మేడారంలో కొత్త సంప్రదాయానికి తెర తీసిన కేసీఆర్

మేడారంలో కొత్త సంప్రదాయానికి తెర తీసిన కేసీఆర్

పర్యటనలో భాగంగా.. మేడారంలోని సమక్క-సారక్క వన దేవతలను కుటుంబసమేతంగా దర్శించుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన కొత్త సంప్రదాయానికి తెర తీశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి వనదేవతలకు పట్టువస్త్రాలు సమర్పించారు.  తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రెడ్డిలు కేసీఆర్‌కు దగ్గరుండి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా కేసీఆర్ గద్దె మీదున్న సమ్మక్కకు చీరెను సారిగా పెట్టారు. బెళ్లాన్ని ప్రసాదంగా నివేదించారు. కాసేపటి క్రితమే హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ సీఎం గవర్నర్ తమిళిసై సమ్మక్కను దర్శించుకున్నారు.