Tag Archives: tollywood news

NBK109లో బాలయ్యకు జోడీగా సైంధవ్ హీరోయిన్

నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ చిత్రం NBK109 వర్కింగ్ టైటిల్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా సైంధవ్ మూవీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌ నటించనున్నట్లు సమాచారం. ఆమె ఇటీవలే ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ నైట్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో భాగంగా బాలకృష్ణపై ఓ భారీ పోరాట ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారట. 1980ల బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే ...

Read More »

తనను ట్రోలింగ్‌ చేస్తున్నవారిపై యాంకర్‌ అనసూయ ఫిర్యాదు

టాలీవుడ్‌ స్టార్‌, బుల్లితెర యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ను టార్గెట్‌ చేస్తూ గత కొద్దిరోజులుగా నెటిజన్లు సోషల్‌మీడియాలో అసభ్యకరమైన రీతిలో రచ్చ చేస్తున్న సంగతి విదితమే. దీనిపై మండిపడ్డ యాంకర్‌.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అయినప్పటికీ వెనక్కు తగ్గని నెటిజన్లు మరింతగా ఆంటీ అంటూ వేలకొద్దీ ట్వీట్లు చేసి అసభ్యపదజాలాలు వాడారు. దీనిపై తాజాగా అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read More »

‘పెళ్లి కూతురు పార్టీ’ ట్రైలర్‌ విడుదల

అపర్ణ మల్లాది దర్శకత్వంలో నటి అనీషా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పెళ్లి కూతురు పార్టీ’. ఆగస్టు 31న ఆహా వేదికగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అక్క పెళ్లి కుదిరిన ఆనందంలో చెళ్లెళ్లు అందరూ రోడ్‌ ట్రిప్‌నకు వెళ్లి పార్టీ చేసుకుంటారు. ఆ సమయంలో వారికి ఎదురైన సంఘటనలు, వాటిని వాళ్లు ఎదుర్కొన్నారు అనే ఆసక్తికర అంశాలతో రూపుదిద్దుకుంది. యుత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అన్నపూర్ణ కీలకపాత్ర పోషించారు.

Read More »

సూర్య కొత్త సినిమా ప్రారంభం

తమిళ దర్శకుడు శివ, సూర్య కాంబినేషన్‌లో సూర్య 42వ సినిమా ప్రారంభమైంది. స్టూడియో గ్రీన్‌ బేనర్‌తో కలిసి టాలీవుడ్‌లో అగ్ర బేనర్లలో ఒకటైన యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం పలువురు ప్రముఖుల సమక్షంలో జరిగింది. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని దర్శక-నిర్మాతలు పేర్కొన్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లో వంశీ, ప్రమోద్‌, జ్ఞానవేల్‌ రాజా, విక్రమ్‌ నిర్మించున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు.

Read More »

సెట్స్‌ పైకి ‘ఇండియన్‌ 2’

కమల్‌ హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌లో ఇండియన్‌ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిర్మాతలకు, శంకర్‌కు మధ్య వచ్చిన గొడవలు, కరోనా వంటి కారణాలతో చిత్రీకరణ దశలోనే నిలిచిపోయింది. దాంతో శంకర్‌ రామ్‌ చరణ్‌ హీరోగా ‘ఆర్‌సి15’ షూట్‌ చేస్తున్నారు. గత నెల రోజుల నుంచి షూటింగ్‌ ఆగిన నేపథ్యంలో శంకర్‌ ‘ఇండియన్‌ 2’పై దృష్టి పెట్టారు. మంగళవారం రాత్రి నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. దీనిలో భాగంగానే ఇండియన్‌ 2కి సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ...

Read More »

ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామికి 6 నెలల జైలు శిక్ష

ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామికి చెక్‌బౌన్స్‌ కేసులో చెన్నైలోని సైదాపేట్‌ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కొన్ని సంవత్సరాల క్రితం.. కార్తి, సమంత జంటగా ‘ఎన్నిఇజు నాల్‌ కుల్ల’ పేరుతో ఓ సినిమా తీయాలని లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్‌ చంద్రబోస్‌ పీవీపీ సినిమాస్‌ నుంచి అప్పు తీసుకున్నారు. అయితే ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో లింగుస్వామి, ఆయన సోదరుడు కలిసి పీవీపీ సినిమాస్‌ నుంచి తీసుకున్న సొమ్మును చెక్కు రూపంలో తిరిగి చెల్లించారు. అయితే, ఆ చెక్కు ...

Read More »

లైగర్‌ మూవీకి బాయ్ కాట్‌ సెగ

సోషల్‌ మీడియాలో ఆర్‌ఎస్‌ఎస్‌ మూకలు ‘బాయ్ కాట్‌ లాల్‌సింగ్‌ చడ్డా’ ట్యాగ్‌లైన్‌ ట్రెండ్‌ చేయడంతో… ఆ మూవీ విజయం సాధించలేకపోయింది. అయితే సోషల్‌మీడియాలో అమీర్‌కి కొంతమంది నెటిజన్లు మద్దతు ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఈ సినిమా విడుదలకు ముందే బాయ్ కాట్‌ ప్రచారం కావడంతో.. అమీర్‌ ఆర్థికంగా నష్టపోయాడు. లాల్‌సింగ్‌ చడ్డా మూవీతో మొదలైన  బాయ్ కాట్‌ సెగ.. ఆ తర్వాత రిలీజ్‌ అయ్యే సినిమాలకూ తగులుతుంది. తాజాగా సోషల్‌ మీడియాలో ‘లైగర్‌’ మూవీకి  బాయ్ కాట్‌  ట్యాగ్‌లైన్‌ ట్రెండ్‌ అవుతుంది. అయితే కొంతమంది నెటిజన్లు ...

Read More »

‘ధమాకా’ పాట విడుదల

రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘ధమాకా’ ఒకటి. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి పాట లిరికల్‌ వీడియోను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటను మంగ్లీ ఆలపించారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ అందించిన ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

Read More »

మంత్రివర్గ విస్తరణతో నితీష్‌కు కొత్త చిక్కులు..

మంత్రివర్గవిస్తరణతో బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే బీమా భారతి నుండి వ్యతిరేకత ఎదురైంది. జెడి(యు) ఎమ్మెల్యే లేషి సింగ్‌కు కొత్త కేబినెట్‌లో మంత్రి పదవి దక్కగా, తనకు మాత్రం మొండిచెయ్యి చూపారంటూ బీమా భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు.  లేషి సింగ్‌ మంత్రిగా కొనసాగితే తాను రాజీనామా చేస్తానని ఆమె  హెచ్చరించారు. లేషి సింగ్  ప్రతిసారీ తన నియోజకవర్గంలో ఇబ్బందులు సృష్టిస్తుందని, అలాంటి వ్యక్తిని కేబినెట్ లోకి తీసుకోవడం  వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. లేషిసింగ్ పట్ల ...

Read More »

26న ‘కళాపురం’

‘పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్‌’ చిత్రాల ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కళాపురం’. ‘ఈ ఊరిలో అందరూ కళాకారులే’ అన్నది ఉపశీర్షిక. సత్యం రాజేష్‌, చిత్రం శ్రీను కీలక పాత్రల్లో నటించారు. రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కరుణ కుమార్‌ మాట్లాడుతూ ”ఇప్పటివరకు కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలు చేశాను. ‘కళాపురం’ కామెడీ సినిమా. అయితే కామెడీలో అశ్లీలత ఉండదు” అని తెలిపారు. ”క్యూట్‌ కామెడీ ...

Read More »