Tag Archives: YS Jagan

జగనన్న కటౌట్ చూస్తేనే ప్రతిపక్షాలకు ఫీజులు ఎగిరిపోతాయి

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కటౌట్ చూస్తేనే ప్రతిపక్షాలకు ఫీజులు ఎగిరిపోతాయ‌ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్‌కే. రోజా అన్నారు. ప్లీన‌రీ స‌మావేశాల్లో రోజా మాట్లాడారు. ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు. ప్రజలు మెచ్చిన నాయకుడు, విధికి కూడా తలవంచని వాడు, తలెత్తుకుని తిరిగే వీరుడు మన జగనన్న, అలాంటి జగనన్న కన్న విజయమ్మ గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. 

Read More »

నాన్నా.. మీ జీవిత‌మే నాకు స్ఫూర్తి

దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌యుడు, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు. నాన్నా.. మిమ్మ‌ల్ని ఆరాధించే కోట్ల మంది చిరున‌వ్వుల్లో నిత్యం మీ రూపం క‌నిపిస్తూనే ఉంటుంది. ఇచ్చిన మాట, న‌మ్మిన సిద్ధాంతం కోసం ఆఖ‌రి శ్వాస వ‌ర‌కు క‌ట్టుబ‌డి జీవించిన మీ జీవిత‌మే నాకు స్ఫూర్తి. ప్ర‌జా సంక్షేమం కోసం మీరు చేసిన ఆలోచ‌న‌లు ఈ  ప్ర‌భుత్వానికి మార్గ‌ద‌ర్శకం అంటూ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు. 

Read More »

రేపు, ఎల్లుండు కడపలో జగన్‌ పర్యటన

జూలై 7, 8న వైఎస్సార్ కడప జిల్లాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్  రేపు పులివెందుల, వేంపల్లెలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్న సీఎంజూన్ 8న ఉదయం వైఎస్సార్‌కు నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి,అనంతరం విజయవాడ చేరుకుని పార్టీ ప్లీనరీలో పాల్గొననున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి .

Read More »

931.02 కోట్లతో.. జగనన్న విద్యాకానుక

వేసవి సెలవుల అనంతరం 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజు జూలై 5న సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా వరుసగా మూడో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక (జేవీకే) స్టూడెంట్‌ కిట్లను పంపిణీ చేసింది. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వీటి పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్థులకు ఇవి అందనున్నాయి. ఇందుకోసం రూ.931.02 కోట్లను ప్రభుత్వం వ్యయం చేస్తోంది. 

Read More »

తాడేపల్లికి చేరుకున్న జగన్‌

వైఎస్‌ జగన్‌ దావోస్‌ పర్యటనను ముగించుకుని మంగళవారం తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రితోపాటు వెళ్లిన మంత్రుల బృందం నేడు స్వదేశానికి చేరుకుంది. విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సిఎం జగన్‌కు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

Read More »

మెగా పవర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన జగన్‌

 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులోని ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండాలో పవర్‌ ప్రాజెక్ట్‌ త్రీడీ మోడల్‌ నమూనాను మంగళవారం ప్రారంభించారు. ఒకే యూనిట్‌ నుంచి సోలార్‌, విండ్‌, హైడల్‌ పవర్లను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 5,230 మెగావాట్ల ఉత్పత్తి చేస్తారు.

Read More »

రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన జగన్‌

వైఎస్సార్‌ రైతు భరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించింది.ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. 

Read More »

వరుసగా నాలుగో ఏడాది వైయస్ఆర్ మత్స్యకార భరోసా

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ కోనసీమ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఐ పోలవరం మండలం మురమళ్ల‌లో నాలుగో ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ఆయ‌న‌ ప్రారంభించి, అనంత‌రం మురమళ్ల‌ వేదికపై ప్ర‌సంగించారు. భ‌గ‌వంతుడి దయతో మరో మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామ‌ని, దాదాపు 1,09,000 మందికి మంచి జరిగే కార్యక్రమాన్ని ముమ్మడివరంలో చేయబోతున్నామ‌ని చెప్పారు.ఇందులో భాగంగా నాలుగో ఏడాది కూడా ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఇస్తున్నామ‌ని తెలిపారు. ఈ ఏడాది 1,08,755 మంది మత్సకారుల ఖాతాల్లో 109 కోట్ల రూపాయ‌లు జమ చేస్తున్నామ‌ని ...

Read More »

రోడ్ల ప్రగతికి ఏడాది గడువు : జగన్‌

రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. విపక్షాల విమర్శలను చాలెంజ్‌గా తీసుకుని, గుంతలు లేకుండా రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు. రోడ్ల అభివృద్ధి ప్రగతిపై అధికారులకు ఏడాది గడువును నిర్దేశించారు. ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌శాఖల రోడ్లపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిఎం బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన రోడ్ల ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 7,804 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బి రోడ్ల అభివృద్ధికి రూ.2,500 కోట్లను, పంచాయతీరాజ్‌ (పిఆర్‌) ...

Read More »

జ‌గ‌న‌న్న విద్యాదీవెన నిధులు విడుద‌ల

చదువు అనేది మనిషి చరిత్రను, కుటుంబ చరిత్రను, సామాజిక వర్గ చరిత్రను, రాష్ట్ర చరిత్రను, దేశ చరిత్రను మారుస్తుందని ముఖ్య‌మంత్రి జగన్‌ అన్నారు. తిరుప‌తిలోని ఎస్వీ యూనివ‌ర్సిటిలోని తార‌క రామ స్టేడియంలో విద్యా దీవెన చివ‌రి త్రైమాసికానికి సంబంధించిన న‌గ‌దు జ‌మ కార్య‌క్ర‌మంలో పాల్గొని ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్క బటన్ నొక్కి జమ చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. చదువు అనేది పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అని అన్నారు. చదువును ఎవ్వరూ కూడా దొంగతనం చేయలేని అన్నారు. ...

Read More »