తాప్సీ సీక్రెట్ పెళ్లి వీడియో వైరల్ ..

హీరోయిన్ తాప్సీ తెలుగు సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటుంది. కొన్ని రోజుల క్రితం తాప్సీ, తన బాయ్ ఫ్రెండ్ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్‌ ని పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చాయి. గత పదేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ తాప్సీ, మథియాస్ ఎప్పుడూ వాటిపై స్పందించలేదు.

పది రోజుల క్రితం తాప్సీ, మథియాస్ బోయ్ ఉదయ్ పూర్ లోని ఓ హోటల్ లో సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఒక్క ఫోటో, ఒక్క వీడియో కూడా లీక్ అవ్వకుండా జాగ్రత్తపడ్డారు. మీడియాకి కూడా ఎలాంటి సమాచారం వెళ్లకుండా చూసుకున్నారు. పెళ్లి జరిగిన రెండు వారాల తర్వాత తాప్సీ పెళ్లి నుంచి ఓ వీడియో లీక్ అయింది. ఈ వీడియోలో తాప్సీ డప్పుల వాయిద్యాల మధ్య డ్యాన్స్ చేసుకుంటూ నడుస్తూ వస్తుంది. తాప్సీ వచ్చి మథియాస్ ని కౌగలించుకొని అనంతరం ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. తాప్సీ పెళ్లి వీడియో వైరల్ అవ్వడంతో తాప్సీ నిజంగానే పెళ్లి చేసేసుకుందని క్లారిటీ వచ్చేసింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో మరోసారి పలువురు నెటిజన్లు ఈ జంటకి కంగ్రాట్స్ చెప్తున్నారు.