం. 1975 నుంచి 1977 మధ్య రాజ్యాంగ సంస్థలు క్రమంగా విచ్ఛిన్నం కావడం మనకు కనిపిస్తుంది. భారతదేశ ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తూ, రాజ్యాంగంలో పొందుపరచిన విలువలకు అనుగుణంగా జీవిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం. మన ప్రజాస్వామ్య విలువలను కాంగ్రెస్ అణచివేసింది. ఆ ...
Read More »ప్రధాని మోడికి సీఎం జగన్ లేఖ
రాష్ట్రంలో పేదల కోసం ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వమే పక్కాగా ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. ఇటీవలే దీనికి సంబందించిన కార్యక్రమం అధికారికంగా ప్రారంభించారు. ఇక ఇదిలా ఉంటే, సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆ లేఖలో వివరించారు. ఏపీలో 30లక్షల మందికి ...
Read More »మోదీకి మమతా బెనర్జీ దిమ్మదిరిగే కౌంటర్
మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. యాస్ తుఫాను నష్టంపై ప్రధానితో సమీక్ష సమావేశానికి బెంగాల్ సీఎం అలస్యంగా వచ్చారని, ప్రధానిని కించపరిచేలా, అమర్యాదగా ఓ ముఖ్యమంత్రి ప్రవర్తించడం గతంలో ఎన్నడూ చూడలేదని ప్రధాన మంత్రి కార్యాలయం చేసిన వ్యాఖ్యలపై దీదీ మండిపడ్దారు. మీడియాకు పీఎంఓ తప్పుడు సమాచారం ఇస్తోందని దుయ్యబట్టారు. మమ్మల్ని ఇంతలా అవమానించవద్దని, అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఘన విజయం సాధించడంతో మీరు ఓర్వలేకపోతున్నారని మమతా తూర్పారబట్టారు. ‘‘ఈ విధంగా నన్ను అవమానించవద్దు.. మాకు ఘన విజయం లభించింది, అందుకే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? గెలవడానికి మీరు ...
Read More »కాసేపట్లో మోడీ ఏరియర్ సర్వే
కాసేపట్లో యాస్ తుపాను ప్రభావం అధికంగా పడిన ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోడి ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ రెండు రాష్ట్రాల్లోనూ ప్రధాని సమీక్ష సమావేశాలను చేపట్టనున్నారని, ఏరియల్ సర్వే సైతం చేపడతారని స్పష్టం చేసింది. సైక్లోన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను ప్రధాన మంత్రి విమానంలో నుంచి ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. యాస్ తుఫాను వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఏ మేరకు ప్రభావం పడిందీ అంచనా వేయడానికిగాను నిర్వహించే సమీక్ష ...
Read More »గుజరాత్‌లో ఏరియల్ సర్వే చేపట్టిన మోడీ
తౌక్టే తుఫాన్‌కు ప్రభావితమైన గుజరాత్‌లో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే బుధవారం చేపట్టారు. తొలుత రాష్ట్రంలోని భావనగర్‌కు చేరుకున్న అనంతరం విమానంలో తుఫాన్ బాధిత ప్రాంతాలైన ఉణ, డయ్యు జఫ్రాబాద్, మహువలను విహంగ వీక్షణం చేశారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీని తర్వాత అధికారులతో అహ్మదాబాద్‌లో మోడీ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తౌక్టే తుపాన్ కారణంగా గుజరాత్‌లో 13 మంది మరణించిన సంగతి విదితమే.
Read More »పిఎం కిసాన్ ఎనిమిదో విడత నిధులు విడుదల
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్) కింద ఎనిమిదో విడతలో భాగంగా రూ. 20 వేల కోట్లను ప్రధాని మోడీ శుక్రవారం విడుదల చేశారు. ఈ మొత్తం 9.5 కోట్ల మంది అన్నదాతలు ఖాతాల్లో నేరుగా జమకానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ..ఈ పథకంలో పశ్చిమ బెంగాల్ చేరిందని, రాష్ట్రంలో 7 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారని తెలిపారు. పిఎం కిసాన్ పథకం ...
Read More »భారత్‌లో కోవిడ్ అత్యయిక పరిస్థితులు… మోడీకి లాన్సెట్ హెచ్చరిక
భారత్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. కరోనా కట్టడి చేయడంలో మోడీ సర్కార్ తీవ్రంగా విఫలమైంది. ఇప్పటి గణాంకాలే అందుకు ఉదాహరణ. దేశంలో కరోనా అధ్వాన పరిస్థితులపై ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ది లాన్సెట్ మండిపడింది. మే 4వ తేదీ నాటికి దేశంలో 2కోట్లకు పైగా కేసులు వెలుగుచూశాయని, అంటే రోజుకు సగటున 3,78 వేల కేసులు నమోదయ్యాయని పేర్కొంది. మరణాలు కూడా అదే స్థాయిలో సంభవిస్తున్నాయని. ఆ సమయానికి 2,22,000 మందికి పైగా మరణించారని తెలిపింది. సరైన నియంత్రణ చర్యలు తీసుకోకపోతే ఆగస్టు 1 ...
Read More »