Tag Archives: tollywood news

వివాదంలో ‘సారంగ దరియా’ పాట

ప్రస్తుతం ఎవరి నోట విన్నా సారంగ దరియా పాటే వినిపిస్తోంది. లవ్‌స్టోరీ సినిమాలోని ఈ పాట సంపాదించిన క్రేజ్‌ మామూలుగా లేదు. దీనికితోడు సాయిపల్లవి న్యాచురల్‌గా ఎంతో ఉత్సాహంగానూ, తన హావభావాలతోనూ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. దీంతో ఎవరి నోట విన్నా ఇదే పాట. అయితే.. ఈ పాట ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఇది తాను సేకరించిన పాట అని, తన చేత పాడించలేదంటూ కోమలి అనే మహిళ కన్నీరు పెట్టుకుంటోంది. ప్రస్తుతం జానపద గేయాలు ట్రెండ్‌ నడుస్తోంది. అనేక సినిమాల్లో ఈ గేయాలు జనంచేత ...

Read More »

శర్వానంద్ తో కేక్‌ కట్‌ చేపించిన చిన్ననాటి ఫ్రెండ్‌

టాలీవుడ్‌లో ప్రముఖ హీరో శర్వానంద్‌ శనివారం పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగా హీరో రామ్‌చరణ్‌ స్వయంగా కేక్‌ను కట్‌ చేపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రామ్‌చరణ్‌ కేక్‌ కట్‌చేపించిన ఫొటోస్‌ని శర్వానంద్‌ ట్విటర్‌ ద్వారా షేర్‌ చేస్తూ.. చెర్రీకి కృతజ్ఞతలు చెప్పారు. రామ్‌చరణ్‌, శర్వానంద్‌ చదువుకునేరోజుల నుంచే మంచి స్నేహితులు. వీరిద్దరూ సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ పార్టీలూ… ఫంక్షన్స్‌లో కలుస్తునే ఉంటారు.

Read More »

త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్‌టిఆర్‌ కొత్త సినిమా

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించే సినిమా మరో మూడు నెలల్లోపే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 20న తారక్‌ పుట్టిన రోజే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంటుందని సంకేతాలు అందుతున్నాయి. ప్రి ప్రొడక్షన్‌ వర్క్‌ పనులు సాగిస్తూనే.. కాస్ట్‌ అండ్‌ క్రూ ఎంపికపై దృష్టిసారించాడట దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు కథానాయిక, సంగీత దర్శకుడు ఖరారయ్యారు. అలాగే సినిమా విడుదల విషయంలోనూ ఒక నిర్ణయానికి వచ్చేశారు.

Read More »

బాలీవుడ్‌లో‌ ‘ఆర్‌ఎక్స్‌ 100’ రీమేక్‌ ఫస్ట్‌ లుక్‌

అజయ్ భూపతి దర్శకత్వంలో తీసిన ఆర్‌ఎక్స్‌ 100 చిత్రాన్ని బాలీవుడ్‌లో ‘తడప్‌’ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. అహన్‌ శెట్టి హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో తారా సుతారియా హీరోయిన్‌గా నటిస్తోంది. మిలన్‌ లుత్రియా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సాజిద్‌ నదియద్‌వాలా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 24న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. హీరో అక్షయ్కుమార్‌ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి, యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

Read More »

యువ నిర్మాత సందీప్ కొరిటాల‌ మృతి

యువ నిర్మాత సందీప్‌ కొరిటాల హఠాత్తుగా మరణించాడు. ఆదివారం ఆయన గుండెపోటుతో మతి చెందాడు. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా వచ్చిన ‘స్వామి రారా’, నారా రోహిత్‌ హీరోగా చేసిన ‘రౌడీ ఫెలో’ సినిమాలకు సందీప్‌ కొరిటాల సహ నిర్మాతగా వ్యవహరించాడు. సందీప్‌ మతి పట్ల నారా రోహిత్‌, దర్శకుడు సుధీర్‌ వర్మ సంతాపం తెలిపారు.

Read More »

తల్లి కాబోతున్న హీరోయిన్‌ రిచా

హీరోయిన్‌ రిచా గంగోపాధ్యారు తల్లి కాబోతున్నారు. బేబీ బంప్‌తో ఆదివారం ఉదయం ట్విటర్‌ వేదికగా చిత్రాన్ని షేర్‌ చేసుకున్నారు. జూన్‌లో తమ కుటుంబంలోకి ఓ చిన్నారి రానుంది అంటూ ట్వీట్‌ చేశారు. అలాగే తామెంతో సంతోషంగా ఉన్నామని తెలిపారు. తమ చిన్నారి కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. లీడర్‌ చిత్రం ద్వారా ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు. మిర్చి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆమె అక్కడ బిజినెస్‌ స్కూల్లో జోను ప్రేమించారు. అనంతరం వివాహం చేసుకుకున్నారు.

Read More »

ఆస్కార్‌ రేసులో సూర్య సినిమా

నిజ జీవిత కథ ఆధారంగా సూర్య హీరోగా తెరకెక్కిన ‘సూరారై పోట్రు’ సినిమా 2021 ఆస్కార్‌ పోటీలకు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్కార్‌ బరిలో మూడు విభాగలలో నెక్స్ట్‌ లెవెల్‌ కు ఎంపికైనట్లు సమాచారం. ఈ విషయాన్నీ స్వయంగా నిర్మాణసంస్థ వెల్లడించింది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో సూరారై పొట్రు(ఆకాశం నీ హద్దురా) ఉత్తమనటుడు విభాగంలో సూర్య, ఉత్తమనటిగా అపర్ణ బాలమురళి ఎంపికైనట్లు ఆస్కార్‌ విడుదల చేసిన జాబితాలో చూడవచ్చు. ఆస్కార్‌కు నామినేట్‌ అయిన 366 సినిమాల్లో ‘సూరారై పోట్రు’ ఒకటని ...

Read More »

దేవరకొండలో విజయ్‌ ప్రేమ కథ

విజయ్‌ శంకర్‌, మౌర్యాని జంటగా శివత్రి ఫిలిమ్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’. వెంకటరమణ.ఎస్‌ ఈ చిత్రానికి దర్శ కత్వం వహించారు. పడ్డాన మన్మథరావు నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసు కున్న ఈ సినిమా మార్చి 11న విడుదలకానుంది. ‘ఒక ఊర్లో జరిగే విజరు అనే యువకుడి ప్రేమ కథే ఈ టైటిల్‌కి కారణం. విజరు దేవరకొండ మీద అభిమానంతో ఆయన పేరునే ఈ సినిమాకు పెట్టుకున్నా’ అంటున్నారు దర్శకుడు.

Read More »

నాని ‘శ్యామ్‌ సింగరాయ‌’ ఫస్ట్‌లుక్‌

నాని ‘టక్‌ జగదీష్‌’, ‘శ్యామ్‌ సింగరారు’ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. వీటిలో టక్‌ జగదీష్‌ ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. బుధవారం నాని పుట్టినరోజు సందర్భంగా ‘శ్యామ్‌ సింగరారు’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. పేరు శ్యామ్‌.. పూర్తి పేరు శ్యామ్‌ సింగరారు… అంటూ నాని తన ట్విటర్‌ ద్వారా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశాడు. ఈ చిత్రం కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో నాగవంశీ నిర్మిస్తున్నారు.

Read More »

అలరించనున్న ‘సూపర్‌ డీలక్స్‌’

సమంత, విజయ్‌ సేతుపతి, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘సూపర్‌ డీలక్స్‌’. త్యాగరాజన్‌ కుమార్‌ రాజా దర్శకుడు. ఈ చిత్రాన్ని సిద్ధ్దేశ్వర వైష్ణవి ఫిలింస్‌ పతాకంపై పి.మధుబాబు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘క్రైమ్‌ కామెడీ కథాంశంతో రూపొందిన చిత్రమిది. జీవితం, నైతిక విలువలు, లింగభేదాలతో పాటు సమాజంలో నెలకొన్న పలు సమస్యల్ని చర్చిస్తూ దర్శకుడు రూపొందించారు

Read More »