Tag Archives: tollywood

‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో వ‌చ్చేసింది !

అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో వ‌చ్చిన ‘పుష్ప’ ది రైజ్‌ చిత్రం ఎంత‌టి ప్ర‌భంజ‌నం సృష్టించిందో తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా ‘పుష్ప‌-2’ ది రూల్ తెర‌కెక్కుతోంది. ఇటీవల బ‌న్నీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఆ టీజర్‌కు మంచి స్పందన వ‌చ్చింది. టీజర్‌ విడుదలైనప్పటి నుండి నాన్‌స్టాప్‌గా 138 గంటల పాటు యూట్యూబ్‌లో నం.01 ట్రెండింగ్‌లో ఉండి కొత్త రికార్డు నెలకొల్పిది. ఇక తాజాగా ‘పుష్ప-2’ ది రూల్‌ కొత్త అప్‌డేట్‌ వచ్చేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ...

Read More »

నాకు ఏడాదికి ఒకసారి పెళ్లి జరిపిస్తున్నారు: అంజలి

అంజలి ప్రధానమైన పాత్రగా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా రూపొందింది. ఇటీవలే థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. ఈ నేపథ్యంలో అంజలి ‘ఆలీతో సరదాగా’ సీజన్ 2 లో పాల్గొన్నారు. అంజలి మాట్లాడుతూ .. ” గతంలో వచ్చిన ‘గీతాంజలి’ని నేను ఎంతగా ఎంజాయ్ చేస్తూ చేశానో, ఈ సినిమాను కూడా అంతే ఎంజాయ్ చేస్తూ చేశాను. నాకు బాగా నచ్చిన కథ ఇది” అని అన్నారు. “ఈ కథను నాకు కోన గారు ‘నిశ్శబ్దం’ సినిమా సమయంలో వినిపించారు. అది వర్కౌట్ కావడానికి ...

Read More »

ప్రియురాలిని పెళ్లాడిన టాలీవుడ్ యంగ్ హీరో..

టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు కల్పనారావును పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబాల సభ్యులు, కొద్ది మంది బంధువుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. తిరువీర్, కల్పనల పెళ్లి నిన్న తిరుమలలో జరిగినట్టు తెలుస్తోంది. కొత్త జీవితం ప్రారంభమయింది అంటూ తన పెళ్లి ఫొటోలను తిరువీర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొత్త జంటకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తిరువీర్ బొమ్మలరామారం తో ఆయన సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఏమంత్రం వేశావే, ఘాజీ, మల్లేశం, టక్ జగదీష్ ...

Read More »

నటుడు రఘుబాబు అరెస్ట్.. బెయిల్

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన కేసులో నటుడు రఘుబాబు అరెస్ట్ అయ్యారు. అయితే వెంటనే ఆయనకు బెయిల్ మంజూరైంది. ఈ నెల 17న నల్గొండ సమీపంలో నార్కట్పల్లి-అద్దంకి రహదారిపై రఘుబాబు కారు ఢీకొనడంతో బీఆర్ఎస్ నేత జనార్దన్రావు మృతి చెందారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నల్గొండ పోలీసులు రఘుబాబును అరెస్ట్ చేశారు. మొబైల్ కోర్టులో హాజరుపర్చగా ఆయనకు షరతులతో కూడిన బెయిల్ లభించింది.

Read More »

సీక్వెల్స్ ట్రెండ్‌ను క్యాష్ చేసుకుంటున్నారా..

ఓ బిల్డింగ్ కట్టాలంటే ముందు పునాది బలంగా ఉండాలి.. ఆ తర్వాత దాని మీద ఎన్ని ఫ్లోర్స్ అయినా వేయొచ్చు. ఇండస్ట్రీలోనూ ఇదే జరుగుతుంది. ముందు ఓ బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు.. ఆ తర్వాత సీక్వెల్స్‌తో వాటిని క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా టిల్లు భాయ్ చేసింది కూడా ఇదే.ఒకప్పుడు సీక్వెల్ అనే మాట వింటే చాలు మన నిర్మాతలకు గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి. దానికి కారణం కూడా లేకపోలేదు. శంకర్ దాదా జిందాబాద్, గాయం 2, సర్దార్ గబ్బర్ సింగ్, కిక్ 2, నాగవల్లి, ...

Read More »

హనీగా మారిన సమంత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఖుషితో ఆడియన్స్ ముందుకు వచ్చి అలరించింది. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి, తన అనారోగ్య సమస్యకి చికిత్స తీసుకుంటుంది. అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చే ముందే సమంత.. ఒక వెబ్ సిరీస్ షూటింగ్ ని పూర్తి చేసింది. ఫ్యామిలీ మెన్ వంటి సిరీస్ తో సూపర్ ఫేమ్ ని తీసుకు వచ్చిన రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో సమంత ఈ కొత్త సిరీస్ చేసారు. ఈ చిత్రానికి గతంలో సిటాడెల్ అనే టైటిల్ ని పెట్టారు. ...

Read More »

మరోసారి ఇష్క్ కాంబో రిపీట్.. త్వరలోనే నితిన్ – విక్రమ్ల సినిమా

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ఈ హీరో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా.. ఒక్క హిట్ కూడా పడటం లేదు. హిట్ చూసి నితిన్కు దశాబ్ధ కాలమైపోతోంది. గతంలో సరైన హిట్ లేక వరస ఫ్లాప్‌లతో ఇబ్బందిపడిన నితిన్ను మళ్లీ విజయాల బాట పట్టించిన సినిమా ‘ఇష్క్‌’ . విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. రొమాంటిక్‌ డ్రామా కథల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ సినిమాలో నితన్ – ...

Read More »

వెంకటేష్ ఇంట మహేష్ బాబు ఫ్యామిలీ..

టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ ఇటీవల తన రెండో అమ్మాయికి నిశ్చితార్థం వేడుక గనంగా జరిపించాడు. విజయవాడకి చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయికి వెంకటేష్ తన రెండో కుమార్తెని ఇవ్వబోతున్నారు. అక్టోబర్ లో జరిగిన ఈ ఎంగేజ్మెంట్ కి దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు చిరంజీవి, మహేష్ బాబు ఫ్యామిలీస్ కూడా హాజరయ్యి కొత్త జంటని ఆశీర్వదించారు. ఇక నిశ్చితార్థం వేడుక జరుపుకున్న ఈ జంట.. ఇప్పుడు పెళ్లి తో ఒకటి కాబోతున్నారు. వెంకటేష్ సైలెంట్ గా ఎటువంటి హడావుడి లేకుండా తన కూతురి పెళ్లిని ...

Read More »

క్రేజ్‌ను కాష్ చేసుకుంటున్న తమిళ్ కెప్టెన్స్..

ప్రజెంట్ కోలీవుడ్ దర్శకుల పేర్లు పాన్ ఇండియా రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవటంలో కూడా ముందే ఉన్నారు ఈ నయా సెన్సేషన్స్‌. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు, ఫామ్‌లో ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు కష్టపడుతున్నారు. షార్ట్ టైమ్‌లోనే సెన్సేషన్‌గా మారిన కోలీవుడ్ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌. జవాన్ తో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేసిన అట్లీ. జైలర్‌ ఫేం నెల్సన్ దిలీప్‌ కుమార్. ఈ యంగ్ జనరేషన్‌కు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు గ్రేట్‌ డైరెక్టర్ శంకర్‌. *షార్ట్ ...

Read More »

హీరోయిన్ ను పెళ్లాడబోతున్న కిరణ్ అబ్బవరం..

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లిపీటలు ఎక్కుతున్నాడు. రాజావారు రాణిగారు సినిమాతో కిరణ్ అబ్బవరం సిని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే సినిమాలో హీరోయిన్ గా చేసిన రహస్యని వివాహం చేసుకోబోతున్నా విషయాన్ని కిరణ్ అబ్బవరం అధికారికంగా ప్రకటించాడు. ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాలని కొన్ని నెలల క్రితం ఇద్దరూ నిర్ణయానికి వచ్చారు. ఇరు కుటుంబాల పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ వారంలో వీరి నిశ్చితార్థం జరగనుంది. సినిమాల విషయానికి వస్తే, ...

Read More »