Tag Archives: salman khan

‘ఖిలాడి’ రీమేక్‌ చేయబోతున్న సల్మాన్‌

చాలాకాలంగా దక్షిణాది రీమేక్‌లతో బ్లాక్‌ బస్టర్లు హిట్లు కొడుతున్నారు బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌. తాజాగా రవితేజ నటిస్తున్న ‘ఖిలాడి’ చిత్ర రీమేక్‌ హక్కులను ఆయన కొనుగోలు చేశారు. హిందీ వెర్షన్‌ కి కూడా రమేష్‌ వర్మనే డైరెక్ట్‌ చేయాలని ఆఫర్‌ చేశారని తెలుస్తోంది. ‘ఖిలాడీ’ టీజర్‌ నచ్చి, మేకర్స్‌్‌ ద్వారా కథ కూడా బావుందని తెలిసి హక్కులు కొనుగోలు చేశారని సమాచారం. ఇదివరకే రవితేజ నటించిన ‘కిక్‌’తో సల్మాన్‌ పెద్ద హిట్టు కొట్టాడు. ఇప్పుడు ‘ఖిలాడీ’ వర్కవుటవుతుందో లేదో చూద్దాం.

Read More »

రైతుల ఆందోళనపై సల్మాన్ స్పందన

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే రైతుల డిమాండ్‌ కొనసాగుతూనే ఉంది. పోలీసులు, రైతుల మధ్య హింసాత్మక ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖులు స్పందిస్తున్నారు. సినిమాలు వాళ్ళు కూడా ఈ వివాదం పట్ల అనుకూల, ప్రతికూల వాదనలు వినిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పందించాడు. “ఏది స‌రైన‌దో ఆ ప‌ని చేయాలి. అందరికీ ఉపయోగపడే తెలివైన నిర్ణయం తీసుకోవాలి” అని సల్మాన్ తెలిపాడు. కాగా, కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రైతులు ...

Read More »

హోం క్వారంటైన్‌లో సల్మాన్‌ఖాన్‌

సల్మాన్‌ ఖాన్‌ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆయన లాక్‌డౌన్‌ తర్వాత ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధే’ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారట. ఈ సందర్భంగా ఆయన డ్రైవర్‌, వ్యక్తిగత సిబ్బంది తరచూ ప్రయాణాలు చేయాల్సి రావడంతో.. కరోనా బారినపడ్డారు. సల్మాన్‌ఖాన్‌ వారిని వెంటనే చికిత్స కోసం ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. తాను కుటుంబ సభ్యులకు 14 రోజుల పాటు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. కాగా, కరోనా లాక్‌డౌన్‌ సమయంలో సల్మాన్‌ఖాన్‌ పన్వెల్‌లోని ఫామ్‌హౌస్‌లో ఉండి వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. వాటికి ...

Read More »

సల్మాన్ ఖాన్ కుటుంబం లో విషాదం

సల్మాన్ ఖాన్ కుటుంబం లో విషాదం

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనల్లుడు అబ్దుల్లా ఖాన్‌ (38) మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అబ్దుల్లా సోమవారం రాత్రి ముంబైలోని లీళావతి ఆస్పత్రిలో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిశారు. ఈ విషాయాన్ని సల్మాన్‌ ధృవీకరిస్తూ ‘ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము’ అంటూ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేశాడు.

Read More »

సల్మాన్ ఖాన్ తో జోడి కట్టనున్న పూజ హెగ్దే

సల్మాన్ ఖాన్ తో జోడి కట్టనున్న పూజ హెగ్దే

టాలీవుడ్‌లో ఫుల్‌ సక్సెస్‌ జోష్‌లో ఉన్నారు నటి పూజా హెగ్డే. ఇటీవల ఆమె నటించిన ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బాస్టర్‌గా నిలవడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే స్టార్‌ హీరోలందరితో నటిస్తూ మోస్ట్‌ బిజీ హీరోయిన్‌ అయ్యారు. తెలుగులో అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, ప్రభాస్‌ 20వ సినిమాలో నటిస్తున్న పూజా.. తాజాగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌తో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ఇప్పటికే బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌తో ‘మొహంజోదారో’.. అక్షయ్‌ కుమార్‌తో ‘హౌస్‌ఫుల్‌-4’లో నటించిన ...

Read More »