Tag Archives: ys vijayamma

యాత్ర2 సినిమాపై వైఎస్ విజయమ్మ ప్రశంశలు…

యాత్ర2 లో వైఎస్ రాజశేఖర్ ‌రెడ్డిని కళ్లకు కట్టినట్టు మరోసారి ప్రజలకు చూపించారన్నారు వైఎస్ విజయమ్మ. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో యాత్ర సినిమాను వీక్షించిన విజయమ్మ… రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా అద్భుతంగా ఉందన్నారు. ఇంత మంచి చిత్రాన్ని రూపొందించిన డైరెక్టర్ మహిరెడ్డికి, చిత్ర బృందానికి అభినందలు తెలిపారు. రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, ఆశయాలను, రాజకీయ జీవితాన్ని.. మరోసారి ప్రజల కళ్లకు కట్టినట్టు చూపారని ప్రశంసించారు. ఆనాడు, రాజశేఖర్‌రెడ్డిని ఆదరించిన ప్రజలు.. ఇప్పుడు ఆయన పిల్లలను కూడా అక్కున చేర్చుకుంటున్నారని ...

Read More »

వైస్ షర్మిల కు కాబోయే కోడలికి విజయమ్మ గిఫ్ట్!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కుమారుడు వైఎస్ రాజా రెడ్డి త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ప్రియా అట్లూరి అనే యువతిని ఆయన ప్రేమ వివాహం చేసుకోబోతున్నారంటూ మీడియా, సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం రాజా రెడ్డి, ప్రియా అట్లూరి కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. దాంతో వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇలా ఉండగానే.. ...

Read More »

జగన్‌ను చూసి గర్వపడుతున్నా..వైయ‌స్‌ విజయమ్మ

మీ అందరి ప్రేమ సంపాదించిన వైయ‌స్ జగన్‌ను చూసి గర్వపడుతున్నా..అని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయ‌స్‌ విజయమ్మ అన్నారు. నా బిడ్డను నడిపించుకోమని మీకే అప్పజెప్పా. నా బిడ్డను నడిపించిన మీ అందరిపైనా నా అణువణువునా కృతజ్ఞత ఉంది.  మీ బిడ్డల్ని వైయ‌స్ జగన్‌ చేతుల్లో పెట్టండి, వారికి ఉజ్వల భవిష్యత్‌ అందిస్తార‌ని చెప్పారు. మీతో నా అనుబంధం ఈనాటిది కాదు, 45 ఏళ్ల​ అనుబంధం ఉంది. ఇకపైనా ఈ అనుబంధం కొనసాగాలి అంటూ వైయ‌స్‌ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు.

Read More »

వైఎస్ విజ‌య‌మ్మ‌కు జన్మదిన శుభాకాంక్షలు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జన్మనిచ్చిన ధన్య మాత వైఎ‌స్ విజ‌య‌మ్మ అని అన్నారు. 

Read More »

వైఎస్ఆర్‌కు నివాళులర్పించిన విజయమ్మ, షర్మిల

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేడు. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళి అర్పించేందుకు ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిల నివాళర్పించారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.

Read More »