Tag Archives: ycp

CM జగన్ నేటి బస్సు యాత్ర షెడ్యూల్

జగన్ చేపట్టిన బస్సు యాత్ర 16వ రోజైన నేటి షెడ్యూల్ను YCP విడుదల చేసింది. నిన్న బస చేసిన నారాయణపురం నుంచి బయల్దేరనున్న CM.. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు. అక్కడ భోజన విరామం అనంతరం బయల్దేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజీ వద్ద జరిగే సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో ఏర్పాటు చేసిన రాత్రి శిబిరానికి చేరుకుంటారు.

Read More »

మీ బిడ్డ అదరడు.. బెదరడు: సీఎం జగన్

పేదల భవిష్యత్తు, పథకాల కొనసాగింపు కోసం వైసీపీని గెలిపించాలని సీఎం జగన్ కోరారు. గుడివాడ సభలో మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వానికి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు. ఒక్క జగన్ ను ఎదుర్కొనేందుకు కుట్రదారులు చుట్టుముట్టారు. కుటిల పద్మవ్యూహంలో నాపై వీరంతా దాడి చేస్తున్నారు. ఈ తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ అదరడు.. బెదరడు. కృష్ణుడనే ప్రజలు నాకు అండగా ఉన్నారు. మన విజయం తథ్యం’ అని చెప్పుకొచ్చారు.

Read More »

చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్..?

గుడివాడ ‘మేమంతా సిద్ధం’ సభలో కొడాలి నాని మాట్లాడుతూ… సీఎం జగన్‌ పాలనతోనే సంక్షేమం సాధ్యమైందన్నారు. అంతేకాకుండా,వాలంటీర్‌ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారన్నారు. పిల్లల భవిష్యత్‌ కోసం ఆలోచించిన నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు కొడాలి నాని. ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతోమందిని సీఎం జగన్ ఆదుకున్నారన్నారు. చంద్రబాబుది మాయా కూటమని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ను ఎదుర్కోలేక కుట్రలు చేశాడని మండిపడ్డారు. దేవుడు, ప్రజల ఆశీస్సులే సీఎం జగన్‌ను కాపాడాయన్నారు.

Read More »

సీఎం జ‌గ‌న్‌పై దాడి ఘ‌ట‌న‌.. నిందితుల‌ను ప‌ట్టిస్తే రూ. 2 ల‌క్ష‌ల రివార్డు!

విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్మోహ‌న్ రెడ్డిపై కొందరు ఆగంతుకులు రాయితో దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా కలకలం రేపింది. ఇక ఈ ఘ‌ట‌న‌ను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే రాళ్ల దాడి చేసిన నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని పోలీస్ కమిషనర్ ప్రకటించారు. నిందితుల గురించి తమకు స‌మాచారం అందిస్తే రూ. 2 లక్షలు ఇస్తామన్నారు. అలాగే త‌మ‌కు స‌మాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామ‌ని తెలిపారు.

Read More »

జగన్ పై దాడి జరిగితే అందరూ ఖండించారు… వాళ్లిద్దరు వెటకారం ప్రదర్శించారు: మంత్రి బొత్స

ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి ఘటన ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. జగన్ పై దాడి జరిగితే అన్ని పార్టీల వారు ఖండించారని… కానీ చంద్రబాబు, పవన్ మాత్రం వెటకారం ప్రదర్శించారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ వ్యవస్థల గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. బాబు సైకిల్ కు చాన్నాళ్ల కిందటే తుప్పు పట్టింది… పవన్ ఎలాంటివాడో ఆయన మాటల ...

Read More »

ఇలాంటి దాడులు ఏమీ చేయలేవు.. గెలుపు మనదే: జగన్

విజయవాడలో రోడ్ షో సందర్భంగా జరిగిన రాయి దాడిలో ఏపీ సీఎం జగన్ గాయపడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు ఆయన ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఈ ఉదయం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ఆయన మళ్లీ ప్రారంభించారు. కేసరపల్లి క్యాంప్ నుంచి ఆయన యాత్ర ప్రారంభమయింది. ఈ సందర్భంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నేతలు ఆయనను కలిసి పరామర్శించారు. బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణను చూసి తట్టుకోలేకే… ఈ దాడికి పాల్పడ్డారని వారు చెప్పారు. ఈ ...

Read More »

సీఎం జగన్కు భారీ భద్రత

ఇటీవల దాడి నేపథ్యంలో CM జగన్ భద్రతలో మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని ఏర్పాటు చేయగా.. బస్సు యాత్ర మార్గాల్లో DSPలతో భద్రత కల్పిస్తారు. CM రూట్ మార్గాలను సెక్టార్లుగా విభజించి.. సెక్టార్కు ఒక DSP, ఇద్దరు CIలు, నలుగురు SIలు సెక్యూరిటీ కల్పిస్తారు. ఇకపై నిర్దేశించిన ప్రాంతాల్లోనే CM రోడ్ షోలు, సభలు ఉండనుండగా.. గజమాలలు, పువ్వులు విసరడంపై ఆంక్షలు అమల్లో ఉంటాయి.

Read More »

కోడుమూరు చేరుకున్న జగన్ బస్సు యాత్ర..

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర మూడోరోజు కొనసాగుతోంది. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పెంచికలపాడు నుంచి మూడో రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. మూడో రోజు బస్సు యాత్ర సందర్భంగా జగన్ ఎక్స్ వేదికగా… ‘కర్నూలు జిల్లా సిద్ధమా?’ అని ట్వీట్ చేశారు. కాసేపటి క్రితం బస్సుయాత్ర కోడుమూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా జగన్ ను వైసీపీ శ్రేణులు గజమాలతో సత్కరించాయి. జగన్ కు సంఘీభావంగా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. జగన్ వెంట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ...

Read More »

జనసేనకు బిగ్ షాక్..

జనసేన పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు మద్దతిచ్చిన జనసైనికులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని విడిచి పోవడానికి సిద్ధమవుతున్నారు. టీడీపీ, జనసేన,బీజేపీ కూటమి వల్ల సీటు కోల్పోయిన పలువురు జనసైనికులు పక్క పార్టీల వైపు దృష్టి సారిస్తున్నారు. గత ఎన్నికల్లో ముమ్మిడివరం అసెంబ్లీకి పోటీ చేసిన పితాని బాలకృష్ణ మరల ముమ్మిడివరం టికెట్ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా టీడీపీకి చెందిన దాట్ల బుచ్చిబాబు అసెంబ్లీ అభ్యర్థి గా ఖరారు కావడంతో పితానికి నిరాశ ఎదురైంది.

Read More »

చంద్రబాబు పై సజ్జల ఫైర్..!

చంద్రబాబును, టీడీపీని ప్రజలు చెత్తబుట్టలో వేశారని అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో చంద్రబాబుకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కూటమి భాగంగా బీజేపీలో ఉన్న టీడీపీ నేతలకే టికెట్లు చంద్రబాబు ఇప్పించారని చెప్పుకొచ్చారు. కాగా, సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదు. చంద్రబాబును, టీడీపీని ప్రజలు చెత్తబుట్టలో వేశారు. చంద్రబాబు సభలకు జనం రావడం లేదు. ప్యాంట్రీ కారుపై కూడా అసత్య ప్రచారం చేశారు. అన్ని అనుమతులు తీసుకున్నా ప్యాంటీ కారుపై తప్పుడు ప్రచారం ...

Read More »