Tag Archives: YS Jagan

ఇళ్లు కాదు…ఊళ్ళే కడుతున్నాం : జగన్‌

రాష్ట్రంలో చేపట్టిన జగనన్న కాలనీల పథకం ద్వారా కేవలం ఇళ్లు కట్టడం లేదని, ఊళ్ల నిర్మాణమే జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గృహనిర్మాణ శాఖపై గురువారం శాసనసభలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 13వేల పంచాయతీల్లో 17,005 కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయని చెప్పారు. జగనన్న కాలనీ మొదటి దశలో భాగంగా 15.60లక్షల ఇళ్లు నిర్మాణం అవుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల్లో ప్రతి ఎంఎల్‌ఏ తల ఎత్తుకుని తిరిగేలా ఈ పనులు సాగుతున్నాయని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న పనులు చూసి ...

Read More »

మహిళా దినోత్సవం సభలో జగన్

రాష్ట్రంలోని ప్రతి మహిళా సాధికారత సాధించడమే ప్రభుత్వ విధానమని, ఇదే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా సిఎం హాజరయ్యారు. జ్యోతి వెలిగించి, వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రసంగం ప్రారంభంలో రాష్ట్ర మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

జగన్‌, కేంద్రమంత్రి షెకావత్‌ పోలవరం పర్యటన

పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ శుక్రవారం పరిశీలించారు. పునరావాస కాలనీలను పరిశీలించిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ముందుగా వ్యూ పాయింట్‌ వద్ద పరిశీలన చేసిన సీఎం, కేంద్రమంత్రి.. తర్వాత స్పిల్‌వే వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ పరిశీలించారు. అనంతరం పూర్తైన ఎగువ కాఫర్‌ డ్యాంను పరిశీలించారు.

Read More »

నేడు ‘జగనన్న తోడు’ మూడో విడత రుణాల పంపిణీ

రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులు మరో 5,10,462 మందికి ప్రభుత్వం రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి మూడో విడత రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.

Read More »

రేపు విశాఖలో సిఎం జగన్‌ పర్యటన

రేపు విశాఖలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు బయల్దేరనున్నారు. ఉదయం 11 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి శ్రీశారదా పీఠం చేరుకుంటారు సీఎం. ఆ తర్వాత శ్రీశారదా పీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి తాడేపల్లికి తిరుగుపయనం అవుతారు సీఎం జగన్.

Read More »

20న వైఎస్సార్‌, విశాఖ జిల్లాల్లో జగన్‌ పర్యటన

వైఎస్సార్‌ జిల్లా, విశాఖపట్నం జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కడప చేరుకోనున్న సీఎం, అనంతరం పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు.ఆ తర్వాత కడప రింగ్‌ రోడ్‌ జయరాజ్‌ గార్డెన్స్‌లో డిప్యూటీ సీఎం ఎస్‌బి.అంజాద్‌ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. అదే రోజు సాయంత్రం 4.45 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి నేవల్‌ ఎయిర్‌స్టేషన్, ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద భారత రాష్ట్రపతి ...

Read More »

అదనపు ఆదాయం కోసం అధికారులతో సిఎం చర్చలు

అదనపు ఆదాయాల కోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్థిక, రెవెన్యూ, వాణిజ్యం, ఎక్సైజ్‌, అటవీ, పర్యావరణం, గనులశాఖలపై సిఎం బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రం సొంత ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి సారించాలని, అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో పద్ధతులను పరిశీలించాలని కోరారు. రాష్ట్రం సొంత ఆదాయం పెరగడానికి తగిన ఆలోచనలు చేయాలని, వాటిని కార్యరూపంలోకి తీసుకురావడంపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ అంశాలపై ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించేందుకు సంబంధిత ...

Read More »

సిటీజెన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ ను ప్రారంభించిన జగన్

 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించేందుకు రూపొందించిన నూతన సాఫ్ట్‌వేర్‌ పోర్టల్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఆవిష్కరించనున్నారు. సిటీజెన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ 2.0 కాసేపట్లో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభిస్తారు. ఒకే పోర్టల్‌ కిందకు వేర్వేరు శాఖల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే సచివాలయాల ద్వారా రెండేళ్లలో 3.47 కోట్ల సేవలు ప్రజలకు అందాయి. ఇంకాస్త వేగంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం నూతన సాఫ్ట్‌వేర్‌ పోర్టల్‌ను రూపొందించింది. 

Read More »

వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ను ప్రారంభించిన జగన్

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,92,674 మంది అక్కచెల్లెమ్మలు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు. ఇందుకు 589 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ పథకం కోసం విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..  దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యాక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. రాజ్యాంగ స్పూర్తిని అనుసరిస్తూ అడుగులు వేస్తున్నామని తెలిపారు.

Read More »

విడాకులు తీసుకోనున్న ధనుష్‌, ఐశ్వర్య దంపతులు

తమిళ హీరో ధనుష్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య దంపతులు విడాకులు తీసుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు వారు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ’18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరినొకరు అర్థం చేసుకొని మా ప్రయాణాన్ని కొనసాగించాం. అయితే ఇప్పుడు మేము విడిపోవాలని నిర్ణయించుకొని..వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత గోప్యత అవసరం’ అని ధనుష్‌ ట్విటర్‌లో పోస్టు చేసిన లేఖలో పేర్కొన్నారు.మరోవైపు ధనుష్‌ పోస్టు చేసిన లేఖనే ...

Read More »