Tag Archives: rajasingh

ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్టు

 ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు అందడంతో పోలీసులు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఫిబ్రవరి 19, ఏప్రిల్‌ 12న రాజా సింగ్‌పై నమోదైన కేసుల్లో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గురువారం ఉదయం షాహినాయత్‌ గంజ్‌, మంగళ్‌హట్‌ పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌ ఇంటికి వెళ్లే దారిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో రాజాసింగ్‌ ఇంటి వద్ద ...

Read More »

అక్బరుద్దీన్‌ పై మండిపడ్డ రాజాసింగ్

అక్బరుద్దీన్‌ పై మండిపడ్డ రాజాసింగ్

హిందు దేవాలయాల అభివృద్ధికి నిధులడిగే హక్కు అక్బరుద్దీన్ ఓవైసీకి లేదని బీజేపీ నేత రాజసింగ్ పేర్కొన్నారు. గతంలో హిందువులు, గోవులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాకనే.. దేవాలయాల అభివృద్ధి గురించి అక్బర్ మాట్లాడాలన్నారు. పాతబస్తీలోని కాళిమాయ ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తమకు తెలుసని రాజాసింగ్ పేర్కొన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలో భాగంగానే ప్రగతిభవన్‌కు అక్బర్ వెళ్లారని ఆరోపించారు. తనపై ఉన్న హిందు వ్యతిరేక మచ్చను తొలగించుకోవటానికి అక్బర్ ప్రయత్నిస్తున్నారని రాజాసింగ్ తెలిపారు.

Read More »