Tag Archives: trs

2న రాష్ట్ర మంత్రివర్గ భేటీ

2న రాష్ట్ర మంత్రివర్గ భేటీ

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జూలై 2న రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్‌ కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించే అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా వ్యాప్తి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో 15 రోజుల పాటు అత్యంత కఠినంగా లాక్‌డౌన్‌ విధించాలని ప్రతిపాదిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌లో భాగంగా అత్యంత కఠినంగా కర్ఫ్యూ విధించాలని, రోజుకు కేవలం గంటా రెండు గంట లు మాత్రమే ...

Read More »

టీఆర్‌ఎస్ పై రెచ్చిపోయిన డీకే అరుణ

టీఆర్‌ఎస్ పై రెచ్చిపోయిన డీకే అరుణ

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకే హైదరాబాద్‌ కరోనా హబ్‌గా మారిందని మాజీ మంత్రి, బీజేపీనేత డీకే అరుణ తీవ్ర స్థాయిలో విమర్శిం చారు. సీఎం కేసీఆర్‌కు ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ మీద ఉన్న కోపం ఇప్పుడు తెలంగాణ ప్రజలకు శాపమైందని వ్యాఖ్యానించారు. ఆదివారం పార్టీ ఎంపీ సోయం బాపూరావుతో కలసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌లో ఓనర్లు, క్లీనర్ల పంచాయితీ నడుస్తోందని, వైరస్‌ను అడ్డం పెట్టుకుని టీఆర్‌ఎస్‌ చేస్తున్న ...

Read More »

మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్‌

మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరిత హారం కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా బోయగూడలో నూతన పార్కును మంత్రి కేటీఆర్ గురువారం‌ ప్రారంభించారు. అనంతరం ఆయన పాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, అధికారులు పార్కులో మొక్కలు నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అధికారులు మొక్కలు నాటారు. హరిత తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా అందరూ మొక్కలు నాటాలని మంత్రులు పిలునిచ్చారు.

Read More »

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్‌

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్‌

జనగామ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంపై ఆమె సతీమణి పద్మలతా రెడ్డి స్పందించారు. ఆయన ఆరోగ్యంపై స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వాట్సప్‌ వాయిస్‌ రికార్డు ద్వారా ఓ ప్రకటన చేశారు. ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్తిరెడ్డి.. శుక్రవారం హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ...

Read More »

ఖమ్మం నగరంలో అభివృద్ధి పనులను సమీక్షించిన కేటీఆర్‌

ఖమ్మం మున్సిపాలిటీల పరిధలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పురపాలక, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు గురువారం మాసాబ్‌టాంక్‌లోని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా పలు అంవాలపై చర్చించారు. ఖమ్మం నగరంలో కొనసాగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నగరాభివృద్ధి కోసం చేపట్టిన చర్యల్ని నివేదిక ద్వారా మంత్రి కేటీఆర్‌కు మంత్రి పువ్డాడ వివరించారు. ఖమ్మం నగరంలో కొనసాగుతున్న మిషన్‌ భగీరధ పనుల వివరాలు చర్చకు వచ్చాయి. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను మంత్రి ...

Read More »

కేసీఆర్ పై మండిపడ్డ ఎంపీ బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్‌ అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. శనివారం ఆయన నాయకత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్‌ తమిళిసైని కలిసి ఒక వినతిపత్రం అందజేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, అక్రమ సంపాదన కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని ప్యాకేజీలుగా విభజించి కొత్తగా టెండర్లను పిలిచారని ధ్వజమెత్తారు. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా టెండర్లను పిలిచి సీఎం కేసీఆర్‌ దోచుకుంటున్నారని ఆరోపించారు. అలాగే, పాత ప్రాజెక్టులను కూడా కేసీఆర్‌ తన ...

Read More »

డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాలపై కేటీఆర్‌ సమీక్ష

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ కార్యక్రమంపై బుధవారం ఆయన ప్రశాంత్‌రెడ్డిలు ఉన్నత స్థాయితో సమీక్ష సమావేశంచ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగరంలో ఇప్పటికే చాలా చోట్ల 80 శాతానికిపైడా నిర్మాణాలు పుర్తయ్యాయని తెలిపారు.కొన్ని చొట్ల లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. త్వరలోనే మిగితా నిర్మాణాలను కూడా పూర్తి చేసి లబ్థిదారులకు అందించే ప్రయత్నం చేస్తామని ...

Read More »

కేసీఆర్ పై మండిపడ్డ జగ్గారెడ్డి

కేసీఆర్ పై మండిపడ్డ జగ్గారెడ్డి

కేసీఆరే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. రైతు దీక్షను చూసి తట్టుకోలేక అహంకారంగా మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ అహంకారమే ఆయన పతనానికి దారితీస్తుందని చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్‌ సీఎం అయ్యారు అని పేర్కొన్నారు. సోనియాను ఒప్పించి తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్‌ నాయకులు బఫూన్లు అయ్యారా? అని ప్రశ్నించారు.

Read More »

రోడ్ల నిర్మాణ పనులపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

రోడ్ల నిర్మాణ పనులపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

నగరంలో రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఆయన శనివారం బుద్ధభవన్‌ లో హైదరాబాద్ రోడ్డు డవలప్‌మెంట్‌ కార్పొరేషన్ కింద చేపట్టిన పనుల ప్రగతిపై సమీక్ష జరిపారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఇది వర్కింగ్ సీజన్ అని.. ఒక నెల పాటు పనులు చేయవచ్చన్నారు. జూన్ నుండి ...

Read More »

రక్తదానం చేసిన మాజీ ఎంపీ కవిత

రక్తదానం చేసిన మాజీ ఎంపీ కవిత

యువత రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారంరోజుల పాటు రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత రక్తదానం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు వీలైనంత ఎక్కువగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

Read More »