చిన్న సంఘటనను భూతద్దంలో చూస్తున్నారు..

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం చిన్న విషయమని, దానిని భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదని చెప్పారు. మిగతా బ్యారేజీలను కూడా చూడాలని, కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు జరిగిన మేలును కూడా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం చేపట్టిన మేడిగడ్డ సందర్శన యాత్రపై హరీశ్ రావు అసెంబ్లీ ఆవరణలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ తప్పులను కప్పి పుచ్చుకోవడానికి, నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించనున్న సభ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ యాత్ర చేపట్టిందని మండిపడ్డారు.