Tag Archives: ysrcp

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై MP విజయసాయిరెడ్డి ఫైర్

టీడీపీ-జనసేన-బీజేపీల కూటమిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు జనసేన నేతలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో కుల, మతతత్వ పార్టీలు అన్ని ఒక్కటయ్యాయని అన్నారు. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి భవిష్యత్ లేదని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎంపీ అభ్యర్థి దొరకలేదని.. ...

Read More »

సినిమా వాళ్లకు రాజకీయాలెందుకు?: పవన్ పై ముద్రగడ ఫైర్

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ… జనసేనాని పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. సినిమా వాళ్లకు రాజకీయాలెందుకు? అని ఎత్తిపొడిచారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొద్దికాలంలోనే జెండా ఎత్తేశారని, పవన్ కల్యాణ్ కూడా అందుకు మినహాయింపు కాదని అన్నారు. సినిమా వాళ్లు రాజకీయాలకు పనికిరారని అభిప్రాయపడ్డారు. మా ఇంటికొస్తే ఏం తెస్తారు… మీ ఇంటికి వస్తే ఏమిస్తారు?… అన్న చందంగా సినిమా వాళ్ల వ్యవహారం అంతా ఇలాగే ఉంటుందని వ్యంగ్యం ...

Read More »

ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. ఒకేసారి చంద్రబాబు, జగన్ ప్రచారం ప్రారంభం

ఏపీలో పొలిటికల్ హీట్ రానురాను పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మార్చి 27న ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇద్దరు నేతలూ రాయలసీమలోని తమ సొంత నియోజకవర్గాల నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేశాయి. దీంతో, ప్రధాన పార్టీల ఫోకస్ ప్రచారం వైపు మళ్లింది. ఎల్లుండి నుంచి సీఎం జగన్, చంద్రబాబు ...

Read More »

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏప్రిల్‌ 2, 3 తేదీల్లో బస్సు యాత్ర

ఈ నెల 27న మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వచ్చే నెల 2, 3, తేదీల్లో బస్సు యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. మూడో తేదీ సాయంత్రం తిరుపతి పార్లమెంట్ పరిధిలో బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, తిరుపతి పార్లమెంట్ పరిధిలో శ్రీకాళహస్తి, నాయుడుపేటలో బహిరంగ సభలు ఉంటాయని తెలిపారు.

Read More »

ఏ టాలీవుడ్‌ హీరోకు లేని క్రేజ్ సీఎం జగన్ కు ఉంది – మంత్రి రోజా

ఏ టాలీవుడ్‌ హీరోకు లేని క్రేజ్ సీఎం జగన్ కు ఉందని పేర్కొన్నారు ఏపీ మంత్రి రోజా. 27 తేది నుండి సిఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభిస్తారు…2014 లో చంద్రబాబు గెలిచి ప్రజలు మోసం చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆగ్రహించారు. తిరుపతి వెంకన్న సాక్షిగా హోదా సహా చాలా హామీలు ఇచ్చారు…చివరికి ఆయనకే శఠగోపం పెట్టారని మండిపడ్డారు. టిడిపి, జనసేన అభ్యర్థులు అత్యంత పేలవంగా రిలీజ్ చేశారు ..దాంతో మా వాళ్ళు గెలిచినట్లు సంబరాలు చేసుకున్నారు..ఎన్నో ఎళ్ళగా ...

Read More »

విశాఖ డ్రగ్స్‌.. చంద్రబాబు, లోకేష్‌లపై విచారణ జరపాలి

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాను వైఎస్సార్‌సీపీ నేతలు కలిశారు. సీఈవోతో పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు, మనోహర్ రెడ్డి, నారాయణ మూర్తి భేటీ అయ్యారు. వైజాగ్ డ్రగ్ రాకెట్‌లో చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్రపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికి టీడీపీ నేతలు ఈ డ్రగ్స్‌ని తెప్పించే ప్రయత్నం చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు అవాస్తవాలతో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై చేసిన ట్వీట్‌పైన చర్యలు తీసుకోవాలని సీఈవోకి ఆ ...

Read More »

మంత్రి రోజా జీవిత చరిత్రపై బుక్ విడుదల

మంత్రి రోజా జీవిత చరిత్రపై బుక్ విడుదల అయింది. “ రంగుల ప్రపంచం నుంచి రాజీకీయాల్లోకి “ అనే పేరు రోజా జీవిత చరిత్రపై పుస్తకం విడుదల చేశారు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. కాగా రోజా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి.. రాజకీయాల్లో ఎదుగుతున్న సంగతి తెలిసిందే. ఇక అంతకు ముందు నగరి నియోజకవర్గంలో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తా అని ధీమా వ్యక్తం చేశారు రోజా. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు కారణంగా రెండు ...

Read More »

డ్రగ్స్ విషయంలో టీడీపీ-బీజేపీ నేతల పాత్ర ఉంది : సజ్జల

డ్రగ్స్ విషయంలో టీడీపీ-బీజేపీ నేతల పాత్ర ఉందని అనుమానిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు సజ్జల. తప్పించుకోవడానికే మాపై నిందలు వేస్తున్నారు. విశాఖ డ్రగ్స్ విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలున్నాయని తెలిపారు. మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని చంద్రబాబు పగటి కలలు కంటున్నారు. లోకేష్ కూడా ప్యూచర్ లో సీఎం అవుతానని కలలు కంటున్నాడని గుర్తు ...

Read More »

మినిస్టర్ రజిని దూకుడు.. టీడీపీ కంచుకోటలో నో కోఆర్డినేషన్

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి మాధవీలతకు లోకల్ టీడీపీ నుంచి సరైన సహకారం రావట్లేదనే విమర్శలు ఇప్పుడు చర్చనీయాంశమైంది. రజక సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళకు టీడీపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేసి కట్టబెడితే ఇక్కడ లోకల్ లీడర్లు మాత్రం అంటీ అంటనట్లుగా సహకారం అందిస్తున్నారనేది ఆ పార్టీలోనే ఇప్పుడు చర్చించుకోవడం తీవ్ర దుమారం లేపుతోంది. అభ్యర్థి మాధవీలత పశ్చిమలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించగా సమన్వయ కమిటీలోనే కొంతమంది నేతలు కనిపించకపోవడం ...

Read More »

వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని 26వ వార్డులో 50 మంది కార్యకర్తలు స్థానిక పార్టీ దళిత విభాగం సీనియర్‌ నేత ఇంజేటి రవీంద్ర ఆధ్వర్యంలో జనసేన, టీడీపీలను వీడి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు సమక్షంలో వైఎస్సార్‌సీ­పీలో చేరారు. భీమవరం 25వ వార్డుకు చెందిన 100 మంది జనసేన, టీడీపీ నాయకులతో పాటు ప­ట­్ట­ణం­లోని ఆటో వర్కర్స్‌ యూనియన్‌ సభ్యులు భా­రీగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సమక్షంలో వైఎస్సార్‌­సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో బొమ్మదేవర ముస్లి, కలిశెట్టి శ్రీనివాస్, పోలిశెట్టి సత్యనా­రాయణ, ...

Read More »