Telangana Government Raises PG Medical Seat Fees
Telangana Government Raises PG Medical Seat Fees

పీజీ మెడికల్‌ సీట్ల ఫీజుల పెంచిన తెలంగాణ ప్రభుత్వం

పీజీ మెడికల్‌ సీట్ల ఫీజును తెలంగాణ సర్కారు పెంచింది. కన్వీనర్‌ కోటా సీటు ఫీజును ఆయా కాలేజీల ప్రకారం రూ.7 లక్షల నుంచి రూ.7.75 లక్షలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బీ కేటగిరీ సీటు ఫీజు గతంలో రూ. 24.20 లక్షలు ఉండగా, కొన్నిచోట్ల అదే ఫీజు ఖరారు చేసింది. కొన్ని కాలేజీల్లో రూ.23 లక్షలకు తగ్గించింది. సీ కేటగిరీ సీటుకు గరిష్టంగా రూ.72 లక్షల వరకూ వసూలు చేసుకోవడానికి ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు అనుమతినిచ్చింది.ఇక డెంటల్‌ పీజీ ఏ కేటగిరీ ఫీజును రూ.5.15 లక్షలుగా, బీ కేటగిరీ సీటు ఫీజును రూ.8 లక్షలుగా నిర్ణయించారు. సీ కేటగిరీ సీటుకు రూ.12 లక్షల వరకూ వసూలు చేసుకోవచ్చు.