Tag Archives: PM Modi

భర్త, బిడ్డతో ప్రధానిని కలిసిన వైసీపీ ఎంపీ

అరకు వైసీపీ ఎంపీ మాధవి గొడ్డేటి తన భర్త శివప్రసాద్, బిడ్డతో కలసి ప్రధాని మోదీని కలిశారు. ట్విటర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మా బిడ్డకు ప్రధాని మోదీ తన దీవెనలందించారు. ఏపీ సీఎం జగన్, ప్రధాని కార్యాలయానికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. 2019 అక్టోబరు 18న మాధవి దంపతుల వివాహం జరిగింది. ఇటీవల ఆడబిడ్డ జన్మించింది. ఈక్రమంలో మోదీ దీవెనల కోసం ఆయన వద్దకు ఎంపీ బిడ్డను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Read More »

ఢిల్లీలో ప్రధాని మోడీతో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ..

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ ఈ మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ప్రధానికి శాలువా కప్పి సత్కరించారు. ఆయనకు వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. ప్రధానితో సీఎం జగన్ సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. విభజన హామీలు, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, తాజా రాజకీయ పరిణామాల గురించి సీఎం జగన్ ప్రధాని మోడీతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి పార్లమెంటులోని ప్రధాని కార్యాలయం వేదికగా నిలిచింది. ప్రధానితో సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంటులోని ఆర్థిక శాఖ ...

Read More »

పార్లమెంటుకు చేరుకున్న సీఎం జగన్..

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాసేపటి క్రితం పార్లమెంటుకు చేరుకున్నారు. కాసేపట్లో ఆయన ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి అంశాలపై ప్రధానితో జగన్ చర్చించే అవకాశం ఉంది. అమిత్ షాను టీడీపీ అధినేత చంద్రబాబు కలిసిన వెంటనే జగన్ ఢిల్లీకి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రధాని మోడీతో భేటీ అనంతరం ...

Read More »

కాసేపట్లో ప్రధాని మోడీతో భేటీ కానున్న సీఎం జగన్

ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, పోలవరం ప్రాజెక్ట్, పలు అభవృద్ధి అంశాలపై ప్రధానితో జగన్ చర్చించే అవకాశం ఉంది. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్ భేటీ అవుతారు. పలువురు కేంద్ర మంత్రులతో జగన్ కలిసే అవకాశం ఉంది. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, వైసీపీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.

Read More »

ఢిల్లీకి వెళ్తున్న జగన్.. మోడీతో భేటీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో సీఎం ప్రధాని మోడీతో భేటీ అవుతారు. రేపు ఉదయం ప్రధానిని జగన్ కలవనున్నారు. ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండానే హఠాత్తుగా జగన్ ఢిల్లీకి వెళ్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సంగతి తెలిసిందే. దాదాపు గంటసేపు వీరి మధ్య చర్చలు కొనసాగాయి. రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ...

Read More »

లోక్ సభలో కాంగ్రెస్ పై ప్రధాని మోడీ ప్రసంగం…!

75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని లోక్ సభలో ప్రధాని మోడీ తెలిపారు. రాష్టపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానమన్నారు. సభకు సెంగోల్ తీసుకొచ్చి కొత్త సాంప్రదాయాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు ప్రధాని. విపక్షాలు చాలాకాలం అదే స్థానంలో ఉండాలని తీర్మానించుకున్నాయన్నాయని… అందుకు విపక్షాలకు నా ధన్యవాదాలన్నారు. కొంత మంది లోక్ సభ సీటును మార్చుకున్నారు. అయితే, ఈ సారి వాళ్లు రాజ్యసభకు వచ్చే ఆలోచనలో ఉన్నారని ప్రధాని మోడీ వెల్లడించారు.

Read More »

అద్వానీకి భారతరత్న.. ఎంతో ఆనందంగా ఉందన్న మోడీ

బీజేపీ అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు అద్వాణీని భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఎల్కే అద్వాణీ గారికి భారతరత్న పురస్కారం ఇవ్వబడుతోందనే విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ పురస్కారాన్ని పొందబోతున్నందుకు అభినందనలు తెలియజేశాను. సమకాలీన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో అద్వాణీ ఒకరు. మన దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు, కృషి చిరస్మరణీయమైనవి. అట్టడుగు స్థాయిలో పని చేయడం దగ్గర నుంచి దేశానికి ...

Read More »

ఎస్‌పివి ప్రతీకార రాజకీయాలు..వర్చువల్‌ సమావేశంలో మోడీ

అఖిలేష్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓటర్లను ప్రేరేపిస్తుందని మండిపడ్డారు. యుపిలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వ అభివృద్ధి విధానాలకు చాలా దూరంగా ఉందని ఎస్‌పి చెబుతోందని అన్నారు. ఫేక్‌ సమాజ్‌వాద్‌.. పేదల ప్రభుత్వం మధ్య ఎన్నికలుగా ఆయన అభివర్ణించారు. పేదలకు ఇళ్లు, వెనుకబడిన వర్గాలకు పథకాలు, మెడికల్‌ కాలేజీలు, ఎక్స్‌ప్రెస్‌వేల ద్వారా కనెక్టివిటీ, ముస్లిం మహిళలకు కార్యక్రమాలు, మహిళలకు సంబంధించి వివిధ పథకాలు గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘ఈ రోజుల్లో.. ప్రజలు చాలా కలలుగంటున్నారు. ...

Read More »

అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో మోడీకి తొలిస్థానం

మోడీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన దేశాధినేతల్లో తొలి స్థానంలో నిలిచారు. 13 మంది దేశాధినేతలపై అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, భారత్‌, ఇటలీ, జపాన్‌, మెక్సికో, దక్షిణకొరియా, స్పెయిన్‌, బ్రిటన్‌, అమెరికా దేశాధినేతలపై ఈ సర్వే చేపట్టింది. అందులో మోడీని 71 శాతం మంది ప్రజలు ఆమోదించారు. ఇక ఈ జాబితాలో 43 శాతం రేటింగ్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరో స్థానంలో నిలిచారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ...

Read More »

వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులతో భేటీ కానున్నమోడీ

కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టేందుకు విస్తృతంగా వ్యాక్సినేషన్‌ నిర్వహిస్తోంది భారత్‌.. ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ డోసుల సంఖ్య 100 కోట్ల మార్క్‌ను కూడా దాటేసిన సంగతి తెలిసిందే కాగా… వ్యాక్సినేష‌న్ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ప్రధాని నరేంద్ర మోడీ.. స్వదేశీ వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల‌తో సమావేశం కానున్నారు.. దేశీయంగా వ్యాక్సిన్లు తయారు చేస్తున్న ఏడు వ్యాక్సిన్ కంపెనీల‌కు చెందిన ప్రతినిధుల‌తో భేటీ అవుతారు.. ఈ సమావేశానికి సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా, భార‌త్ బ‌యోటెక్‌, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ‌రేట‌రీస్‌, జైడ‌స్ క్యాడిల్లా, ...

Read More »