ప్రియాంక జవాల్కర్‌కి పాజిటివ్‌

టాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక జవాల్కర్‌ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె.. ఇటీవల తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. అలాగే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, అవసరమైతే తప్ప బయటికి రావద్దని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో సూచించారు.