Tag Archives: sonu sood

సమస్యలను పరిష్కరించవచ్చు :సోనూసూద్‌

కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో సాయం కోరుతూ ఎంతోమంది సోనూకి ఫోన్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆయన ఓ ట్వీట్‌ పెట్టారు. ”సాయం కోరుతూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అర్ధరాత్రి ఫోన్లు రావడం పట్ల నాకెలాంటి ఇబ్బందిలేదు. కానీ, వాళ్లకు చేయూతనందించేవాళ్లు లేరా? అని బాధగా అనిపిస్తోంది. ఒకరిపై ఒకరు నిందలేసుకోవడం మానేసి… ఉద్యోగాలు కల్పించడం, పేదల ఆకలి తీర్చడం, ఉచిత విద్య అందించడం ద్వారా ఈ సమస్యలు పరిష్కరించవచ్చు” అని సోనూసూద్‌ పేర్కొన్నారు.

Read More »

కర్నూలులో సోనూసూద్‌ మొట్టమొదటి ఆక్సిజన్‌ ప్లాంట్‌

కరోనా బాధితులకు సోనూసూద్‌ చేస్తున్న ఎన్నో సహాయక చర్యల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణాలు ఒకటి. ఇప్పటికే యుఎస్‌, ఫ్రాన్స్‌ నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్లను తెప్పించేందుకు రంగం సిద్ధం చేశారు. వీటిని వివిధ రాష్ట్రాల్లో అవసరమైన ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు. అయితే మొదటి రెండు ప్లాంట్లను మన రాష్ట్రంలోని కర్నూలు, నెల్లూరులో ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం.

Read More »

మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్.. ఈ సారి ఏం చేశారంటే!!

కరోనా విజృంభణ కొనసాగుతుంటే తన వంతుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఆపదలో ఉన్న కార్మికులకు అండగా నిలుస్తున్నారు సోనూ సూద్. పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయంలో.. చేతిలో పనిలేక, ఉపాధి కోల్పోయి సొంత గూటికి చేరలేక బిక్కు బిక్కుమంటున్న వలస కార్మికులను వారి వారి స్వరాష్ట్రాలకు చేర్చి ఆదుకున్న సోనూ సూద్ పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికీ ఈ సేవా కార్యక్రమాలను కంటిన్యూ చేస్తున్న ఆయన, తాజాగా మరోసారి కార్మికుల పట్ల ఔదార్యాన్ని చాటుకున్నారు. 20 వేల మంది వలస కార్మికులకు ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ...

Read More »

మెసేజ్‌ చూడకపోతే క్షమించండి : సోనూసూద్‌

కరోనా కష్టకాలంలో పేదలకు సహాయం చేస్తూ ప్రముఖ నటుడు సోనూసూద్‌ నిజమైన హీరో అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే ఎంతోమందికి తనకు తోచినంత సాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తాజాగా దేశవ్యాప్తంగా సాయం చేయాలంటూ మెయిల్స్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టా ద్వారా గురువారం తనకు వచ్చిన వినతులను సోనూ ట్విటర్‌ ద్వారా షేర్‌ చేసుకున్నాడు. అందులో 1137 మెయిల్స్‌, 19వేలు ఫేస్‌బుక్‌ మెసేజ్‌లు, 4812 ఇన్‌స్టా, మరో 6741 మెసేజ్‌లు ట్విటర్‌ ద్వారా వచ్చాయి. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘ నాకు సహాయం ...

Read More »