Tag Archives: rains in ap

రాగల 48 గంటల్లో తేలికపాటి వర్షాలు

రాష్ట్రంలోని దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాగల 48 గంటల్లో రెండు మూడు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలలో పొడి వాతావరణమే కొనసాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పరిసరాల్లో తక్కువ ఎత్తులో తూర్పు, ఈశాన్యగాలులు వీస్తున్నందున పొడి వాతావరణం కొనసాగుతుందన్నారు.

Read More »

తీవ్ర వాయుగుండంగా బురేవి తుపాను

ఐఎండి సూచనల మేరకు, బురేవి తుపాను నేపథ్యంలో.. ముందుగానే తమిళనాడు, దక్షిణ కేరళ ప్రాంతాలకు అధికారులు రెడ్‌ అలెర్ట్‌ ను జారీ చేశారు. ఈ బురేవి తుపాను తమిళనాడు, కేరళలో భారీ ప్రభావం చూపుతుందని భారత వాతావరణ విభాగం భావించింది. ప్రస్తుతం బురేవి తీవ్ర వాయుగుండంగా బలహీనపడి పంబన్‌ తీరానికి అత్యంత చేరువకు చేరింది. పంబన్‌ కు ఆగేయంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తీవ్ర వాయుగుండం శుక్రవారం అర్ధరాత్రి తర్వాత రామనాథపురం, తూత్తుకుడి జిల్లా మధ్య తీరం దాటనుందని అధికారులు తెలిపారు. ...

Read More »

పెను తుఫానుగా నివర్‌..

బంగాళాఖాతంలో కొనసాగుతున్న నివర్‌ తుఫాను మరికొన్ని గంటల్లో పెను తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం అర్థరాత్రికి లేదా గురువారం ఉదయానికి కరైకల్‌-మమల్లపురం వద్ద తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం సాయంత్రం కడలూరుకి 180 కిమీలు, పుదుచ్చేరికి 190 కిమీల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. తుపాను గంటకు 11 కిమీల వేగంతో తీరం వైపుగా కదులుతున్నట్లు తెలిపింది. కొన్ని గంటల్లో పెను తుఫానుగా మారుతుందని తెలిపింది. తీరం దాటే సమయంలో గాలుల వేగం 120 కిమీల నుంచి ...

Read More »

రాగల మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు

రాగల మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడు తీరానికి దగ్గరగా నైరుతి బంగాళాఖాతంలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఆగేయ, నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. వీటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలపైకి సముద్రం నుంచి తూర్పుగాలులు వీస్తున్నాయి. మంగళవారం నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, ...

Read More »

రాగల 4, 5 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు..

రాగల 4, 5 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఐఎండి వాతావరణ సూచనల మేరకు.. రాగల నాలుగైదు గంటలు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు పలుచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. భారీ ...

Read More »

కోస్తాంధ్రను వణికిస్తోన్న వాయుగుండం

మంగళవారం ఉదయం 6.30 గంటల నుండి 7.30 గంటల మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర వాయుగుండం తీరాన్ని దాటినట్లు విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు విశాఖ, కృష్ణా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. తీరం వెంబడి గంటలకు 65 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో సముద్రంలోకి మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లకూడదని మంత్రి కన్నబాబు ...

Read More »

రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో కోస్తా జిల్లాలకు తుఫాను గండం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణశాఖ అధికారులు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గల్ఫ్‌ ఆఫ్‌ థారులాండ్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశించిందని.. మరోవైపు రాయలసీమను ఆనుకుని దక్షిణ కోస్తాంధ్ర పరిసరాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర ఆవర్తనం కొనసాగుతోందని, వీటి ప్రభావంతో ఉత్తర అండమాన్‌ సముంద్రం, దాని పరిసరాల్లో అల్ప పీడనం ఏర్పడుతుందని.. ...

Read More »

రానున్న మూడు రోజుల్లో ఎపిలో భారీ వర్షాలు

రానున్న మూడు రోజుల్లో ఎపిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఐఎండి సూచనల ప్రకారం ఉత్తర అండమాన్‌ సముద్రం, దాని అనుసంధానంగా తూర్పు మధ్య బంగాళఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. ఆ తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆదివారం సాయంత్రంలోగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు ...

Read More »

రేపు మరో అల్పపీడనం.. ఏపీలో ఆ ప్రాంతాలకు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వరుసగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు, నదులు, చెరువులు పొంగుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు రావడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే వర్షాలు మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. తూర్పు మధ్యప్రదేశ్‌ మధ్య భాగం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్లు ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కూడా ...

Read More »

నేడు మరో అల్పపీడనం

ఈశాన్య బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో బుధవారం ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతోందని విశాఖ వాతావరణ కేంద్రం, భారత వాతావరణ విభాగం– అమరావతి తెలిపాయి. రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమం వైపు కదిలే అవకాశం ఉందని వెల్లడించాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. బుధ, గురువారాల్లో రాష్ట్రమంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Read More »