తమిళ సినిమా పరిశ్రమలో ఐటీ దాడుల కలకలం

తమిళ సినిమా పరిశ్రమలో ఐటీ దాడుల కలకలం రేగింది. పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పన్నుఎగవేతలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో… మంగళవారం ఆదాయ పన్ను శాఖ తనిఖీలు నిర్వహించింది. ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయం నుంచి సోదాలు ప్రారంభమయ్యాయి.ఇదివరకు 2020 ఫిబ్రవరిలో చెన్నైలోని అన్బు చెగియాన్‌కు చెందిన నివాసంలో ఐటీ దాడులు జరిగాయి. తమిళ స్టార్‌ విజయ్ నటించిన బిగిల్‌ సినిమా విడుదలైన తర్వాత ఆ తనిఖీలు జరిగాయి. అప్పుడు విజయ్, మరికొందరు నిర్మాతల ఆర్థిక కార్యకలాపాలపై ఐటీ దృష్టి సారించింది.