Tag Archives: telanagna

తెలంగాణ హైకోర్టు మూసివేత‌

తెలంగాణ హైకోర్టులో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు, సెక్యూరిటీ సిబ్బందికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మంగ‌ళ‌వారం న్యాయ‌స్థానంలో ప‌ని చేసే 50 మందికి సిబ్బందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. నేడు దీని ఫ‌లితాలు వెలువ‌డ‌గా అందులో 10 మందికి పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు హైకోర్టు భ‌వ‌నాన్ని మూసివేసి శానిటైజేష‌న్ చేస్తున్నారు. హైకోర్టులోని ఈ-ఫైలింగ్ విభాగాన్ని జ్యుడీషియ‌ల్ అకాడ‌మీకి త‌ర‌లించారు.మ‌రోవైపు క‌రోనా ప్రబ‌‌లుతున్న వేళ ముందు జాగ్ర‌త్త‌లు చేప‌ట్టిన హైకోర్టు వీడియో కాన్ఫ‌రెన్స్‌ల ద్వారా ముఖ్య‌మైన కేసుల విచార‌ణ ...

Read More »

రాగల 3 రోజుల్లో తెలంగాణకి వర్ష సూచన

రాగల 3 రోజుల్లో తెలంగాణకి వర్ష సూచన

రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. దక్షిణ జార్ఖండ్‌ నుంచి గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు, ఇంటీరియర్‌ ఒరిస్సా నుంచి దక్షిణ చత్తీస్‌గఢ్‌‌, తెలంగాణ, రాయలసీమ, ఇంటీరియర్‌ తమిళనాడు మీదుగా 0.9 కీమీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావారణ కేంద్రం తెలిపింది. దీంతో బుధ, గురువారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Read More »