Tag Archives: Ravi Teja

మిస్టర్‌ బచ్చన్‌ హంగామా..

రవితేజ హీరోగా హరీశ్‌శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం మిస్టర్‌ బచ్చన్‌. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఉత్తరప్రదేశ్‌లో 30 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. కీలక షెడ్యూల్‌ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం అంతా కలిసి అయోధ్య బాలక్‌ రామ్‌ని దర్శనం చేసుకొని ఆశీస్సులు అందుకున్నారు. మిగిలిన నిర్మాణం పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. రవితేజ పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న ...

Read More »

‘ధమాకా’ పాట విడుదల

రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘ధమాకా’ ఒకటి. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి పాట లిరికల్‌ వీడియోను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటను మంగ్లీ ఆలపించారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ అందించిన ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

Read More »

‘రామారావు మాస్‌ నోటీస్‌’

రవితేజ నటించిన తాజా చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో శరత్‌ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 29న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం జోరుగా ప్రమోషన్లు నిర్వహిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘రామారావు మాస్‌ నోటీస్‌’ పేరుతో మరో ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ ...

Read More »

రవితేజ ‘రామారావు’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

మాస్‌ మహారాజ రవితేజ కెరీర్‌లో 68వ మూవీగా శరత్‌ మండవ దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మాతగా ఎస్‌ఎస్‌వి సినిమాస్‌, ఆర్‌టి టీమ్‌ వర్క్స్‌ పతాకాలపై రూపొందుతున్న చిత్రానికి ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ను కన్ఫర్మ్‌ చేశారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని చిత్ర యూనిట్‌ సోమవారం విడుదల చేసింది. రామారావు ఆన్‌ డ్యూటీ చిత్రానికి నూతన దర్శకుడు దర్శకత్వం వహించినప్పటికీ, దీనికి సంబంధించిన ప్రతి అనౌన్స్‌మెంట్‌ ఈ మూవీపై క్యూరియాసిటీని పెంచింది. ఇప్పటివరకూ విడుదల చేసిన రెండు పొస్టర్స్‌లోనూ రవితేజ ముఖం ...

Read More »

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రవితేజ

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రవితేజ

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. ‘బలుపు’ వంటి హిట్ సినిమా తరవాత వీరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ‘క్రాక్’పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన టీజర్ కూడా బాగుండటంతో మళ్లీ ప్రేక్షకుల దృష్టి మాస్ మహారాజాపై పడింది. ప్రస్తుతం ‘క్రాక్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తయింది. ...

Read More »