సీఎం సాబ్ నువ్వే.. తెలంగాణకు అసలైన బ్రాండ్ అంబాసిడర్

సీఎం సాబ్ నువ్వే.. తెలంగాణకు అసలైన బ్రాండ్ అంబాసిడర్

అసాధారణ పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసం, సాధించాలనే తపన ఉంటే.. అసాధ్యం అనుకున్న వాటిని కూడా సుసాధ్యం చేసి చూపొచ్చు అనడానికి నిదర్శనం కేసీఆర్. తెలంగాణ ఏర్పాటు కావడం కల అనుకున్న వారిని ఆశ్చర్యపరుస్తూ.. ఆయన రాష్ట్రాన్ని సాధించిన తీరు అద్భుతం. తెలంగాణ వచ్చాక ఎలా పాలన సాగిస్తారో చూద్దాం అనుకున్న వారి నోళ్లు మూయిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ నడుపుతున్న తీరు ఆదర్శప్రాయం. సంక్షేమం, అభివృద్ధికి సముచిత ప్రాధాన్యం ఇస్తూ.. కేసీఆర్ పాలన సాగిస్తున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది.