బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించేవారెవ్వరిపైనైనా బిజెపి విల్లెక్కుపెడుతుంది. ఈ విషయంలో తరచూ తమిళనాట హీరోలపై విరుచుకుపడే బిజెపి ఇప్పుడు హీరో సూర్య పై మాటల అస్త్రాలు సంధిస్తోంది. బిజెపి విధానాలను ప్రశ్నించిన హీరోలు విజయ్, అజిత్లపై బిజెపి మాటల యుద్ధాలు చేసింది. తాజాగా.. బిజెపి తీసుకొచ్చిన నీట్ విధానం తమిళనాట పేద విద్యార్థులకు శాపంగా మారబోతోందని అభిప్రాయాన్ని వెల్లడించిన సూర్యపై విల్లెక్కుపెట్టింది. గతంలో మెర్సల్ సినిమాలో బిజెపికి వ్యతిరేకంగా హీరో విజయ్ మాట్లాడారని, ఇప్పుడు తమిళనాడు గవర్నర్ గా ఉన్న తమిళ సై యుద్ధాలు చేసినంత పనిచేసింది. దాని వల్ల విజయ్ కి జరిగిన నష్టం ఏమీ లేదు. హీరో అజిత్ బిజెపి లో చేరబోతున్నాడని అజిత్ అభిమానులు బిజెపిలో చేరాలని బిజెపి అప్పట్లో ఒక బూటకపు ప్రచారం చేసుకుంది. బిజెపికి తనకు ఎలాంటి సంబంధం లేదని అజిత్ ప్రకటన విడుదల చేయడంతో బిజెపి రాజకీయ ఎత్తుగడకు ఫుల్స్టాప్ పెట్టినట్లయింది.
