కరోనా టైమ్‌లో షుగర్ పేషెంట్స్ ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే..

మధుమేహం.. ఈ తీపి రోగం.. ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగులుస్తుంది. అనేక కారణాల వల్ల త్వరగా శరీరంలోకి ప్రవేశించి ప్రజలను రోజురోజుకి బలహీనులుగా మార్చడం దీని ప్రత్యేకత ఇలాంటి డేంజర్ సమస్య రావొద్దని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముందునుంచి జాగ్రత్త పడతారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కరోనా విజృంభణ టైమ్‌లో కరోనా నుంచి తప్పించుకోవాలంటే ఎలా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మామూలుగా డయాబెటీస్‌కి ఇన్ఫెక్షన్స్ త్వరగా సోకుతాయి. అందుకే అలాంటి సమస్య రాకుండా ఉండాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

అనేక కారణాల వల్ల మధుమేహం మనదేహంపై దాడిచేస్తుంది. ఎక్కువ శారీరక శ్రమ లేకపోవడం, సరైన జీవనవిధానం లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం ఇలాంటి అనేక కారణాలు అన్ని కూడా మధుమేహంకి కారణంగా మారుతుంది. ఇలాంటి నేపథ్యంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఓసారి మన శరీరంలోకి వచ్చిందంటే చాలు.. ఇతర ఇన్ఫెక్షన్స్ కూడా ఈజీగా సోకుతాయి. మరి ఇప్పుడు కరోనా రోజురోజుకి తన ప్రతాపం చూపుతున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. పోషకాహారం తీసుకుంటూ.. స్వల్ప వ్యాయమాలు కూడా చేయడం మంచిదందంటున్నారు.