Tag Archives: tollywood news

తమిళ నటుడు వివేక్‌కు గుండెపోటు.. పరిస్థితి విషమం.

 ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్‌ (59) తీవ్రమైన గుండెపోటుతో మద్రాసులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో శుక్రవారం చేరారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కార్డియాక్‌ అరెస్ట్‌తో వివేక్‌ బాధపడుతున్నారని వైద్యులు నిర్ధారించారు.  గురువారం చెన్నైలోని ఓమందూరు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివేక్‌ కోవిడ్‌ టీకా తీసుకున్నారు. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వివేక్‌ మీడియాతో మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారానే ఈ భయంకర వైరస్‌ నుంచి మనల్ని మనం కాపాడుకోగలమని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ...

Read More »

22న పెళ్లి పీటలెక్కనున్న గుత్తా జ్వాల

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి.. గుత్తాజ్వాల, తమిళ యువహీరో విష్ణువిశాల్‌ పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వారి వివాహ తేదీని గుత్తాజ్వాల అనౌన్స్‌ చేశారు. వారిద్దరూ.. ఏప్రిల్‌ 22న పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ మేరకు ఆమే స్వయంగా సోషల్‌ మీడియాలో ఓ పోస్టును షేర్‌ చేశారు. ‘మా ఇరు కుటుంబాల ఆశీస్సులతో మేము పెళ్లి చేసుకోబోతున్నాం’ అని అన్నారు. ఈ పోస్టును చూసిన నెటిజన్లు గుత్తాజ్వాలకు, విశాల్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

Read More »

‘నార‌ప్ప’ ఫ్యామిలీ పోస్ట‌ర్.

వెంక‌టేశ్ ప్రధాన పాత్రలో న‌టిస్తున్న ‘నార‌ప్ప‌’ చిత్రానికి సంబంధించి తాజాగా ఉగాది స్పెషల్ పోస్టర్ విడుదలైంది.  శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం  పోస్ట‌ర్, టీజ‌ర్‌కు ఇప్పటికే మంచి స్పంద‌న వ‌చ్చింది.  వెంకటేశ్ నార‌ప్ప‌గా ఒక వెరైటీ లుక్ తో క‌నిపిస్తూ.. త‌న కుటుంబంతో క‌లిసి న‌డుస్తున్న పోస్టర్ వెంకటేశ్ అభిమానులకు  ఉగాది కానుక అని చెప్పొచ్చు.  వెంకటేశ్ కు జంటగా నటిస్తోన్న  ప్రియ‌మ‌ణి… తన కూతురిని ప‌ట్టుకుని ఉండ‌గా.. వెన‌క‌వైపు కార్తీక్ ర‌త్నం, రాజీవ్ క‌న‌కాల క‌నిపిస్తున్నారు. ఉగాది శోభ ఉట్టిప‌డేలా ...

Read More »

ప్రభాస్‌ను ఈ కోణంలో ఎప్పుడైనా చూశారా…!

యంగ్‌ రెబల్‌స్టార్‌.. డార్లింగ్‌ ప్రభాస్‌ ఇప్పుడు టాలీవుడ్‌కే కాదు..బాలీవుడ్‌, మాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇండిస్టీస్‌కు పరిచయం అక్కర్లేని పేరు. బాహుబలితో అమాంతం రేంజ్‌ పెరిగిపోయిన ఈ పాన్‌ ఇండియన్‌ స్టార్‌… వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. రాధా శ్యామ్‌, ఆదిపురుష్‌, సాలార్‌తో పాటు… నాగ్‌ అశ్విన్‌ చిత్రంలో నటిస్తున్నారు. ప్రభాస్‌ షూటింగ్‌ పాల్గంటున్న ఫోటోలు లీకై నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా మునీశ్వరుని గెటప్‌లో ఉన్న ఫోటో ప్రస్తుతం హల్‌ చల్‌ చేస్తోంది.

Read More »

ఐసీయూలో సీనియర్‌ నటుడు కార్తీక్‌

సీనియర్‌ నటుడు కార్తీక్‌ శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో అత్యవసర చికిత్సను పొందుతున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కార్తీక్‌ అన్నాడిఎంకె పార్టీకి ప్రచారం చేస్తారని ప్రకటించారు. ప్రచారంలో పాల్గన్న కార్తీక్‌ గత నెల 21న అనారోగ్యానికి గురవడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చేర్చారు. శ్వాస సంబంధిత సమస్యలతోపాటు, రక్తపోటు కారణంగా కార్తీక్‌ అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయన కొన్ని రోజులు ఆస్పత్రిలోనే చికిత్స పొంది తిరిగి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత ...

Read More »

రామ్‌చరణ్‌ స్ట్రాంగ్‌ మార్నింగ్‌

హీరో రామ్‌చరణ్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్‌ లుక్‌ ఆసక్తి రేపుతోంది. చరణ్‌ చేస్తున్న సినిమాకి తగ్గట్లుగా తన శరీర ఆకృతిని మార్చుకుంటున్నాడు. మంగళవారం ఉదయం స్ట్రాంగ్‌ మార్నింగ్‌ అంటూ జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తున్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

Read More »

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ పోస్టర్‌ విడుదల

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ నుంచి ఫస్ట్‌లుక్‌ విడుదల చేసింది చిత్రబృందం. నేడు రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్‌ విడుదల చేశారు. రష్మికకు జంటగా శర్వానంద్‌ నటిస్తున్న ఈ సినిమాకు కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.

Read More »

‘లవ్ స్టోరీ’ కి లాక్ డౌన్ బ్రేక్ పడుతుందా…?

నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఇందులో హీరోయిన్ సాయిపల్లవి. ఈ రౌడీబేబీకి దక్షిణాదిన మంచి మార్కెట్ ఉంది. అందుకే ‘లవ్ స్టోరీ’ నిర్మాతలు తమ సినిమాను కన్నడ, మలయాళ భాషల్లోనూ అనువదించి ఒకేసారి ఈ నెల 16న విడుదల చేస్తున్నారు. నిజానికి శేఖర్ కమ్ముల ముందు చిత్రం ‘ఫిదా’లోనూ వరుణ్ తేజ్ కంటే సాయిపల్లవే ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఇప్పుడు ‘లవ్ స్టోరీ’ విషయంలోనూ అదే రిపీట్ అవుతోంది. అందుకు ఉదాహరణ ‘సారంగధరియా’ పాట. ఈ పాట ...

Read More »

వేదం నాగయ్య మృతి

వేదం సినిమాలో కీలక పాత్ర పోషించిన నాగయ్య కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. ప్రముఖ దర్శకుడు క్రిష్‌ డైరెక్ట్‌ చేసిన వేదం సినిమాలో ఆయన నటన ఎంతో సహజసిద్ధంగానూ, మనసును మెలిపెట్టే విధంగానూ ఉంటుంది. ముఖ్యంగా అల్లుఅర్జున్‌తో హాస్పిటల్‌ సన్నివేశంలో, క్లైమాక్స్‌ సీన్‌లో నాగయ్య నటన కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్‌, మనోజ్‌, అనుష్కలతోపాటు నాగయ్యకి మంచి పేరు వచ్చింది. ఈ చిత్రం తర్వాత దాదాపు 30 సినిమాలలో ఆయన నటించారు. స్పైడర్‌, సీమటపాకారు, నాగవల్లి, అయ్యారే, రామయ్య వస్తావయ్యా, ...

Read More »

తెలంగాణలో మళ్లీ మూతపడనున్న థియేటర్లు…?

తెలంగాణలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ విజంభిస్తున్న నేపథ్యంలో థియేటర్లను మళ్లీ బంద్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు పంపింది. ఒకవేళ థియేటర్లు పూర్తిస్థాయిలో మూసివేత సాధ్యం కాకుంటే సగం సీట్లు (50 శాతం) మాత్రమే నింపుకునేలా నిబంధనలు విధించాలని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోందని.. వ్యాప్తిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తే… మరింత ముప్పు వాటిల్లే ప్రమాదముందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కరోనా ...

Read More »