నేటి నుంచి 7 గంటలకే పెన్షన్ల పంపిణీ ప్రారంభం

వేసవి, వడగాలుల నేపథ్యంలో ఇవాల్టి నుంచి ఉదయం 7 గంటలకే పెన్షన్ల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉన్న వారు, వృద్ధులు, దివ్యాంగులకు తప్పనిసరిగా ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వనుంది. మిగతా వారు సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలి. అటు నిన్న 26 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ నెల 6వ తేదీలోగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.