Tag Archives: rains

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. సిద్దిపేట, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ జిల్లాల్లో వాన పడుతోంది. హైదరాబాద్ నగరంలోనూ పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అకాల వర్షాలకు వరి కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు ఆరబోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

Read More »

తెలంగాణ, ఏపీ ప్రజలకు చల్లటి కబురు

రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా ఎండలు కొడుతున్న సంగతి తెలిసిందే. బయట అడుగుపెట్టలేని పరిస్థితిలు నెలకొన్నాయి. అధిక ఉష్ణోగ్రతలు అలాగే వడగాలులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈరోజు అలాగే రేపు తెలంగాణ మరియు ఏపీ రాష్ట్రాలలో తీవ్ర వడగాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇలాంటి నేపథ్యంలో చల్లటి కబురు అందింది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న నాలుగు జిల్లాలలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తొమ్మిది జిల్లాల్లో 43.4° ఉష్ణోగ్రత నమోదు అయింది. ...

Read More »

రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు విస్తరించ నున్నాయని, ఉత్తర బంగాళాఖాతంలో అంతటికీ వ్యాపించి వర్షాలకు అనువైన పరిస్థితులు ఏర్పడనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల శుక్రవారం వర్షాలు పడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం రూరల్‌, రాజమహేంద్ర వరం, రాజవొమ్మంగి, ...

Read More »

రాగల 48 గంటల్లో తేలికపాటి వర్షాలు

రాష్ట్రంలోని దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాగల 48 గంటల్లో రెండు మూడు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలలో పొడి వాతావరణమే కొనసాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పరిసరాల్లో తక్కువ ఎత్తులో తూర్పు, ఈశాన్యగాలులు వీస్తున్నందున పొడి వాతావరణం కొనసాగుతుందన్నారు.

Read More »

తీవ్ర వాయుగుండంగా బురేవి తుపాను

ఐఎండి సూచనల మేరకు, బురేవి తుపాను నేపథ్యంలో.. ముందుగానే తమిళనాడు, దక్షిణ కేరళ ప్రాంతాలకు అధికారులు రెడ్‌ అలెర్ట్‌ ను జారీ చేశారు. ఈ బురేవి తుపాను తమిళనాడు, కేరళలో భారీ ప్రభావం చూపుతుందని భారత వాతావరణ విభాగం భావించింది. ప్రస్తుతం బురేవి తీవ్ర వాయుగుండంగా బలహీనపడి పంబన్‌ తీరానికి అత్యంత చేరువకు చేరింది. పంబన్‌ కు ఆగేయంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తీవ్ర వాయుగుండం శుక్రవారం అర్ధరాత్రి తర్వాత రామనాథపురం, తూత్తుకుడి జిల్లా మధ్య తీరం దాటనుందని అధికారులు తెలిపారు. ...

Read More »

నివర్‌ తుఫాన్.. భారీగా కురుస్తున్న వర్షాలు

నివర్‌ తుపాన్‌ బుధవారం తీరం దాటింది. పుద్చుచేరి సమీపంలో తీరం దాటి అతి తీవ్ర తుపాను నుండి తీవ్ర తుపానుగా బలహీనపడింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి, గురువారం తెల్లవారు జామున 2.30 గంటల మధ్య నివర్‌ తుపాన తీరం దాటినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈదురుగాలులు 100-110కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అవి గంటకు 120 వేగం వరకు పుంజుకుంటాయని వాతారణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు భారత్‌లో వచ్చిన ఏడు రకమైన తుపానుల్లో..ఇది ఐదవదని, బలమైనదని చెప్పారు. ...

Read More »

5 రోజుల్లో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు

 రానున్న ఐదు రోజుల్లో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) అంచనా వేసింది. తమిళనాడు, కోస్తాంధ్రకు ఉత్తర దిశగా అల్పపీడనం నెలకొందని, ఈ ప్రభావంతో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని ఐఎండి గురువారం ట్విట్టర్‌ ద్వారా పేర్కొంది. వచ్చే 24 గంటల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా ఈనెల 30తో పాటు వచ్చే నెల 1,2 తేదీల్లో కూడా రాష్ట్రంలో భారీ ...

Read More »

రాగల 4, 5 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు..

రాగల 4, 5 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఐఎండి వాతావరణ సూచనల మేరకు.. రాగల నాలుగైదు గంటలు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు పలుచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. భారీ ...

Read More »

రేపు మరో అల్పపీడనం.. ఏపీలో ఆ ప్రాంతాలకు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వరుసగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు, నదులు, చెరువులు పొంగుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు రావడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే వర్షాలు మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. తూర్పు మధ్యప్రదేశ్‌ మధ్య భాగం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్లు ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కూడా ...

Read More »

రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల రాగల 24 గంటల్లో భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తాలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వివరించారు.

Read More »