Tag Archives: YS Jagan

జగన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ చంద్రబాబు

జగన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ చంద్రబాబు

కరోనాతో కలిసి జీవించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు ఆందోళన కలిగించే అంశమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.  కరోనా వైరస్‌ కేవలం జ్వరం మాత్రమేనని తరచూ చెప్పే వ్యక్తిని ఏమనాలని ఆక్షేపించారు. జగన్‌ నిర్లక్ష్య వైఖరి కారణంగానే కరోనా కేసుల నమోదులో ఆంధ్రప్రదేశ్‌.. దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ఇక భగవంతుడే ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలన్నారు. ఈమేరకు జగన్‌ చేసిన వ్యాఖ్యల వీడియోను చంద్రబాబు ట్విటర్లో పోస్టు చేశారు.

Read More »

దేశంలో అత్యధికంగా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీ: జగన్

దేశంలో అత్యధిక మందికి పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందని సీఎం జగన్‌ అన్నారు. నెలరోజుల్లోనే టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకున్నామని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందు రాష్ట్రంలో ఒక్క వీఆర్‌డీ‌ఎల్‌ ల్యాబ్‌ కూడా లేదని.. ఇప్పుడు 9 చోట్ల కరోనా టెస్టింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 74,551 మందికి పరీక్షలు చేశామని సీఎం వివరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్‌ అంశాల విషయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలపై రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ సందేశమిచ్చారు.  దేశంలో అత్యధికంగా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ...

Read More »

నాడు-నేడు పై సీఎం జగన్‌ సమీక్ష

నాడు-నేడు పై సీఎం జగన్‌ సమీక్ష

ప్రభుత్వ పాఠశాలలో ‘నాడు-నేడు’ కింద చేపడుతున్న కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. జూన్‌ కల్లా పనులు పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్కూళ్లలో ఫర్నిచర్‌, చాక్‌బోర్డ్స్‌ తదితర వాటికి దాదాపుగా టెండర్లు పూర్తయ్యాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. మిగిలిన ఒకటి రెండు అంశాలకు కూడా త్వరలోనే ...

Read More »

‘వైఎస్సార్‌‌ సున్నా వడ్డీ’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

‘వైఎస్సార్‌‌ సున్నా వడ్డీ' పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

కరోనా కష్ట సమయంలో కూడా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ పథకాన్ని తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఆన్‌లైన్‌ ద్వారా బటన్‌ నొక్కి నగదు బదిలీ చేశారు. ఈ బటన్‌ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఒకే విడతన డబ్బులు జమ అయ్యాయి.90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ...

Read More »

కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో తలసేమియా, క్యాన్సర్, డయాలసిస్‌ లాంటి వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాలన్నారు. కోవిడ్‌-19 నివారణ చర్యలపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా… కరోనా పరీక్షల సంఖ్య బాగా పెరిగిందని అధికారులను అభినందించారు. మరింత విస్త్రృతంగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అదే సమయంలో ఎమర్జెన్సీ కేసులు ముఖ్యంగా.. డెలివరీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. 104కు కాల్‌చేస్తే వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఎవరికీ ఏ సమస్య ఉన్నా ...

Read More »

కష్టాల్లో ఉన్నా.. పథకాల్లో ముందుకే -సీఎం జగన్

కష్టాల్లో ఉన్నా.. పథకాల్లో ముందుకే

ఆర్థికంగా రాష్ట్రం కష్టాల్లో ఉన్నా పేదవాడికి మేలు చేసేందుకు సంక్షేమ పథకాల విషయంలో ముందడుగు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రతి నెలా ఒక కొత్త కార్యక్రమంతో కులాలు, మతాలు, రాజకీయాలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, అమ్మ ఒడి పథకాలతోపాటూ, పెన్షన్లను రూ. 2,250 వరకు తీసుకెళ్లామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా కరోనా ...

Read More »

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి రూ.10వేలు సాయం

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి రూ

లాక్‌డౌన్, కరోనాపై జగన్ సర్కార్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.. అధికారులతో చర్చిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. తాజాగా లాక్‌డౌన్‌, చేపల వేటపై నిషేధం వల్ల దాదాపు మూడు నెలల పాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. 20 రోజుల్లో వేట విరామ సాయం అందించేందుకు లబ్దిదారుల గుర్తింపు ప్రారంభమైంది. క్షేత్రస్ధాయి సిబ్బంది, ప్రస్తుతం పడవలపై పనిచేస్తున్న కార్మికుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. వేట విరామ సాయం లబ్దిదారుల ఎంపికకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే మత్స్యకార సామాజికవర్గాన్ని ...

Read More »

కరోనా బాధితులకు 2వేలు ఆర్థిక సహాయం- జగన్‌

కరోనా బాధితులకు 2వేలు ఆర్థిక సహాయం

రాష్ట్రంలోని కరోనా అనుమానితులందరినీ గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన సుమారు 32వేల మందికి కూడా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ర్యాండమ్‌ పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, బాధితులకు అందుతున్న చికిత్స సహా ఇతర అంశాలపై సీఎం జగన్‌ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. క్వారంటైన్‌ సెంటర్లలో మెడికల్‌ ...

Read More »

కోవిడ్‌-19 ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

కోవిడ్‌-19 ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

రాష్ట్రంలో తయారైనా కోవిడ్‌-19 ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరి రజత్‌ భార్గవ్‌ ఇతక ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Read More »

ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.కోటి విరాళం

ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.కోటి విరాళం

కరోనా నివారణ చర్యల కోసం పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలు, వ్యాపార వేత్తలు, వర్తక, వాణిజ్య సంఘాలు సీఎం సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందించాయి. ఈమేరకు ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి 1 కోటి 4 లక్షల 7 వేల 838 రూపాయల చెక్కును అందజేశారు.

Read More »