విడుదలకు సిద్దమైన ట్యాక్సీ

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీష్‌ సజ్జా ట్యాక్సీస చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హెచ్‌ అండ్‌ హెచ్‌ ఎంటర్టెన్మెంట్స్‌ బ్యానర్‌ పై హరిత సజ్జా (ఎం.డి) నిర్మిస్తున్నారు. బిక్కి విజరు కుమార్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వసంత్‌ సమీర్‌ పిన్నమ రాజు, అల్మాస్‌ మోటివాలా, సూర్య శ్రీనివాస్‌, సౌమ్య మీనన్‌ , ప్రవీణ్‌ యండమూరి, సద్దాం హుస్సేన్‌, నవీన్‌ పండిత తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మార్క్‌ రాబిన్‌ సంగీతం అందిస్తుండగా ఉరుకుండారెడ్డి ఎస్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆనంద్‌ పల్లకి వి.ఎఫ్‌ ఎక్స్‌ అందిస్తుండగా, టి.సి.ప్రసన్న ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.యూత్‌ ఆడియన్స్‌ కనెక్ట్‌ అయ్యేలా వైవిధ్యమైన కథాంశంతో సస్పెన్స్‌ అండ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ ‘ట్యాక్సీ’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.