సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా మరో తెలుగు వ్యక్తి

సుప్రీంకోర్టుకు ముగ్గురు మహిళా న్యాయమూర్తులు సహా 9 మందిని నియమించాలంటూ సుప్రీం కొలీజియం చేసిన సిఫారసులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. ఈ నియామకాలపై నోటిఫికేషన్లు కేంద్ర న్యాయశాఖ గురువారం జారీ చేసింది. ఈ నియమాకాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీఎస్‌ నరసింహా న్యాయవాది నుంచి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులవుతున్నారు. ఇలా గతంలో 8 మంది న్యాయవాదులు నేరుగా సుప్రీంకోర్టు జడ్జిలయ్యారు. తాజాగా నియమితులైన నరసింహా అయోధ్య కేసులాంటి పలు సంచలన కేసుల్లో వాదించారు. ఈయనతోపాటు.. వయసు రీత్యా సీనియారిటీ ప్రకారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ నాగరత్నకు సీజేఐ అయ్యే అవకాశాలున్నాయి. అప్పుడు దీంతో సుప్రీంకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌గా చేసిన మూడో తెలుగువాడుగా నరిసింహ రికార్డులకెక్కుతాడు. ప్రస్తుత సిజెఐ ఎన్‌వి రమణ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన వాడు కాగా గతంలో మరో తెలుగు వ్యక్తి కోకా సుబ్బారావు కూడా చీఫ్‌ జస్టిస్‌గా పని చేశారు. ఒకేసారి ముగ్గురు మహిళా న్యాయమూర్తులను నియమించడం ఇదే తొలసారి. కాగా.. సుప్రీం ప్రధానన్యామూర్తిగా 2027లో జస్టిస్‌ నాగరత్న సీజేఐ కానున్నారు. దీంతో ఆమె తొలి మహిళా చీఫ్‌ జస్టిస్‌గా రికార్డులకెక్కనున్నారు. కొత్త నియమితులైన జడ్జిలు ఈ నెల 31న ప్రమాణ స్వీకారం చేస్తారు.