Tag Archives: suprem court

కరోనా కారణం చూపి ఎన్నికలు వాయిదా వేయలేం : సుప్రీం కోర్టు

 కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేయలేమని, ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘమే నిర్ణయాలు తీసుకుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీహార్‌లో కరోనా పూర్తిగా పోయిన తరువాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని, అంతవరకు ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇంకా నోటిఫికేషన్‌ కూడా వెలువడకముందే ఇటువంటి పిటిషన్‌ దాఖలు చేయడం తొందరపాటు చర్య అని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్‌ అవినాశ్‌ ఠాకూర్‌ స్పందిస్తూ, ప్రజా ప్రాతినిథ్య చట్టం ...

Read More »

సుప్రీం తీర్పుపై దద్దరిల్లిన పార్లమెంట్‌

సుప్రీం తీర్పుపై దద్దరిల్లిన పార్లమెంట్‌

ఉత్తరాఖండ్‌కు చెందిన కేసులో ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పార్లమెంట్‌ ఉభయ సభలు దద్దరిల్లాయి. ఉద్యోగాలు, పదోన్న తుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు పదోన్నతులు కల్పించాలని రాష్ట్రాలను ఆదేశించలేమని సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో సభ్యులు ఆందోళన చేశారు. ఈ అంశంపై కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. కేంద్ర మంత్రి ప్రకటనలో స్పష్టత లేదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదే ...

Read More »