నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ మంత్రి వర్గం సోమవారం సాయంత్రం సమావేశం కానుంది. కేంద్రం ఇచ్చిన లాక్ డౌన్ సడలింపులపై చర్చించనుంది. ప్రజా రవాణా విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్రం అనుమతించిన సడలింపులన్నీ రాష్ట్రంలో అమలు చేయాలా? వద్దా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా ప్రజా రవాణా పునరుద్ధరణ నిర్ణయాధికారాలను కేంద్రం రాష్ట్రాలకే అప్పగించింది. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజా రవాణాను పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం.
మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించే అవకాశముంది.కేంద్రం సడలింపులు ఇస్తే బస్సుల పున:ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని గతంలో కేసీఆర్ అన్నారు. దీనిపై సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.