Tag Archives: YS Jagan

జగన్‌పై ప్రశంసలు కురిపించిన టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు

 వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాపులపట్ల అనుసరిస్తున్న విధానం చాలా బాగుందని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి ప్రశంసించారు. కమలాపురం నియోజకవర్గంలో టిడిపి కాపులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడానికి సీఎం వైఎస్‌ జగనే కారణమని అన్నారు. వైఎస్సార్‌ జిల్లా కమలాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన టిడిపి కాపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ కాపులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

Read More »

వైఎస్ విజ‌య‌మ్మ‌కు జన్మదిన శుభాకాంక్షలు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జన్మనిచ్చిన ధన్య మాత వైఎ‌స్ విజ‌య‌మ్మ అని అన్నారు. 

Read More »

‘ఆచార్య’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు గెస్ట్‌గా జగన్‌..!

 ఆచార్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏప్రిల్‌ 23న విజయవాడలోని సిద్దార్థ జూనియర్‌ కాలేజ్‌లో నిర్వహించనున్నారు. అయితే ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎపి సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి రానున్నాడు. యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌, పూజా హెగ్డే కథానాయికలుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సాధిస్తున్నాయి.

Read More »

కేబినెట్‌లో 8 మంది పాతవారిని కొనసాగించే అవకాశం!

మంత్రివర్గ విస్తరణపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ తుది కసరత్తు చేస్తున్నారు. సీఎంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమై కేబినెట్‌ విస్తరణపై చర్చిస్తున్నారు. కొత్తగా అధికారం చేపట్టనున్న మంత్రులకు రేపు సాయంత్రానికి అధికారికంగా లేఖలు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాత కేబినెట్‌ నుంచి 8 నుంచి 10మందిని కొనసాగించే అవకాశం ఉంది. కుల సమీకరణ, కొత్త జిల్లాను పరిగణనలోకి తీసుకుని మిగతావారిని ఎంపిక చేసేందుకు తుది కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. 

Read More »

‘ఎల్లో పార్టీ, మీడియాల కడుపు మంటకు మందే లేదు’: జగన్‌

పిల్లలకి ఇచ్చే చిక్కీపై సీఎం బమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియాదేనని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నంద్యాల జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గన్న ఆయన.. ప్రతీ ఇంటి మేనమామగా పిల్లలను చదివించే బాధ్యత తనదని మరోసారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.ఎల్లో పార్టీ కడుపు మంట, అసూయకు మందే లేదని.. చివరికి పిల్లలకు అందుతున్న సంక్షేమ పథకంపై కూడా అక్కసు వెల్లగక్కుతున్నారంటూ జాలిపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో తక్కువగా ఉన్న జీఈఆర్‌ రేషియో, ప్రభుత్వ బడులలో ...

Read More »

ఎల్లో మీడియా తప్పుడు వార్తలపై జగన్‌ ఆగ్రహం

టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఓ దొంగల ముఠా అని, దొంగల ముఠా హైదరాబాద్‌లో ఉంటూ వైసిపి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. జిల్లా ఆవిర్భావం అనంతరం తొలిసారి పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ వాళ్లంతా మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలని, గతంలో ఎపిని దోచుకుని అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు. ప్రధాని మోడీ తనకు ...

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల అవతరణ

సోమవారం ఎపి కొత్త జిల్లాలను సిఎం వైఎస్‌.జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. 42 ఏళ్ల తరువాత ఎపిలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. 13 జిల్లాలు, 26 జిల్లాలుగా పున: వ్యవస్థీకరణయ్యాయి.  కొత్త జిల్లాల ఏర్పాటును  సోమవారం తాడేపల్లి కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల కార్యాలయాల ద్వారా సేవలందించేందుకు .. ఆయా జిల్లాలకు చేరుకున్న ఉద్యోగులందరికీ కూడా, ప్రతి ఒక్కరికీ సిఎం జగన్‌ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

Read More »

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ప్రారంభించిన జగన్‌

అధునాతన వసతులతో రూపొందించిన వైఎస్‌ఆర్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ (102) వాహనాలను సిఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం ప్రారంభించారు. విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ వేదికగా శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించారు. 500 ‘డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలు ప్రారంభమయ్యాయి. ఈ వాహనాలను తహశీల్దార్లు, విఆర్‌ఒల పర్యవేక్షణలో ఆయా జిల్లాలకు పంపించనున్నారు.

Read More »

భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటు : జగన్‌

రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని ఎపి సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ‘జగనన్న శాశ్వత భూ హక్కుాభూ రక్ష ‘ పథకంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ పథకానికి సంబంధించిన సమగ్ర వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈసందర్భంగా అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన డ్రోన్‌ను పరిశీలించారు.అనంతరం జగన్‌ మాట్లాడుతూ గతంలో వెబ్‌ ల్యాండ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్‌ పద్ధతిలోనే కాకుండా ఫిజికల్‌ రికార్డులను కూడా తయారు చేయాలన్నారు. ఫిజికల్‌ డాక్యుమెంట్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సీఎం ...

Read More »

ఇళ్లు కాదు…ఊళ్ళే కడుతున్నాం : జగన్‌

రాష్ట్రంలో చేపట్టిన జగనన్న కాలనీల పథకం ద్వారా కేవలం ఇళ్లు కట్టడం లేదని, ఊళ్ల నిర్మాణమే జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గృహనిర్మాణ శాఖపై గురువారం శాసనసభలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 13వేల పంచాయతీల్లో 17,005 కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయని చెప్పారు. జగనన్న కాలనీ మొదటి దశలో భాగంగా 15.60లక్షల ఇళ్లు నిర్మాణం అవుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల్లో ప్రతి ఎంఎల్‌ఏ తల ఎత్తుకుని తిరిగేలా ఈ పనులు సాగుతున్నాయని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న పనులు చూసి ...

Read More »