దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే భవాని

దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే భవాని

సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని సీరియస్‌గా తీసుకున్నారు. ఆమె రాజమండ్రి దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియాలోఅసభ్యకర కామెంట్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. భవానికి మద్దతుగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో పాటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం దిశ పోలీస్ స్టేషన్ దగ్గర టీడీపీ నేతలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణగా దిశ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం.. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.